భారత్-నార్డిక్ మూడో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఐస్‌లాండ్ ప్రధానితో సమావేశమైన ప్రధానమంత్రి
May 19th, 06:44 pm
భారత్-నార్డిక్ మూడో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓస్లో వేదికగా ఐస్‌లాండ్ ప్రధానమంత్రి శ్రీమతి క్రిస్ట్రన్ ఫ్రోస్టాడోట్టిర్‌తో సమావేశమయ్యారు.3వ ఇండియా-నార్డిక్ సదస్సు సందర్భంగా డెన్మార్క్ తాత్కాలిక ప్రధాన మంత్రితో సమావేశమైన భారత ప్రధాన మంత్రి
May 19th, 06:40 pm
ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించిన ఉభయ దేశాల నాయకులు, ఉమ్మడి కార్యాచరణలో సాధించిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యావరణం, వాతావరణ మార్పుల రంగాల్లో సహకారానికి ప్రాధాన్యతనిస్తూ రెండు దేశాల్లో హరిత పరివర్తనకు తోడ్పడేలా ఉమ్మడి ప్రయత్నాలను ఏకీకృతం చేసే 'భారత్-డెన్మార్క్ హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం’ సాధించిన పురోగతిని ఇరు నేతలు స్వాగతించారు. 2020లో ఈ హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రారంభమైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య క్రమం తప్పకుండా జరుగుతున్న ఉన్నత స్థాయి పర్యటనలు, చర్చలను గుర్తుచేసిన ఇరు దేశాల నాయకులు.. సరికొత్త- వర్ధమాన సాంకేతికతలు, కమ్యూనికేషన్స్, అధునాతన పరిశోధనలు, అంకురాలు, విద్యాసంబంధ మార్పిడి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. రక్షణ, కృత్రిమ మేధస్సు రంగాల్లో సహకారంపై కూడా వారు చర్చించారు. గుజరాత్‌లోని 'గిఫ్ట్ సిటీ'లో తమ కార్యకలాపాలను ప్రారంభించాల్సిందిగా డెన్మార్క్ కంపెనీలను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.భారత్-నార్డిక్ 3వ సదస్సు సందర్భంగా సంయుక్త మీడియా ప్రకటనలో ప్రధానమంత్రి ప్రకటన
May 19th, 04:25 pm
ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, బహుపక్షవాదం పట్ల ఉమ్మడి నిబద్ధతే మనల్ని సహజ భాగస్వాములుగా చేస్తోంది. సాంకేతికత, సుస్థిర రంగాల్లో మనకున్న ఉమ్మడి ప్రాధాన్యతలు.. ఇరుదేశాల సంబంధాల్లో అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయి. అందువల్లే నార్డిక్ దేశాలతో మన సంబంధాల్లో శక్తిని, వేగాన్ని పెంచేందుకు ఎనిమిదేళ్ల కిందట ఈ వేదికను ఏర్పాటు చేశాం.నార్వే - భారత్ వ్యాపార, పరిశోధన సదస్సులో ప్రధాని ప్రసంగం
May 18th, 11:49 pm
నార్వే, భారత్ వ్యాపార, పరిశోధన వర్గాల మధ్య ఈ రోజు ఇక్కడుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరి మాటలు వినే అవకాశం లభించింది. మన భాగస్వామ్యానికి పునాది చాలా బలంగా ఉందన్న నమ్మకం వారి మాటలు విన్న తర్వాత నాకు కలిగింది.భారత్-నార్వే వాణిజ్య, పరిశోధన సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి
May 18th, 08:50 pm
ఓస్లోలో జరిగిన భారత్-నార్వే వాణిజ్య, పరిశోధన సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గౌరవ రాజు హాకాన్, నార్వే ప్రధానమంత్రి గౌరవ జోనాస్ గార్ స్టోర్ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు.నార్వే ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి ద్వైపాక్షిక చర్చలు
May 18th, 08:21 pm
నార్వే రాజధాని ఓస్లోలో ఆ దేశ ప్రధానమంత్రి శ్రీ జోనాస్ గర్ స్టోరెతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు ఉదయం ఓస్లో విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని శ్రీ మోదీకి నార్వే ప్రధానమంత్రి స్టోరె స్వయంగా విచ్చేసి ఘనస్వాగతం పలికారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు అద్దం పట్టింది.నార్వే రాజు హెరాల్డ్ Vతో ప్రధాని భేటీ
May 18th, 07:36 pm
ఓస్లోలోని రాజభవనంలో నార్వే రాజు హెరాల్డ్ Vతో ప్రధాన మంత్రి మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్-నార్వేల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం మరియు వివిధ రంగాలలో—ముఖ్యంగా నూతన సాంకేతికతల విషయంలో—సాధించిన పురోగతిపై వారు చర్చించారు. ఈ సమావేశం అనంతరం, ప్రధాన మంత్రి మోదీ గౌరవార్థం ఒక మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.నార్వే అత్యున్నత ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పురస్కారాన్ని అందుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 18th, 07:35 pm
నార్వే ఐదవ రాజు కింగ్ హెరాల్డ్ ఈ రోజు ఓస్లోలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇది విదేశీ ప్రభుత్వ అధినేతలకు నార్వే దేశం అందించే అత్యున్నత గౌరవం. నార్వే దేశ ప్రయోజనాలకు, మానవాళికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని బహూకరిస్తారు.నార్వే ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధానమంత్రి పత్రికా ప్రకటన
May 18th, 04:44 pm
గతేడాదే నేను నార్వేలో పర్యటించాల్సి ఉంది. అయితే, పహల్గాంలో ఉగ్రవాద దాడి కారణంగా ఆ పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు నార్వే అండగా నిలిచింది. మన స్నేహబంధం శక్తికి ఇది నిదర్శనం. ఆ మద్దతు, సంఘీభావం పట్ల ఈ రోజు నార్వే పర్యటన సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.