జాతి నిర్మాణంలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక పాత్రను వివరిస్తూ పరమ పూజ్య సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ గారు చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
October 02nd, 01:15 pm
దేశ సేవకు అంకితమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సేవలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. పరమ పూజ్య సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ గారు చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. జాతి నిర్మాణంలో సంఘ్ కీలక పాత్రను, భారత నాగరికత విలువలను పెంపొందించడంలో దాని అచంచలమైన నిబద్ధతను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.An RSS shakha is a ground of inspiration, where the journey from 'me' to 'we' begins: PM Modi
October 01st, 10:45 am
In his address at the centenary celebrations of the Rashtriya Swayamsevak Sangh (RSS), PM Modi extended his best wishes to the countless swayamsevaks dedicated to the resolve of national service. He announced that, to commemorate the occasion, the GoI has released a special postage stamp and a coin. Highlighting the RSS’ five transformative resolutions, the PM remarked that in times of calamity, swayamsevaks are among the first responders.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శత వార్షికోత్సవాలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 01st, 10:30 am
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శత వార్షికోత్సవాలు ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజున మహా నవమి.. సిద్ధిధాత్రి అమ్మవారిని ఆరాధించేది ఈ రోజేనని ఆయన గుర్తు చేశారు. రేపు విజయదశమి మహా పర్వదినం.. ఈ పండుగ భారతీయ సంస్కృతిలో ఓ శాశ్వత జయఘోషకు సంకేతం.. అన్యాయంపై న్యాయం, అసత్యంపై సత్యం, చీకటిపై వెలుగు పైచేయిని సాధించిన సన్నివేశమని ఆయన అభివర్ణించారు. అంతటి పవిత్ర సందర్భంలో, వంద సంవత్సరాల కిందట రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను స్థాపించారు. ఇది యాదృచ్ఛిక ఘటన ఏమీ కాదని ఆయన ఉద్ఘాటించారు. ఇది వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించడమే.. దీనిలో భాగంగా ప్రతి యుగంలోనూ అప్పటి సవాళ్లను ఎదుర్కోవడానికి జాతీయ అంతశ్చేతన కొత్త కొత్త రూపాలను తీసుకొంటూ ఉంటుందని ఆయన అన్నారు. ఈ యుగంలో, నిత్య జాతీయ చైతన్యం మూర్తీభవించిన ఓ ప్రతిరూపంగా సంఘ్ నిలుస్తోందని ఆయన తేల్చి చెప్పారు.మోహన్ భగవత్ జీ ఎల్లప్పుడూ 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్'కు బలమైన మద్దతుదారు: ప్రధాని మోదీ
September 11th, 08:00 am
సెప్టెంబర్ 11న జరిగిన ముఖ్యమైన సంఘటనలను, స్వామి వివేకానంద చికాగో ప్రసంగం మరియు 9/11 దాడులను ప్రధాని మోదీ ప్రస్తావించారు, అదే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ జీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఆర్‌ఎస్‌ఎస్ 100 ఏళ్ల ప్రయాణంలో మోహన్ భగవత్ జీ పదవీకాలం అత్యంత పరివర్తనాత్మక దశగా గుర్తుండిపోతుందని ప్రధాని అన్నారు. 'పంచ పరివర్తన్' దార్శనికత ద్వారా, బలమైన, సంపన్న దేశాన్ని నిర్మించడానికి మోహన్ జీ భారతీయులను ప్రేరేపిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు.