భారతదేశంపై ఈ వారం ప్రపంచం

April 22nd, 12:27 pm

దౌత్యపరమైన ఫోన్ కాల్స్ నుండి సంచలనాత్మక శాస్త్రీయ ఆవిష్కరణల వరకు, ఈ వారం ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క ఉనికి సహకారం, ఆవిష్కరణ మరియు సాంస్కృతిక గర్వంతో గుర్తించబడింది.

ఎలాన్ మస్క్‌తో చర్చల సందర్భంగా ద్వైపాక్షిక సాంకేతిక సహకారంలో అవకాశాలను పేర్కొన్న ప్రధాని

April 18th, 01:07 pm

ఉమ్మడి ప్రయోజనాలున్న అనేక అంశాలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శ్రీ ఎలాన్ మస్క్‌తో నిర్మాణాత్మకంగా చర్చించారు. ఈ ఏడాది మొదట్లో వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను ఈ సందర్భంగా మళ్లీ పరిశీలించారు. సాంకేతిక పురోగతి దిశగా ఉమ్మడి లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి సారించారు.

మెగా ఇండియా-యుఎస్ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్న ప్రధాని మోదీ, ట్రంప్

February 14th, 06:46 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా పర్యటన ఒక చిరస్మరణీయ సందర్భం, ఇది రెండు దేశాల మధ్య లోతైన వ్యూహాత్మక, ఆర్థిక మరియు సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తుంది. తన పర్యటనలో, ప్రధాని మోదీ అమెరికా నాయకులు, వ్యాపార దిగ్గజాలు మరియు భారతీయ ప్రవాసులతో రక్షణ, వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత మరియు దౌత్యం వంటి కీలక రంగాలను కవర్ చేస్తూ ఉన్నత స్థాయి సమావేశాలు మరియు చర్చలలో పాల్గొన్నారు. ఈ పర్యటన భారతదేశం మరియు అమెరికా మధ్య బలమైన సంబంధాన్ని పునరుద్ఘాటించింది, కొత్త ప్రపంచ క్రమాన్ని రూపొందించడంలో రెండు దేశాలను ప్రపంచ భాగస్వాములుగా ఉంచింది.

ప్రధానమంత్రితో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డీఓజీఈ) అధిపతి భేటీ

February 13th, 11:51 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డీఓజీఈ) అధిపతి, టెస్లా ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) శ్రీ ఎలాన్ మస్క్ ఈ రోజు సమావేశమయ్యారు.

మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారంపై ప్రధానమంత్రికి ప్రపంచ నాయకుల నుంచి కొనసాగుతున్న అభినందన సందేశ పరంపర

June 10th, 12:00 pm

భారత ప్రధానమంత్రిగా శ్రీ న‌రేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ప్రపంచ నాయకుల అభినందన సందేశ పరంపర ఇంకా కొనసాగుతోంది. వీటిపై ప్రధాని శ్రీ మోదీ స్పందిస్తూ- సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

వ్యాపార రంగ ప్రముఖుడు శ్రీ ఎలోన్ మస్క్ తో సమావేశమైన ప్రధాన మంత్రి

June 21st, 08:22 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాంకేతిక విజ్ఞాన రంగం లో అగ్రగామి వ్యక్తి, వ్యాపార రంగ ప్రముఖుడు మరియు టెస్లా ఇంక్. ఎండ్ స్పేస్ ఎక్స్ ల యొక్క సిఇఒ; ట్విటర్ కు యజమాని, సిటిఒ, ఇంకా చెయర్ మన్; బోరింగ్ ఎండ్ ఎక్స్-కార్ప్ ల వ్యవస్థాపకుడు, న్యూరాలింక్ మరియు ఒపెన్ఎఐ ల సహ వ్యవస్థాపకుడైన శ్రీ ఎలోన్ మస్క్ తో యుఎస్ఎ లోని న్యూ యార్క్ లో ఈ రోజు న సమావేశమయ్యారు.