గుజరాత్‌లోని దేడియాపడలో గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
November 15th, 03:15 pm
గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు సహా ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని దేడియాపాడలో జన్‌జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 15th, 03:00 pm
ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని దేడియాపాడలో జన్‌జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ.9,700 కోట్ల విలువైన పలు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నర్మదా మాత పవిత్ర భూమి ఇవాళ మరో చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిందని, అక్టోబరు 31న ఇక్కడే సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారతదేశ ఏకత్వాన్ని, భిన్నత్వాన్ని చాటి చెప్పేందుకు భారత్ పర్వ్‌ను ప్రారంభించినట్లు శ్రీ నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు. ఈరోజు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా, భారత్ పర్వ్ పరమావధికి చేరుకుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ శుభ సందర్భంగా భగవాన్ బిర్సా ముండాకు నివాళులర్పించారు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన గోవింద్ గురు ఆశీస్సులు ఈ కార్యక్రమంపై ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు. వేదికపై నుంచి గోవింద్ గురుకు గౌరవ వందనం సమర్పించారు. కొద్దిసేపటి క్రితం దేవ్‌మోగ్రా మాత ఆలయాన్ని సందర్శించే అదృష్టం కలిగిందన్న ప్రధానమంత్రి.. ఆ మాత పాదాల వద్ద శిరస్సు వంచి ప్రణమిల్లినట్లు తెలిపారు.RJD forced Congress to surrender its CM claim at gunpoint: PM Modi in Bhagalpur, Bihar
November 06th, 12:01 pm
In the Bhagalpur rally, PM Modi criticised RJD and Congress for never understanding the value of self-reliance or Swadeshi. He reminded the people that the Congress can never erase the stain of the Bhagalpur riots. Outlining NDA’s roadmap for progress, PM Modi said the government is working to make Bihar a hub for textiles, tourism and technology.No IIT, no IIM, no National Law University — a whole generation’s future was devoured by RJD’s leadership: PM Modi in Araria, Bihar
November 06th, 11:59 am
PM Modi addressed a large public gathering in Araria, Bihar, where people turned up in huge numbers to express their support for the NDA. Speaking with conviction, PM Modi said that the people of Bihar have already made up their minds – ‘Phir Ekbar, NDA Sarkar!’PM Modi stirs up massive rallies with his addresses in Araria & Bhagalpur, Bihar
November 06th, 11:35 am
PM Modi addressed large public gatherings in Araria & Bhagalpur, Bihar, where people turned up in huge numbers to express their support for the NDA. Speaking with conviction, PM Modi said that the people of Bihar have already made up their minds – ‘Phir Ekbar, NDA Sarkar!’రబీ పంటలకు 2026-27 మార్కెటింగ్ సీజనుకు గాను కనీస మద్దతు ధరలకు (ఎంఎస్‌పీ) ఆమోదం తెలిపిన మంత్రిమండలి
October 01st, 03:31 pm
మార్కెటింగ్ సీజన్ 2026-27కు గాను అన్ని అనివార్య రబీ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)లో పెరుగుదలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది.79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు
August 15th, 03:52 pm
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం 103 నిమిషాల పాటు కొనసాగింది. ఆయన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాల్లో ఇదే సుదీర్ఘమైనది. ఇందులో భాగంగా పలు నిర్ణయాత్మక ప్రకటనలు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్‌ను సాధించటంపై ఒక సాహసోపేతమైన రోడ్ మ్యాప్‌ను ఇచ్చారు. ప్రధానమంత్రి ప్రసంగం స్వావలంబన, ఆవిష్కరణ, ప్రజల సాధికారతపై దృష్టి సారించింది. ఇతరులపై ఆధారపడే స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, సాంకేతికతపరంగా అభివృద్ధి చెందిన, ఆర్థికంగా ధృడమైన దేశంగా మారిన భారత్ ప్రయాణాన్ని ప్రధానంగా పేర్కొన్నారు.79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 15th, 07:00 am
ఈ స్వాతంత్య్ర మహోత్సవం 140 కోట్ల ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ జరుగుతున్న వేడుక. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సమష్టి విజయానికి ప్రతీక. మనందరికీ గర్వకారణం. మన హృదయాలు ఆనందంతో ఉప్పొంగే క్షణమిది. దేశంలో ఎప్పటికప్పుడు ఐక్యతా స్ఫూర్తి బలోపేతమవుతోంది. 140 కోట్ల భారతీయులు ఈ రోజు మువ్వన్నెల్లో మెరుస్తున్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ రెపరెపలాడుతోంది. ఎడారులయినా, హిమాలయ శిఖరాలయినా, సముద్ర తీరాలయినా, లేదా జనసమ్మర్ధ ప్రాంతాలయినా.. అంతటా ఒకే నినాదం, ఒకే ఉత్సాహం. మనం ప్రాణం కన్నా మిన్నగా భావించే మాతృభూమి కీర్తనే మార్మోగుతోంది.India celebrates 79th Independence Day
August 15th, 06:45 am
PM Modi, in his address to the nation on the 79th Independence day paid tribute to the Constituent Assembly, freedom fighters, and Constitution makers. He reiterated that India will always protect the interests of its farmers, livestock keepers and fishermen. He highlighted key initiatives—GST reforms, Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana, National Sports Policy, and Sudharshan Chakra Mission—aimed at achieving a Viksit Bharat by 2047. Special guests like Panchayat members and “Drone Didis” graced the Red Fort celebrations.ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
August 02nd, 11:30 am
నమఃపార్వతీ పతయే.. హర హర మహాదేవ.. పవిత్ర శ్రావణ మాసంలో కాశీలోని నా కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఈ రోజు నాకు లభించింది. ఈ సందర్భంగా మీకందరికీ ఇదే నా ప్రణామం.వారణాసిలో దాదాపు రూ. 2,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 02nd, 11:00 am
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దాదాపు రూ.2,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ.. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా వారణాసిని సందర్శించడం, ఇక్కడి ప్రజలను కలవడం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. వారణాసి ప్రజలతో తనకు భావోద్వేగ అనబంధముందన్న శ్రీ మోదీ.. ఆదరాభిమానాలను కనబరిచిన నగర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా రైతులతో సంభాషించడంపై శ్రీ మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.గత 11 ఏళ్ల కాలంలో, మేం చేపట్టిన వివిధ కార్యక్రమాలతో రైతుల శ్రేయస్సు మెరుగైంది.. వ్యవసాయ రంగంలో సమూల మార్పు సాధ్యమైంది: ప్రధానమంత్రి
June 07th, 11:40 am
గత 11 సంవత్సరాలుగా ప్రభుత్వం తీసుకున్న రైతు అనుకూల నిర్ణయాలు అనేక సత్ఫలితాలను అందించాయని చెబుతూ, వ్యవసాయదారుల గౌరవం, అభ్యున్నతి పరంగా కీలక మార్పులు వచ్చినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు.బీహార్‌లోని కారాకాట్‌లో వివిధ ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 30th, 11:29 am
బీహార్ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ జీతన్ రామ్ మాంఝీ, శ్రీ లల్లన్ సింగ్, శ్రీ గిరిరాజ్ సింగ్, శ్రీ చిరాగ్ పాశ్వాన్, శ్రీ నిత్యానంద్ రాయ్, శ్రీ సతీష్ చంద్ర దూబే, శ్రీ రాజ్‌భూషణ్ చౌదరీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ సామ్రాట్ చౌదరీ, శ్రీ విజయ్ కుమార్ సిన్హా సహా కార్యక్రమానికి హాజరైన ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నా ప్రియ బీహార్ సోదరీసోదరులారా!బీహార్‌లోని కారాకాట్‌లో రూ.48,520 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 30th, 10:53 am
బీహార్లోని కారాకాట్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రూ. 48,520 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. బీహార్ అభివృద్ధిని వేగవంతం చేసే అవకాశం తనకు దక్కిందని, ఈ పవిత్ర భూమిపై రూ. 48,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, భూమిపూజ చేశామని పేర్కొన్నారు. తనను ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. బీహార్ పట్ల వారికున్న అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతలు చెప్పారు. అన్ని సందర్భాల్లోనూ వారి మద్దతు తనకు లభించిందని అన్నారు. బీహార్‌లోని మాతృమూర్తులు, సోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్‌పీ) ఆమోదించిన మంత్రివర్గం
May 28th, 03:49 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ 2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పీ) పెంపు నిర్ణయానికి ఆమోదం తెలిపింది.ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో వివిధ ప్రగతి పనుల ప్రారంభం.. శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 30th, 06:12 pm
వేదికను అలంకరించిన ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శ్రీ రమణ్ డేకా, ప్రజాదరణగల చురుకైన ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయి, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ మనోహర్ లాల్, ఈ ప్రాంత ఎంపీ-కేంద్ర మంత్రి శ్రీ తోఖన్ సాహు, ఛత్తీస్‌గఢ్ శాసనసభాపతి-నా ప్రియ మిత్రులు శ్రీ రమణ్ సింగ్, ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ శర్మ, శ్రీ అరుణ్ సాహు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు... దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన నా సోదరీసోదరులారా!ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో రూ.33,700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 30th, 03:30 pm
మౌలిక సదుపాయాల అభివృద్ధి, సుస్థిర జీవనోపాధిని పెంపొందించాలనే తన నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో రూ.33,700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, వివిధ అభివృద్ధి పనుల ప్రారంభాలు చేసి, పలు అభివృద్ధి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేశారు. నూతన సంవత్సర శుభారంభం, నవరాత్రి మొదటి రోజు వంటి శుభ సందర్భంలో ఈ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్న శ్రీ నరేంద్ర మోదీ, మాతా మహామాయ భూమిగా, మాతా కౌసల్య మాతృభూమిగా ఛత్తీస్‌గఢ్ ప్రాముఖ్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. నవరాత్రి మొదటి రోజున ఛత్తీస్‌గఢ్‌లో ఉండటం తనకు దక్కిన గౌరవంగా పేర్కొన్న ఆయన, ఇటీవల భక్త శిరోమణి మాతా కర్మ గౌరవార్థం పోస్టల్ స్టాంప్ జారీ చేసిన సందర్భంగా అందరికీ అభినందనలు తెలిపారు. నవరాత్రి పండుగ రామనవమి వేడుకలతో ముగుస్తుందన్న మోదీ, ఛత్తీస్‌గఢ్‌లో రాముడి పట్ల ఉన్న ప్రత్యేక భక్తిని, ముఖ్యంగా తమ మొత్తం ఉనికిని రాముడి నామానికి అంకితం చేసిన రామనామి సమాజ అసాధారణ అంకితభావాన్ని కొనియాడారు. ఛత్తీస్‌గఢ్ ప్రజలను శ్రీరాముని మాతృమూర్తి కుటుంబ సభ్యులుగా అభివర్ణించిన ఆయన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.బిహార్‌లోని భాగల్‌పూర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం
February 24th, 02:35 pm
ప్రపంచ ప్రఖ్యాత విక్రమశిల మహావిహారం ఉన్న, వసుపూజయ మహర్షి తపస్సు చేసిన, బాబా బుధనాథుని పవిత్ర భూమి, అంగ రాజు దాన వీర శూర కర్ణుడికి చెందిన ఈ ప్రాంత సోదర సోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు!బీహార్ భాగల్పూర్ నుంచీ ‘పీఏం కిసాన్’ 19వ విడత నిధుల విడుదల సహా పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 24th, 02:30 pm
వ్యవసాయదారుల సంక్షేమమే పరమావధిగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పీఏం కిసాన్ పథకం 19వ విడత నిధులను బీహార్ భాగల్పూర్ వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు ఇతర సంక్షేమ పథకాలను కూడా ప్రారంభించారు. అంతర్జాలం ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ప్రధాని స్వాగతం పలికారు. మహాకుంభ్ పావన సందర్భంలో మందరాంచల్ ప్రాంతంలోకి అడుగు పెట్టడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. ఆధ్యాత్మికత, వారసత్వ సంపదలకు ఆలవాలమైన ఈ ప్రాంతం వికసిత్ భారత్ లక్ష్యానికి కూడా అనువైనదని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు తిల్కా మాంఝీ స్మృతికే గాక భాగల్పూర్ పట్టు నగరంగా కూడా ప్రసిద్ధి చెందిందన్నారు. బాబా అజ్గైబినాథ్ నడయాడిన పవిత్ర క్షేత్రంలో, రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లు ప్రారంభమయ్యాయన్నారు. ఇటువంటి శుభదినాల్లో పీఏం కిసాన్ 19వ విడత నిధులను విడుదల చేసే అదృష్టం తనకు దక్కిందని, సుమారు రూ. 22,000 కోట్ల సొమ్ము ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా రైతన్నల ఖాతాల్లోకి జమ అయ్యిందన్నారు.ఆంగ్ల అనువాదం: లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం.... ప్రధాని సమాధానం
February 04th, 07:00 pm
గౌరవనీయులైన రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. నిన్న, ఈ రోజు అర్థరాత్రి వరకు గౌరవ ఎంపీలందరూ ఈ ధన్యవాద తీర్మానంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చాలా అనుభవజ్ఞులైన ఎంపీలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సహజంగానే ప్రజాస్వామ్య సంప్రదాయం ప్రకారం అవసరం ఉన్న చోట ప్రశంసలు ఉంటాయి. ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ కొన్ని ప్రతికూల విషయాలు ఉంటాయి. ఇది చాలా సహజం! అధ్యక్షా.. దేశ ప్రజలు నాకు 14వసారి ఇక్కడ కూర్చొని రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం కల్పించారు. ఇది నా అదృష్టం. కాబట్టి ఈ రోజు నేను ప్రజలకు ఎంతో గౌరవంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చర్చలో పాల్గొని చర్చను గొప్పగా చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు.