పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్‌లలోని ఎనిమిది జిల్లాల పరిధిలో నాలుగు మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం; భారతీయ రైల్వే నెట్‌వర్క్ దాదాపు 410 కి.మీల మేర పెంపు
August 19th, 03:18 pm
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, ఈ రోజు రూ. 9,450 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నాలుగు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు ఇవే:80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 15th, 07:00 am
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడి గుండె చప్పుడు, ప్రతి ఇల్లు త్రివర్ణ పతాక స్ఫూర్తితో, నూతన సంకల్పాలతో ప్రతిధ్వనిస్తున్నాయన్నారు. మహత్తర త్యాగ సంప్రదాయాన్ని మేల్కొలిపిన స్వాతంత్య సమరయోధులందరికీ, గొప్ప విప్లవకారులకు ప్రణమిల్లుతున్నా అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి ప్రసంగం
August 15th, 06:50 am
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడి గుండె చప్పుడు, ప్రతి ఇల్లు త్రివర్ణ పతాక స్ఫూర్తితో, నూతన సంకల్పాలతో ప్రతిధ్వనిస్తున్నాయన్నారు. మహత్తర త్యాగ సంప్రదాయాన్ని మేల్కొలిపిన స్వాతంత్య సమరయోధులందరికీ, గొప్ప విప్లవకారులకు ప్రణమిల్లుతున్నా అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది
August 15th, 06:45 am
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, 140 కోట్ల మంది భారతీయుల శక్తి, సంకల్పంతో 2047 నాటికి వికసిత భారత్‌ను నిర్మించాలనే కల గురించి మాట్లాడారు. శాంతి చట్టం, రైల్వే విద్యుదీకరణ, భారతదేశ వాణిజ్య ఒప్పందాలు, నక్సలిజం అంతం వంటి కీలకమైన కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. 'శక్తి కీ సప్తధార'ను స్వీకరించాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని 3 జిల్లాల్లో మల్టీట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం... ఈ ప్రాజెక్టుతో మరో 46 కి.మీ మేర విస్తరించనున్న భారతీయ రైల్వే వ్యవస్థ
July 24th, 04:05 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బళ్లారి-గుంతకల్ విభాగం మధ్య రూ. 1,264 కోట్ల అంచనా వ్యయంతో 3, 4వ రైల్వే లైన్ నిర్మాణానికి నేడు ఆమోదం తెలిపింది.మయన్మార్ అధ్యక్షుడి భారతదేశ అధికారిక పర్యటన సందర్భంగా భారత్-మయన్మార్ సంయుక్త ప్రకటన
June 01st, 07:16 pm
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హలైన్. 2026 మే 30 నుంచి జూన్ 3 వరకు భారతదేశంలో తన మొదటి అధికారిక పర్యటనను చేపట్టారు.ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 28th, 05:30 pm
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, పార్లమెంటులోని నా సహచరులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారు, ఉత్తరప్రదేశ్ పార్లమెంటు సభ్యులు, యూపీ బీజేపీ అధ్యక్షులు శ్రీ పంకజ్ చౌదరి గారు, జిల్లా పంచాయత్ చైర్‌పర్సన్ సోదరి పూనం మౌర్య గారు, వేదికపై ఉన్న కాశీ నగర మహిళా కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇక్కడికి విచ్చేసిన నా తల్లులు, సోదరీమణులు, ఆడబిడ్డలు అందరికీ నమస్కారం.వారణాసిలో మహిళా సమ్మేళనంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 28th, 05:00 pm
ఈ రోజు వారణాసిలో జరిగిన మహిళా సదస్సులో భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. అక్కడ ఆయన వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.ఈ నెల 28-29 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి పర్యటన
April 26th, 03:46 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 28-29 తేదీల్లో ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 28 సాయంత్రం సుమారు 5 గంటలకు వారణాసిలో జరిగే మహిళా సమ్మేళనంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. అక్కడ ఆయన సుమారు రూ. 6,350 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభనుద్దేశించి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 28th, 12:15 pm
ప్రారంభోత్సవం అయిపోయిందా? ప్రారంభోత్సవం అయిపోయిందా ? లేదు.. సగం పనే పూర్తయింది. నేను కేవలం ఆ కర్టెన్‌ను (తెరను) మాత్రమే తొలగించాను. కానీ నేడు ఇక్కడ ఉన్న మీ అందరి చేతుల మీదుగా ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగాలని నేను కోరుకుంటున్నాను. అందుకే మీ మొబైల్ ఫోన్లను బయటకు తీయండి. మీ ఫోన్ ఫ్లాష్‌లైట్లను ఆన్ చేయండి.. మీరే దీనిని ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దీపాన్ని వెలిగించినట్లుగా ఈ విమానాశ్రయాన్ని నేడు ప్రారంభిస్తున్నారు. ఇది మీ ఆస్తి, ఇది మీ భవిష్యత్తు, ఇది మీ కష్టం.. అందుకే దీని ప్రారంభోత్సవం కూడా మీ చేతుల మీదుగానే జరుగుతోంది. ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తూ మీ చేతులెత్తి, ఫ్లాష్‌లైట్లను పూర్తిగా చూపించండి. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రారంభోత్సవం పూర్తయింది.సుమారు రూ. 11,200 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ తొలి దశను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 28th, 12:00 pm
ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోషాన్ని, గర్వాన్ని వ్యక్తపరుస్తూ.. వికసిత్ యూపీ, వికసిత్ భారత్ అభియాన్‌లో నేడు నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, ఇప్పుడు అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు గల రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించిందని తెలిపారు. ఈ విమానాశ్రయానికి తానే శంకుస్థాపన చేసి, నేడు తానే ప్రారంభించటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఈ భారీ విమానాశ్రయం పేరు ఉత్తరప్రదేశ్‌తో ముడిపడి ఉండటం మరో విశేషమని చెబుతూ.. నన్ను ప్రతినిధిగా ఎన్నుకుని పార్లమెంటుకు పంపిన ఈ రాష్ట్ర గుర్తింపు, ఇప్పుడు ఈ అద్భుతమైన విమానాశ్రయంతో ముడిపడి ఉంది అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.Cabinet approves 4 lane construction from Barabanki to Bahraich in Uttar Pradesh worth Rs.6969.04 crore
March 18th, 04:10 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by PM Narendra Modi has approved construction of 4-Lane Access-Controlled National Highway-927 from Barabanki to Bahraich in Uttar Pradesh worth Rs.6969.04 crore. The project will bypass major habitations, increase average travel speeds, reduce travel time to about one hour, and improve overall road safety, fuel efficiency, and vehicle operating costs.పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని 5 జిల్లాలను కలుపుతూ రెండు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనితో భారతీయ రైల్వే ప్రస్తుత నెట్‌వర్క్ సుమారు 192 కిలోమీటర్ల మేర పెరుగుతుంది.
March 10th, 04:19 pm
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని ఐదు జిల్లాలను కలుపుతూ రూ.4,474 కోట్ల విలువైన రెండు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. పీఎం-గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద ప్రణాళిక చేయబడిన ఈ ప్రాజెక్టులు, ఈ ప్రాంత ప్రజలను ఆత్మనిర్భర్గా మార్చాలన్న ప్రధాని నూతన భారత్ దార్శనికతకు అనుగుణంగా ఉన్నాయి.పోస్ట్ బడ్జెట్ వెబినార్‌లో సుస్థిర, బలమైన ఆర్థిక వృద్ధిపై పీఎం ప్రసంగం
March 03rd, 11:30 am
బడ్జెట్ వెబినార్ సిరీస్‌లో భాగంగా గత వారం మొదటి వెబినార్ జరిగింది. అది విజయవంతమైందని నాకు తెలిసింది. బడ్జెట్ నిబంధనల అమలుపై ప్రతి ఒక్కరూ అద్భుతమైన సూచనలు ఇచ్చారు. మీ అందరి క్రీయాశీలక భాగస్వామ్యాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఇవాళ రెండో వెబినార్ జరుగుతుంది. ఇవాళ కూడా విస్తృత శ్రేణి అంశాలపై వేలాది మంది లెక్కలేనన్ని సూచనలు ఇస్తారని, వివిధ రంగాల నిపుణులు కూడా మనతో పాల్గొంటారని నాకు సమాచారం ఉంది. బడ్జెట్ పై ఇంతటి భారీ స్థాయి చర్చ నిర్వహించటం విజయవంతమైన ప్రయోగం. ఈ వెబినార్‌లో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. దేశ ఆర్థిక వృద్ధిని నిరంతరం బలోపేతం చేయటమే ఈ వెబినార్ ఇతివృత్తం. పటిష్ఠమైన ఆర్థిక వ్యవస్థతో ప్రపంచానికే ఆశా కిరణంలా భారత్ మారిన తరుణంలో ప్రపంచ సరఫరా వ్యవస్థను పునర్ వ్యవస్థీకరిస్తున్న వేళ, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి వేగవంతమైన ఆర్థిక పురోగతే ప్రధాన ఆధారం. మన లక్ష్యం, మన సంకల్పం స్పష్టంగా ఉన్నాయి. నిర్మాణ సామర్థ్యం, ఉత్పత్తి, అనుసంధానతను పెంచటంతో పాటు ఎగుమతులను కూడా మరింతగా పెంచాల్సిన అవసముంది. ఇవాళ మీరు చేస్తున్న ఈ మేధోమదనం ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది.‘ఆర్థిక వృద్ధిని నిలబెట్టుకోవడం, బలోపేతం చేయడం’పై నిర్వహించిన బడ్జెట్ అనంతర వెబినార్‌నుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 03rd, 11:15 am
‘ఆర్థిక వృద్ధిని నిలబెట్టుకోవడం, బలోపేతం చేసుకోవడం’ అంశంపై ఈ రోజు నిర్వహించిన బడ్జెట్ అనంతర రెండో వెబినార్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత వారం ఉత్సాహాన్ని గుర్తుచేసుకుంటూ.. మొదటి వెబినార్ విజయవంతమైందని, బడ్జెటులో పేర్కొన్న అంశాల అమలుపై అద్భుతమైన సూచనలు వచ్చాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.పశ్చిమ బెంగాల్‌లోని సింగూరులో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 18th, 03:30 pm
నిన్న నేను మాల్దాలో ఉన్నాను, ఈరోజు హుగ్లీలో మీ అందరి మధ్యకు వచ్చే భాగ్యం కలిగింది. వికసిత భారత్ కోసం తూర్పు భారత్ అభివృద్ధి - లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. నిన్నటి, నేటి కార్యక్రమాలు ఈ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఈ క్రమంలో, పశ్చిమ బెంగాల్ కు సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే, అంకితం ఇచ్చే అవకాశం నాకు లభించింది. నిన్న దేశ మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు పశ్చిమ బెంగాల్ నుంచి ప్రారంభమైంది. బెంగాల్‌కు సుమారు అరడజను కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందాయి. ఈరోజు మరో మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒక రైలు నా పార్లమెంటు నియోజకవర్గం కాశీ బనారస్‌తో బెంగాల్ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇవే కాకుండా, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా మొదలయ్యాయి. అంటే, పశ్చిమ బెంగాల్ రైలు అనుసంధానానికి గత 24 గంటలు అపూర్వమైనవి. బహుశా గత 100 ఏళ్లలో 24 గంటల వ్యవధిలో ఇంతటి పని జరగలేదు.పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో 830 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
January 18th, 03:00 pm
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా సింగూర్‌లో ఈ రోజు 830 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేయగా, కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నిన్న తాను మాల్దాలో ఉండగా ఈ రోజు హుగ్లీ ప్రజల మధ్య ఉండే భాగ్యం కలిగిందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశం కోసం తూర్పు భారత్ అభివృద్ధి అత్యంత ఆవశ్యకమని.. ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన ప్రధానంగా చెప్పారు. నిన్నటి, నేటి కార్యక్రమాలు ఈ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసే అవకాశం తనకు లభించిందని ప్రధానమంత్రి అన్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
October 16th, 03:00 pm
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, ప్రజాదరణ పొందిన, కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రులు శ్రీ కె.రామ్మోహన్ నాయుడు గారు, శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని గారు, శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, ఇతర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు, పార్లమెంట్ సభ్యులు, ఎంఎల్ఏలు అందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన సోదరీసోదరులకు...ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో రూ.13,430 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం.. కొన్నింటిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 16th, 02:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో దాదాపు రూ.13,430 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- తొలుత అహోబిలంలోని నరసింహ స్వామితోపాటు మహానందిలోని శ్రీ మహానందీశ్వర స్వామికి ప్రణామాలు అర్పించారు. అలాగే సకలజన సౌభాగ్యం ఆకాంక్షిస్తూ మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు కోరారు.మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని 18 జిల్లాల పరిధిలో నాలుగు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం..
October 07th, 03:11 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నాలుగు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటి మొత్తం వ్యయం రూ. 24,634 కోట్లు (దాదాపు).