జీ-20 సదస్సు మూడో సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటనకు ఆంగ్లానువాదం
November 23rd, 04:05 pm
మనం ప్రోత్సహించే సాంకేతికత, 'ఆర్థిక కేంద్రకం' గా కాకుండా ' మానవ కేంద్రకం' గా ఉండాలి. దేశాలకే పరిమితమై పోకుండా ప్రపంచమంతా ఉపయోగించుకునేలా ఉండాలి. పరిమిత ప్రత్యేక వనరుల విధానాల స్థానంలో అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్-సోర్స్ విధానాలను ప్రోత్సహించాలి. భారత్ ఈ భావనతోనే తన సాంకేతిక ప్రాజెక్టులను రూపొందిస్తోంది.జీ 20 సమావేశంలో "అందరికీ సమానమైన, న్యాయమైన భవిష్యత్తు"పై ప్రసంగించిన ప్రధానమంత్రి
November 23rd, 04:02 pm
జీ20 శిఖరాగ్ర సదస్సు మూడో సమావేశంలో “అందరికీ సమానమైన, న్యాయమైన భవిష్యత్తు – క్లిష్టమైన ఖనిజాలు, మంచి పని, కృత్రిమ మేధస్సు” అనే అంశంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. క్లిష్టమైన సాంకేతికతలను ప్రోత్సహించే విధానంలో మౌలికమైన మార్పు అవసరమని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అటువంటి సాంకేతిక అన్వయాలు ఆర్థిక ప్రాధాన్యాలుగా కాకుండా ప్రజా ప్రాధాన్యాలుగా, ఉండాలని, 'జాతీయ' కాకుండా ‘అంతర్జాతీయం’ గా ఉండాలని, 'ప్రత్యేక నమూనాలకు' బదులుగా ‘స్వేచ్చా వనరుల‘ ఆధారంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ దృక్పథం భారత సాంకేతిక వ్యవస్థలో భాగమైందని, ఇది అంతరిక్ష ప్రయోగాలు, కృత్రిమ మేధ, డిజిటల్ చెల్లింపులు మొదలైన ప్రతి రంగంలోనూ భారత్ ను ప్రపంచ నాయకత్వ స్థాయిలో నిలిపి గణనీయమైన ప్రయోజనాలు అందించిందని ఆయన వివరించారు.జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశ సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం
November 23rd, 02:18 pm
జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 శిఖరాగ్ర సమావేశ సందర్భంగా గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు గౌరవనీయ శ్రీ సిరిల్ రామఫోసాను కలిశారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి హృదయపూర్వకంగా ఆతిథ్యం ఇచ్చినందుకు... సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు రామఫోసాకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. న్యూఢిల్లీ జీ20 శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లడానికి, వాటి ఆధారంగా మరింత పురోగతి సాధనకు దక్షిణాఫ్రికా జీ20 చేసిన ప్రయత్నాలనూ ఆయన అభినందించారు.ఐబీఎస్ఏ నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
November 23rd, 12:45 pm
ఐబీఎస్ఏ కేవలం మూడు దేశాల వేదిక మాత్రమే కాదు. ఇది మూడు ఖండాలను, మూడు ప్రధాన ప్రజాస్వామ్య శక్తులను, మూడు ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థలను కలిపే ఒక కీలకమైన వేదిక. ఇది మన వైవిధ్యం, భాగస్వామ్య విలువలు ఉమ్మడి ఆకాంక్షలలో పాతుకుపోయిన లోతయిన, శాశ్వతమైన భాగస్వామ్యం కూడా.జోహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఐబీఎస్‌ఏ నేతల సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి
November 23rd, 12:30 pm
ఈ సమావేశం సరైన సమయంలో నిర్వహిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది ఆఫ్రికా గడ్డపై జరిగిన తొలి జీ20 శిఖరాగ్ర సమావేశ సందర్భంలోనే జరగడం మంచి విషయమన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు వరుసగా నాలుగు జీ20 సమావేశాలకు అధ్యక్షత వహించడం దీనికి ఒక కారణమని ప్రధానమంత్రి తెలిపారు. వీటిలో చివరి మూడు జీ20 సమావేశాలను ఐబీఎస్ఏ సభ్య దేశాలే నిర్వహించాయని గుర్తుచేశారు. ఫలితంగా మానవ కేంద్రిత అభివృద్ధి, బహుపాక్షిక సంస్కరణలు, సుస్థిర వృద్ధిపై దృష్టి సారిస్తూ అనేక ముఖ్య కార్యక్రమాలు చేపట్టామని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.Critical minerals are a shared resource of humanity: PM Modi at G20 Johannesburg Summit Session - 2
November 22nd, 09:57 pm
In his statement during the G20 Summit Session - 2 in Johannesburg, South Africa, PM Modi touched upon important topics like critical minerals, natural disasters, space technology and clean energy. The PM highlighted that India is promoting millets. He also said that the G20 must promote comprehensive strategies that link nutrition, public health, sustainable agriculture and disaster preparedness to build a strong global security framework.Empowering Africa’s development and its young talent is in the interest of the entire world: PM Modi during the Johannesburg G20 Summit
November 22nd, 09:36 pm
In his statement at the G20 Summit in Johannesburg, South Africa, PM Modi noted that the historic initiatives launched during the New Delhi G20 Summit have been carried forward here. Putting forth several landmark proposals, he stressed the need to view the human being, society and nature as one integrated whole. He added that advancing Africa’s development and empowering its young talent is in the interest of the entire world.Prime Minister participates in G20 Summit in Johannesburg
November 22nd, 09:35 pm
Prime Minister participated today in the G20 Leaders’ Summit hosted by the President of South Africa, H.E. Mr. Cyril Ramaphosa in Johannesburg. This was Prime Minister’s 12th participation in G20 Summits. Prime Minister addressed both the sessions of the opening day of the Summit. He thanked President Ramaphosa for his warm hospitality and for successfully hosting the Summit.Joint statement by the Government of India, the Government of Australia and the Government of Canada
November 22nd, 09:21 pm
India, Australia, and Canada have agreed to enter into a new trilateral partnership: the Australia-Canada-India Technology and Innovation (ACITI) Partnership. The three sides agreed to strengthen their ambition in cooperation on critical and emerging technologies. The Partnership will also examine the development and mass adoption of artificial intelligence to improve citizens' lives.జీ20 నాయకుల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రితో సమావేశమైన ప్రధాని మోదీ
November 21st, 10:43 pm
దక్షిణాఫ్రికాలో జరుగుతోన్న జీ20 నాయకుల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి శ్రీ ఆంథోనీ అల్బనీస్‌తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను 2020లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లిన అనంతరం గత ఐదేళ్లలో భారత్- ఆస్ట్రేలియా మధ్య సహకారం మరింత బలంగా, వైవిధ్యంగా మారటం పట్ల ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి పట్ల ప్రధానమంత్రి అల్బనీస్ విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇద్దరు నాయకులు ప్రకటించారు.జి20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి మోదీ దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ చేరుకున్నారు
November 21st, 06:25 pm
ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ చేరుకున్నారు. ప్రధానమంత్రి 20వ జి20 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా, ఆయన ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహిస్తారు మరియు భారతదేశం-బ్రెజిల్-దక్షిణాఫ్రికా (IBSA) నాయకుల సమావేశంలో కూడా పాల్గొంటారు.దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగే జీ20 నాయకుల సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ
November 19th, 10:42 pm
20వ జీ20 నాయకుల సదస్సులో పాల్గొనడానికి ప్రధాని మోదీ 2025 నవంబర్ 21-23 వరకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ను సందర్శిస్తారు. శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా, జీ20 ఎజెండాలోని కీలక అంశాలపై భారతదేశం యొక్క దృక్పథాలను ప్రధానమంత్రి ప్రదర్శించారు. శిఖరాగ్ర సమావేశాల సమయంలో, ఆయన ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు మరియు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తున్న ఇండియా-బ్రెజిల్-దక్షిణాఫ్రికా (ఐబిఎస్ఏ) నాయకుల సమావేశంలో కూడా పాల్గొంటారు.‘బ్రిక్స్ -ఆఫ్రికా అవుట్ రీచ్ ఎండ్ బ్రిక్స్ ప్లస్ డైలాగ్’ లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
August 25th, 12:12 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 24 వ తేదీ నాడు జోహాన్స్ బర్గ్ లో జరిగిన ‘బ్రిక్స్ - ఆఫ్రికా అవుట్ రీచ్ ఎండ్ బ్రిక్స్ ప్లస్ డైలాగ్’ లో పాల్గొన్నారు.జన్యుశాస్త్రం లో ప్రముఖురాలు మరియు దక్షిణ ఆఫ్రికాలో అకాడమీ ఆఫ్ సైన్స్ కు సిఇఒ డాక్టర్హిమ్ లా సూడ్ యాల్ గారి తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 24th, 11:33 pm
జన్యుశాస్త్రం లో ప్రముఖురాలు మరియు దక్షిణ ఆఫ్రికా లో అకాడమీ ఆఫ్ సైన్స్ కు సిఇఒ అయిన డాక్టర్ హిమ్ లా సూడ్ యాల్ గారి తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 24 వ తేదీ నాడు జోహాన్స్ బర్గ్ లో భేటీ అయ్యారురాకెట్ శాస్త్రం లో ప్రముఖ శాస్త్రవేత్త మరియుగేలెక్టిక్ ఎనర్జీ వెంచర్స్ స్థాపకుడు శ్రీ సియాబులేలా జుజా తో సమావేశమైన ప్రధానమంత్రి
August 24th, 11:32 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 24వ తేదీ న జోహాన్స్ బర్గ్ లో ప్రసిద్ధ రాకెట్ శాస్త్రవేత్త మరియు గేలెక్టిక్ ఎనర్జి వెంచర్స్ యొక్క స్థాపకుడు, ఇంకా మేనేజింగ్ డైరెక్టరు శ్రీ సియాబులేలా జుజా తో సమావేశమయ్యారు.ఇథియోపియా గణతంత్రం యొక్క ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 24th, 11:27 pm
ఇథియోపియా గణతంత్రం యొక్క ప్రధాని డాక్టర్ శ్రీ అబీయ్ అహమద్ అలీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 24 వ తేదీ నాడు జోహాన్స్ బర్గ్ లో సమావేశమయ్యారు. బ్రిక్స్ పదిహోనో శిఖర సమ్మేళనం సందర్భం లో ఈ భేటీ జరిగింది.సెనెగల్ గణతంత్రం యొక్క అధ్యక్షుని తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 24th, 11:26 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 24 వ తేదీ నాడు జోహాన్స్ బర్గ్ లో బ్రిక్స్ పదిహేనో శిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో సెనెగల్ గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మేకీ సాల్ తో సమావేశమయ్యారు.ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుని తో సమావేశమైనప్రధాన మంత్రి
August 24th, 11:23 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రిక్స్ పదిహేనో శిఖర సమ్మేళనం సందర్భం లో 2023 ఆగస్టు 24 వ తేదీ నాడు జోహాన్స్ బర్గ్ లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీ సైయద్ ఇబ్రాహిమ్ రయీసీ తో సమావేశమయ్యారు.PM's statement at the BRICS-Africa Outreach and BRICS Plus Dialogue
August 24th, 02:38 pm
Prime Minister Narendra Modi's statement at the BRICS-Africa Outreach and BRICS Plus Dialogueబ్రిక్స్ విస్తరణపై ప్రధానమంత్రి ప్రకటన
August 24th, 01:32 pm
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రప్రథమంగా నా మిత్రుడు, అధ్యక్షుడు రమఫోసాను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సు సందర్భంగా అనేక సానుకూల ఫలితాలు రావడం నాకు ఆనందంగా ఉంది.