ఈ నెల 22న ప్రధానమంత్రి మీరట్ పర్యటన
February 20th, 06:52 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 22న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు, శతాబ్ది నగర్ నమో భారత్ స్టేషన్‌లో ప్రధానమంత్రి మీరట్ మెట్రో సేవలను, నమో భారత్ రైలును ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మీరట్ సౌత్ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణం చేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు, మీరట్‌లో దాదాపు రూ.12,930 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.