‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
May 18th, 05:00 am
ముందుగా, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నన్ను ఆహ్వానించిన ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్‌సన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమావేశం గోథెన్‌బర్గ్‌లో జరగడం నాకు సంతోషంగా ఉంది. ఈ నగరం ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందినది. ఈ నగరం యూరప్ తయారీ రంగ స్ఫూర్తికి చిహ్నంగానూ నిలుస్తుంది.స్వీడన్ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు చేపట్టిన ప్రధానమంత్రి
May 18th, 12:10 am
స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌లో ఆ దేశ ప్రధానమంత్రి శ్రీ ఉల్ఫ్ క్రిస్టెర్సన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో స్వీడన్ యువరాణి విక్టోరియా కూడా పాల్గొన్నారు. స్వీడన్ రాజు కార్ల్ XVI గుస్టాఫ్, రాణి సిల్వియాల తరఫున ఆమె ప్రధానమంత్రి మోదీకి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజు కార్ల్ XVI గుస్టాఫ్ 80వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి మోదీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.అనువాదం: ‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ సమావేశంలో ప్రధానమంత్రి మీడియా ప్రకటన
May 17th, 11:43 pm
కొద్దిసేపటి క్రితమే స్వీడన్ దేశపు అత్యున్నత పురస్కారమైన 'రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్'తో నన్ను గౌరవించారు. ఈ గౌరవం కేవలం నాది మాత్రమే కాదు.. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం.. భారత్-స్వీడన్ సంబంధాలను మరింత సుసంపన్నం చేసి వాటికి బలమైన పునాదిని వేసిన స్వీడన్‌లోని మన మిత్రులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.రవీంద్రనాథ్ ఠాగూర్ ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని స్మరించుకుంటూ ప్రత్యేక బహుమతులను ఇచ్చిపుచ్చుకున్న భారత్, స్వీడన్ ప్రధానులు
May 17th, 11:18 pm
నోబెల్ బహుమతి గ్రహీత, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ వారసత్వాన్ని స్మరించుకుంటూ స్వీడన్ ప్రధానమంత్రి శ్రీ ఉల్ఫ్ క్రిస్టెర్సన్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేక స్మారక బహుమతులను ఇచ్చిపుచ్చుకున్నారు.ఎంపిక చేసిన స్వీడన్ వ్యాపార దిగ్గజాలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ భేటీ
May 17th, 11:16 pm
భారత్, స్వీడన్ దేశాలు ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఆవిష్కరణలు, సుస్థిరత వంటి ఉమ్మడి విలువల ద్వారా అనుసంధానమయ్యాయని, ఇవి ఉన్నత లక్ష్యాలను కలిగి భవిష్యత్ ఆధారిత ఆర్థిక భాగస్వామ్యానికి బలమైన పునాదిని అందిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేడు భారత్, స్వీడన్ భాగస్వామ్యం కేవలం ఒక ఆర్థిక సంబంధం మాత్రమే కాదని, అది ఆలోచనలు, సాంకేతికత, ఆవిష్కరణలు, సహ సృష్టి ల భాగస్వామ్యమని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. భారతదేశ వృద్ధికి స్వీడిష్ కంపెనీలు సుదీర్ఘకాలంగా అందిస్తున్న సహకారాన్ని ఆయన స్వాగతించారు. పరిశోధన, ఆవిష్కరణలు, ఇంధన మార్పు, తయారీ ఉత్పాదక రంగాలలో మరింత లోతైన సహకారాన్ని పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.స్వీడన్ అత్యున్నత పురస్కారం - రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ ను అందుకున్న ప్రధానమంత్రి
May 17th, 11:13 pm
స్వీడన్ లో18వ శతాబ్దంలో ఏర్పాటైన దేశ అత్యంత పురాతన, విశిష్ట పురస్కారాలలో ఒకటైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్’ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందుకున్నారు. గాథెన్‌బర్గ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, స్వీడన్ యువరాణి క్రౌన్ ప్రిన్సెస్ విక్టోరియా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అసాధారణ ప్రజా సేవకు, స్వీడన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో అందించిన విశేష కృషికి గుర్తింపుగా విదేశీ ప్రభుత్వ అధినేతలకు స్వీడన్ ఈ అత్యున్నత పురస్కారాన్ని అందిస్తుంది.స్వీడన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
May 17th, 06:09 pm
ప్రధాని మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు స్వయంగా స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్‌సన్ ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీకి రక్షణగా స్వీడన్ తన యుద్ధ విమానాలను కూడా పంపింది. ఈ పర్యటన భారత్-స్వీడన్ సంబంధాల లోతు పెరుగుతున్న తీరును, కీలక రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉన్న ఉమ్మడి నిబద్ధతను నొక్కి చెబుతోంది.‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ని (ఈఆర్‌టీ) ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి
May 17th, 12:12 am
గోథెన్‌బర్గ్‌లో 2026 మే 17న నిర్వహించిన 'యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ' (ఈఆర్‌టీ) సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. వోల్వో గ్రూప్ నిర్వహించిన ఈ ఉన్నత స్థాయి చర్చా కార్యక్రమంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్, ఐరోపా కమిషన్ అధ్యక్షులు శ్రీమతి ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఐరోపాకు చెందిన సీనియర్ పారిశ్రామిక ప్రముఖులు, ప్రముఖ యూరోపియన్- భారతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ప్రకటన
May 15th, 07:56 am
ప్రధాని మోదీ 2026 మే 15 నుండి 20 వరకు యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ దేశాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన వివిధ దేశాధినేతలతో సమావేశమై, కీలక రంగాలలో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరుపుతారు. స్వీడన్‌లో జరిగే 'యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ' మరియు ఓస్లోలో జరిగే '3వ ఇండియా-నార్డిక్ సమ్మిట్'లో ఆయన పాల్గొనడం ఈ పర్యటనలోని ముఖ్యాంశాలు.ప్రధానమంత్రి యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ పర్యటన (మే 15 - 20, 2026)
May 11th, 09:00 pm
ప్రధానమంత్రి మోదీ మే 15 నుండి మే 20, 2026 వరకు యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలిసి వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. నెదర్లాండ్స్‌లో, ప్రధానమంత్రి మోదీ రాజు విల్లెం-అలెగ్జాండర్‌ను కలిసి, ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్‌తో చర్చలు జరుపుతారు. స్వీడన్‌లో, ఆయన ప్రధానమంత్రి క్రిస్టర్‌సన్‌తో చర్చలు జరుపుతారు. నార్వేలో, ఆయన రాజు హెరాల్డ్ Vను కలిసి, ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం, ఆయన ఇటలీని సందర్శించి ప్రధానమంత్రి జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు.సోషల్ మీడియా కార్నర్ - 18 ఏప్రిల్
April 18th, 07:43 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!World is looking at India with renewed confidence: PM Modi in Sweden
April 17th, 11:59 pm
Addressing the Indian Community in Sweden, PM Narendra Modi today thanked PM Stefan Löfven for the warm welcome. Shri Modi remarked that it was not his welcome but the welcome of 125 crore Indians.స్టాక్ హోమ్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
April 17th, 11:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్టాక్ హోమ్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ఈ రోజు ప్రసంగించారు. స్వీడన్ లో తనకు సాదర స్వాగతం పలికినందుకు స్వీడన్ ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా స్వీడన్ రాజు కు మరియు స్వీడన్ ప్రధాని శ్రీ స్టీఫన్ లోఫ్‌వెన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్వీడన్ రాజు మరియు స్వీడన్ ప్రధాని శ్రీ స్టీఫన్ లోఫ్‌వెన్ కూడా హాజరయ్యారు.స్వీడన్ లో భారత ప్రధానమంత్రి పర్యటన (16-17 ఏప్రిల్ 2018)
April 17th, 11:12 pm
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా, 'ఇండియా-నార్డిక్ సమ్మిట్: షేర్డ్ వాల్యూస్, మ్యూచువల్ ప్రోస్పెరిటీ' అనే శీర్షికతో భారతదేశం మరియు స్వీడన్ ఇండియా-నార్డిక్ సదస్సును నిర్వహించాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ మరియు నార్వే ప్రధానమంత్రులు ఈ సదస్సుకు హాజరయ్యారు. నార్డిక్ దేశాలతో భారతదేశం గణనీయమైన ఆర్థిక సంబంధాలను కలిగి ఉంది. వార్షిక ఇండియా-నోర్డిక్ ట్రేడ్ సుమారు 5.3 బిలియన్ డాలర్లుగా ఉంది. భారతదేశంలో సంచిత నార్డిక్ ఎఫ్డిఐకి 2.5 బిలియన్ డాలర్లు.స్వీడన్ ఇండియా సంయుక్త కార్యాచరణ ప్రణాళిక (ఏప్రిల్ 17, 2018)
April 17th, 09:47 pm
ప్రధాని శ్రీ లోఫ్ వెన్ ఆహ్వానించిన మీదట 2018 ఏప్రిల్ 16వ, 17వ తేదీలలో స్టాక్ హోమ్ లో ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఆధికారిక పర్యటన జరిపారు.డెన్మార్క్, ఐస్లాండ్, ఫిన్లాండ్ మరియు నార్వే ప్రధాన మంత్రులతో చర్చలు జరిపిన ప్రధాని మోదీ
April 17th, 09:05 pm
స్వీడన్ పర్యటన సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డెన్మార్క్, ఐస్లాండ్, ఫిన్లాండ్ మరియు నార్వే ప్రధాన మంత్రులతో ఉత్పాదక చర్చలు జరిపారు. ప్రధాని మోదీ పలువురు నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరిపి, పలు దేశాలతో భారతదేశం యొక్క సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు ఉద్దేశించినది.సోషల్ మీడియా కార్నర్ - 17 ఏప్రిల్
April 17th, 07:40 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!భారతదేశంలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ, స్వీడిష్ సిఈఓలతో ప్రధాని మోదీ చర్చ
April 17th, 05:52 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు స్వీడిష్ సిఈఓలతో చర్చించారు. ఆయన ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరియు వ్యాపార సంబంధాలను చర్చించారు. 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు స్వీడన్ విలువైన భాగస్వామని, భారతదేశంలో పెట్టుబడి అవకాశాలను ప్రధాని మోదీ వివరించారు.ప్రధాన మంత్రి స్టాక్ హోమ్ ను సందర్శించిన సందర్భంగా సంతకాలైన మరియు ఆదాన ప్రదానం జరిగిన ఎమ్ఒయు లు, ఒప్పందాల జాబితా (ఏప్రిల్ 16-17, 2018)
April 17th, 05:36 pm
స్వీడన్ లో పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన (ఏప్రిల్ 17, 2018)
April 17th, 04:50 pm
ఇది స్వీడన్ లో నా ఒకటో పర్యటన. దాదాపు మూడు దశాబ్దాల విరామం అనంతరం భారతదేశ ప్రధాన మంత్రి స్వీడన్ లో పర్యటిస్తున్నారు. మా గౌరవార్థం స్వీడన్ లో సాదర స్వాగతాన్ని అందించినందుకు స్వీడిష్ ప్రభుత్వానికి మరియు ప్రధాని శ్రీ లోఫ్‌వెన్ కు నేను నా హృదయ పూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకొంటున్నాను. ఈ పర్యటన కాలంలో ఇతర నార్డిక్ దేశాలతో భారతదేశం యొక్క శిఖర సమ్మేళనాన్ని కూడా ప్రధాని శ్రీ లోఫ్‌వెన్ ఏర్పాటు చేశారు. అందుకు కూడా నేను నా యొక్క హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.