శ్రీ ఎంటీ వాసుదేవన్ నాయర్ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం
December 26th, 10:16 am
మలయాళ సినిమా, సాహిత్య రంగాల్లో ప్రముఖ వ్యక్తి అయిన శ్రీ ఎంటీ వాసుదేవన్ నాయర్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. మానవ భావోద్వేగాలపై లోతైన అన్వేషణతో సాగిన శ్రీ ఎంటీ వాసుదేవన్ నాయర్ రచనలు తరాలను తీర్చిదిద్దాయని, భవిష్యత్తులోనూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని శ్రీ మోదీ అన్నారు.