సీషెల్స్ 50వ స్వాతంత్ర్య ఉత్సవాలకు హాజరయిన ప్రధానమంత్రి
June 29th, 08:00 am
సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మిని ఆహ్వానం మేరకు ఆ దేశ 50వ స్వాతంత్ర ఉత్సవాలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హాజరయ్యారు. ఆ దేశ స్వాతంత్ర్య ఉత్సవాల్లో పాల్గొన్న తొలి భారత ప్రధాని ఆయనే.మారిషస్ ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి
June 28th, 08:45 pm
మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్ చంద్ర రామ్‌గూలంతో మహేలోని విక్టోరియాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. సీషెల్స్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల నేపథ్యంలో నాయకులు భేటీ అయ్యారు. 2024 నవంబరులో ప్రధానిగా రామ్‌గూలం బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన ప్రధానమంత్రి మోదీతో సమావేశం కావడం ఇది నాలుగోసారి.సీషెల్స్‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటన
June 28th, 08:30 pm
2026 జూన్ 27 నుంచి 29 వరకు సీషెల్స్‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటనలో భాగంగా మహేలోని విక్టోరియాలో ఉన్న స్టేట్ హౌస్‌లో సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినితో ఈ రోజు అధికారిక చర్చలు జరిపారు.ఒప్పందాల జాబితా: సీషెల్స్‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటన
June 28th, 08:17 pm
సీషెల్స్ ప్రభుత్వానికి ఒక ఫాస్ట్ పెట్రోల్ నౌక బహుమతిసీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
June 28th, 05:00 pm
ఈ రోజే కొంచెం ముందు నాకు ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ పురస్కారాన్ని అందించి నన్ను గౌరవించినందుకు అధ్యక్షుడు ఎర్మినీ గారికి, సీషెల్స్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతర కృషి చేస్తున్న వారందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇక్కడికి భారత్‌లోని 140 కోట్ల ప్రజల తరపున ఆత్మీయ శుభాకాంక్షలను, శుభాశీస్సులను తీసుకువచ్చాను.సీషెల్స్ అధ్యక్షుడితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
June 28th, 02:02 pm
అలాగే, “గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్” పురస్కార ప్రదానం నాతోపాటు 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా పరిగణిస్తూ, మా దేశవాసులందరి తరఫున హర్షం ప్రకటిస్తున్నాను. ఈ సత్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తూ- వాతావరణ మార్పు సమస్యలను ఎదుర్కొంటున్న, పర్యావరణ పరిరక్షణను భావితరాల కోసం తమ కర్తవ్యంగా భావిస్తున్న దేశాలన్నింటికీ సగౌరవంగా అంకితం చేస్తున్నాను.సెయిషెల్స్‌లో ఘన స్వాగతం అందుకున్న ప్రధాని మోదీ
June 27th, 03:30 pm
సెయిషెల్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మిని ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ నృత్యంతో కూడిన ఒక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం కూడా జరిగింది. ఈ పర్యటన, వివిధ రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించి, భారతదేశం-సెయిషెల్స్ మధ్య ఉన్న సన్నిహిత మరియు సుదీర్ఘ భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తుంది. ఈ పర్యటన సందర్భంగా, ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు ప్రధాని మోదీ సెయిషెల్స్ నాయకత్వంతో సమావేశమవుతారు.