ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో “సురక్షితమైన కృత్రిమ మేధ

June 18th, 05:01 am

ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సమావేశంలో “కృత్రిమ మేధను సురక్షితంగా, వేగంగా, సమర్థంగా అమలు చేయడం” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన అవు‌ట్ రీచ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.

ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ7-సదస్సులో “అందరి కోసం సమతుల్యమైన,

June 18th, 05:00 am

ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సమావేశంలో ఈ రోజు నిర్వహించిన అవుట్ రీచ్ కార్యక్రమంలో “అందరి కోసం సమతుల్యమైన, ఉమ్మడిదైన, సుస్థిరమైన ఆర్థికవృద్ధిని పునరుద్ధరించడం” అనే అంశంపై ప్రధానమంత్రి ప్రసంగించారు.

ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రక విజయంగా ఇండియా- యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందాన్ని ప్రశంసించిన ప్రధాని

June 17th, 10:03 pm

2026 జులై 15 నుంచి ఇండియా-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తుండటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

జీ7 శిఖరాగ్ర సమావేశ సదస్సు సందర్భంగా ప్రధాని ప్రసంగం: సురక్షితంగా, వేగంగా, సమర్థంగా ఏఐ వినియోగం

June 17th, 09:20 pm

ఈ ముఖ్యమైన అంశాన్ని మన చర్చల్లో భాగం చేసిన మిత్రుడు మెక్రాన్‌కు నా అభినందనలు. మానవుడు సృష్టించిన అత్యంత విప్లవాత్మక సాంకేతికతల్లో కృత్రిమ మేధ ఒకటి. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు.

జీ7 సదస్సు సందర్భంగా ఐరోపా కౌన్సిల్, ఐరోపా కమిషన్ అధ్యక్షులతో సమావేశమైన ప్రధాని

June 17th, 06:43 pm

ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఐరోపా కౌన్సిల్ అధ్యక్షులు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు శ్రీమతి ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌‌‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.

జి7 శిఖరాగ్ర సదస్సులో ‘అందరి కోసం సమతుల.. సమష్టి.. సుస్థిర ఆర్థిక వృద్ధి పునరుద్ధరణ’పై సంధాన గోష్ఠి’లో ప్రధానమంత్రి ప్రసంగం

June 17th, 06:07 pm

అధ్యక్షులు మాక్రాన్‌ సహా గౌరవనీయ అతిథి సమూహానికి వందనం!

జి7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జర్మనీ చాన్సలర్‌తో ప్రధానమంత్రి సమావేశం

June 17th, 05:34 pm

ఈ సందర్భంగా భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్య పునరుజ్జీవనంపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో చాన్సలర్ భారత పర్యటనకు రాగా, భారత-ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సంతకాలు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిని సమీక్షించారు. ఈ ఏడాదిలోనే భారత్-జర్మనీ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం నిర్వహించనుండగా, వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, కాలుష్య రహిత సుస్థిర అభివృద్ధి, సాంకేతికత, ఆవిష్కరణలు, విద్య, రవాణా తదితర రంగాల్లో సహకార బలోపేతంపై నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారు. రక్షణ పారిశ్రామిక సహకారంపై వ్యూహాత్మక భవిష్యత్‌ ప్రణాళికపై సంతకాలు పూర్తి కావడంపై వారు హర్షం ప్రకటించారు. జర్మనీ మీదుగా ప్రయాణించే భారత పౌరులకు ట్రాన్సిట్ వీసా మినహాయింపు విధానానికి శ్రీకారం చుట్టడాన్ని స్వాగతించారు.

‘జీ7 శిఖరాగ్ర సమావేశం - విస్తృత భాగస్వామ్య సదస్సు: కొత్త భాగస్వామ్యాల నిర్మాణం, అంతర్జాతీయ సంఘీభావ పునరుద్ధరణ’ సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన

June 16th, 10:12 pm

జీ-7 శిఖరాగ్ర సమావేశంలో అధ్యక్షుడు మాక్రాన్ ఆత్మీయ స్వాగతానికి, ఆయన అందించిన ఆతిథ్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు.

ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో "నూతన భాగస్వామ్యాల ఏర్పాటు

June 16th, 10:07 pm

ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరిగిన జీ7 సదస్సులో నూతన భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ ఐక్యతను పునర్నిర్మించటం అంశంపై ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.

ఆవిష్కరణలపై భారత్‌-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక ప్రణాళిక-2030

June 15th, 05:42 am

భారత్‌-ఫ్రాన్స్‌ స్నేహ బంధాన్ని 2026 ఫిబ్రవరి 17న “ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి తీసుకెళ్లడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొత్త మలుపు తిప్పారు. అలాగే, ‘భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం-2026’కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కృత్రిమ మేధ (ఏఐ), ఆవిష్కరణలు, పరిశోధన, సాంకేతికత, డిజిటల్ రంగం, సైబర్ రంగం, ఆరోగ్యం, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, విద్యా సంబంధాలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం, వైవిధ్యభరితంగా రూపుదిద్దాలని వారిద్దరూ నిర్ణయించారు.

ప్రధాని ఫ్రాన్స్ పర్యటన ఫలితాల జాబితా

June 14th, 09:32 pm

భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల రోడ్‌మ్యాప్-2030 ఆమోదం

ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి అధికారిక చర్చలు

June 14th, 08:37 pm

జూన్ 14, 2026న నీస్‌లోని విల్లా కెరిలోస్ వద్ద ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్-ఫ్రాన్స్ సంబంధాలను విశిష్టమైన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చిన తర్వాత ఇరువురు నేతల మధ్య జరిగిన తొలి సమావేశమిది.

ఫ్రాన్స్‌లో జరుగుతున్న భారత్ ఇన్నోవేట్స్-2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

June 14th, 04:36 pm

ఈ బంధం ఆధారంగానే గడచిన కొన్నేళ్లుగా మేం సంయుక్తంగా కొత్త కార్యక్రమాలను ప్రారంభించాం. కొత్త ఆలోచనలకు మార్గనిర్దేశం చేశాం. అలాగే ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు సాధ్యమైనంత మేర కృషి చేస్తున్నాం.

ఫ్రాన్స్‌లో ‘భారత్ ఇన్నొవేట్స్-2026’కు శ్రీకారం

June 14th, 03:00 pm

ఫ్రాన్స్‌లోని నైస్‌ నగరంలోగల విశాల ఎగ్జిబిషన్‌ కేంద్రం (పాలైస్ డెస్ ఎక్స్‌పొజిషన్స్‌)లో ఇవాళ “భారత్ ఇన్నొవేట్స్-2026”ను సంయుక్తంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు. ప్రపంచ ఆవిష్కరణ పెట్టుబడి సంస్థలు, అవకాశాల దిశగా భారత డీప్-టెక్ అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, పెట్టుబడిదారులను ఈ మూడు రోజుల కార్యక్రమం ఒక వేదికపైకి తెస్తుంది. అంతర్జాతీయ ప్రాధాన్యంగల 13 కీలక సాంకేతిక రంగాల్లో 120కి పైగా వినూత్న అంకుర సంస్థలను, 20కి పైగా అగ్రశ్రేణి నైపుణ్య సంస్థలు సహా భారత అగ్రశ్రేణి డీప్ టెక్నాలజీని ప్రపంచానికి ఈ వేదిక చాటిచెబుతుంది. ప్రపంచంలోని 350 మందికి పైగా అగ్రశ్రేణి పెట్టుబడిదారులు, వెంచర్ కేపిటలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.

ఫ్రాన్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

June 13th, 11:19 pm

తన పర్యటనలోని మొదటి అంచెను ప్రారంభించేందుకు ఫ్రాన్స్‌లోని నైస్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. భారత్, ఫ్రాన్స్‌ల మధ్య ఉన్న బలమైన, శాశ్వత సంబంధాలకు నిదర్శనంగా ఆయనకు ప్రత్యేక, ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ పర్యటన, బలపడుతున్న భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యాన్ని, విభిన్న రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవాలనే ఉమ్మడి నిబద్ధతను నొక్కి చెబుతోంది.

ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు బయలుదేరే ముందు ప్రధానమంత్రి అధికారిక ప్రకటన

June 13th, 10:03 am

ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షులు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, స్లోవాక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి శ్రీ రాబర్ట్ ఫికోల ఆహ్వానం మేరకు... నేను ఈ నెల 13 నుంచి 18 వరకు ఫ్రాన్స్, స్లోవాక్ రిపబ్లిక్‌ దేశాల్లో పర్యటించనున్నాను.

PM Modi and President of France jointly visit ITER facility

February 12th, 05:32 pm

PM Modi and President Emmanuel Macron visited the ITER facility in Cadarache, the first such visit by any Head of State or Government. They praised ITER’s progress in fusion energy and India’s key contributions through scientists and industries like L&T, Inox India, and TCS, highlighting India's commitment to advancing global clean energy research.

PM Modi and President of France jointly inaugurate the Consulate General of India in Marseille

February 12th, 05:29 pm

PM Modi and President Emmanuel Macron inaugurated the Consulate General of India in Marseille. The new Consulate will boost economic, cultural, and people-to-people connections across four French regions. PM Modi deeply appreciated President Macron’s special gesture, as both leaders received a warm welcome from the Indian diaspora.

మజాగే యుద్ధవీరుల స్మృతి కేంద్రాన్ని సందర్శించిన భారత ప్రధానమంత్రి, ఫ్రాన్స్ అధ్యక్షుడు

February 12th, 04:57 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ ఉదయం మాసే లోని మజాగే యుద్ధవీరుల స్మృతి కేంద్రాన్ని సందర్శించి మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో అసువులు బాసిన భారత వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. యుద్ధవీరుల త్యాగాలకు నివాళిగా ఇరువురు నేతలూ పుష్ప గుచ్ఛాలను ఉంచారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు

February 12th, 03:24 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్ష విమానంలో పారిస్ నుంచి మార్సిలే వరకు మంగళవారం కలిసి ప్రయాణించారు. ఇద్దరు నాయకుల మధ్య సాన్నిహిత్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలు, కీలక అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై వారు పూర్తిస్థాయిలో చర్చలు జరిపారు. అనంతరం మార్సిలే చేరుకున్న తర్వాత ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. గత 25 సంవత్సరాలుగా బహుముఖంగా, స్థిరంగా అభివృద్ధి చెందుతున్న భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం పట్ల బలమైన నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారు.