శ్రీ మోహన్‌లాల్‌ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం....అభినందించిన ప్రధానమంత్రి

September 20th, 07:42 pm

దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన సందర్భంగా శ్రీ మోహన్ లాల్‌ గారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. అసాధారణ నటనలో, వైవిధ్యాన్ని చూపించటంలో శ్రీ మోహన్ లాల్ గారు శిఖర సమానుడని శ్రీ మోదీ పేర్కొన్నారు. దశాబ్దాల గొప్ప కృషితో ఆయన మలయాళ సినిమా ధృవతారగా వెలుగొందుతున్నారనీ, నాటకం, కేరళ సంస్కృతి పట్ల ఆయనకు ఎనలేని గౌరవం ఉందన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ ఆయన అద్భుతాలు చేశారని అన్నారు. సినిమా, నాటకం... మాధ్యమం ఏదైనా ఆయన ప్రదర్శించిన నటన ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన సందర్భంగా శ్రీ మోహన్ లాల్‌ గారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. అసాధారణ నటనలో, వైవిధ్యాన్ని చూపించటంలో శ్రీ మోహన్ లాల్ గారు శిఖర సమానుడని శ్రీ మోదీ పేర్కొన్నారు. దశాబ్దాల గొప్ప కృషితో ఆయన మలయాళ సినిమా ధృవతారగా వెలుగొందుతున్నారనీ, నాటకం, కేరళ సంస్కృతి పట్ల ఆయనకు ఎనలేని గౌరవం ఉందన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ ఆయన అద్భుతాలు చేశారని అన్నారు. సినిమా, నాటకం... మాధ్యమం ఏదైనా ఆయన ప్రదర్శించిన నటన ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

మన్ కీ బాత్ తాజా కార్యక్రమంలో స్థూలకాయ సమస్య నివారణ దిశగా సామూహిక కార్యాచరణకు ప్రధానమంత్రి పిలుపు

February 24th, 09:11 am

ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో ఈ సమస్యపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. వంట నూనె వినియోగాన్ని తగ్గించడానికి ప్రముఖులను ఆయన నామినేట్ చేశారు. ఆ పది మందిని వారు మరో పది మందిని దీని కోసం నామినేట్ చేయాల్సిందిగా కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.