ఉత్తరాఖండ్‌లోని హర్శిల్‌లో శీతాకాల పర్యాటక కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

March 06th, 02:07 pm

ఈ వేదికపై ఆసీనులైన నా సోదరుడు, చురుకైన ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ థామ్‌ గారు, కేంద్ర మంత్రి శ్రీ అజయ్‌ టమ్టాగారు, రాష్ట్ర మంత్రి సత్పాల్‌ మహరాజ్‌ గారు, పార్లమెంటులో నా సహ సభ్యులైన బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షులు మహేంద్ర భట్‌ గారు, మాలా రాజ్యలక్ష్మిగారు, ఎమ్మెల్యే సురేష్‌ గారు, ఇతర ప్రముఖులు, సభకు హాజరైన సోదరీసోదరులారా!

ఉత్తరాఖండ్ లోని హర్సిల్ లో శీతాకాల పర్యాటక కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

March 06th, 11:17 am

ఉత్తరాఖండ్ లోని హార్సిల్ లో ట్రెక్, బైక్ ర్యాలీని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ... అనంతరం శీతాకాల పర్యాటక కార్యక్రమంలో పాల్గొన్నారు. మఖ్వా ప్రాంతంలోని శీతాకాలపు గంగామాత దర్శన ప్రాంతాన్ని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనా గ్రామంలో జరిగిన విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో దేశ ప్రజలు సంఘీభావంగా నిలుస్తున్నారని, ఇది బాధిత కుటుంబాలకు మనోనిబ్బరాన్ని అందిస్తుందని అన్నారు.

మార్చి 6న ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి

March 05th, 11:18 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి నెల 6న ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారు. ముఖ్‌వాలో గంగా నదిని సందర్శించే స్థలం వద్ద ఆయన ఉదయం సుమారు తొమ్మిదిన్నర గంటలకు దర్శనం, పూజ కార్యక్రమాలలో పాల్గొంటారు. దాదాపు 10 గంటల 40 నిమిషాలకు మోటార్‌ సైకిళ్లపై చేసే సాహస యాత్రను ప్రధాని ప్రారంభిస్తారు. హర్సిల్‌లో నిర్వహించే ఒక కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.