ఆఫ్స్లూయిట్‌డైక్ డ్యామ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి
May 17th, 03:38 pm
నెదర్లాండ్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నీటి నిర్వహణ కట్టడమైన 'ఆఫ్స్లూయిట్‌డైక్' ఆనకట్టను నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టన్‌తో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు.భారత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా రెండు దేశాల సంయుక్త ప్రకటన
May 17th, 03:45 am
నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రాబ్ జెటెన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 16-17 తేదీలలో ఆ దేశంలో పర్యటించారు. శ్రీ మోదీ నెదర్లాండ్స్‌లో పర్యటించడం ఇది రెండోసారి.భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళిక [2026-2030]
May 17th, 03:15 am
2026 మే 16న హేగ్ నగరంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ రాబ్ జెట్టెన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్దిష్ట లక్ష్యాలు, కాలపరిమితితో కూడిన కార్యక్రమాలు, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికల ద్వారా భారత్-నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాలను 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచేందుకు ఇరు దేశాల ప్రధానులు అంగీకరించారు. ఈ లక్ష్య సాధన కోసం రాబోయే 5 సంవత్సరాల కాలానికి (2026-2030) ‘భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళిక’ను ఇరు దేశాలు ఆమోదించాయి.నెదర్లాండ్స్‌లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అవగాహన ఒప్పందాలు... ఒడంబడికలు
May 17th, 02:47 am
భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య భవిష్యత్ ప్రణాళిక [2026-2030]నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రోబ్ ఎటెన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారిక చర్చలు
May 17th, 02:35 am
ఈ సమావేశంలో భారత్-నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై వారిద్దరూ విస్తృతంగా చర్చించారు. రెండు దేశాల మధ్య ఉమ్మడి విలువలు, విశ్వాసంతోపాటు సమన్వయం, సహకారం ఇనుమడించడాన్ని ప్రతిబింబిస్తూ, ఈ స్నేహబంధాన్ని “వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి విస్తరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, అత్యాధునిక-కీలక సాంకేతికతలు, సముద్ర రంగం, పునరుత్పాదక ఇంధనం, విద్యా రంగాల్లో సహకార విస్తృతి దిశగా వ్యూహాత్మక భాగస్వామ్యంపై భవిష్యత్ ప్రణాళిక ఆమోదానికి నిశ్చయించారు. ఉభయ పక్షాల మధ్య వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత-ఆవిష్కరణల భాగస్వామ్య విస్తరణ సహా భారత వృద్ధి ప్రస్థానం డచ్ కంపెనీలకు ఆశావహ వ్యాపార అవకాశాలను కల్పించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.నెదర్లాండ్స్ పీఎం రాబ్ జెట్టెన్‌తో ప్రతినిధుల స్థాయి సమావేశం సందర్భంగా పీఎం ప్రసంగం
May 16th, 11:58 pm
నాకు, నా ప్రతినిధి బృందానికి అందించిన ఆత్మీయ స్వాగతానికి హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత నెదర్లాండ్స్‌ను సందర్శించటం నాకెంతో సంతోషంగా ఉంది. గత పదేళ్లలో భారత్-నెదర్లాండ్స్ భాగస్వామ్యం గణనీయంగా పురోగతిని సాధించింది.సెమీకండక్టర్ల తయారీకి సంబంధించిన ఒప్పందంపై ప్రధానమంత్రి మోదీ సమక్షంలో సంతకాలు చేసిన ఏఎస్ఎంఎల్, టాటా ఎలక్ట్రానిక్స్
May 16th, 10:30 pm
గుజరాత్‌లోని ధోలేరాలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై టాటా ఎలక్ట్రానిక్స్, ఏఎస్ఎంఎల్‌లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ రాబ్ జెట్టెన్ సమక్షంలో సంతకాలు చేశాయి.డచ్ ‘సీఈవో’లతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశం
May 16th, 10:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా ఇవాళ నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రోబ్ జెట్టెన్‌తో సంయుక్తంగా ఆ దేశంలోని వివిధ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారుల (సీఈవో)తో సమావేశమయ్యారు. ఇంధనం, ఓడరేవులు, ఆరోగ్యం, వ్యవసాయం, వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం వంటి పలు రంగాల్లోని ప్రసిద్ధ కంపెనీల ‘సీఈవో’లతో అనేక అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా సెమీకండక్టర్లు, సాంకేతికత-ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, రవాణా, సముద్ర రంగం, సుస్థిరత, ఇంధనం, వ్యవసాయ రంగాలపై తమ ఆలోచనలను పంచుకుంటూ, భారత్‌కు సంబంధించి తమ వ్యాపార వ్యూహాలను వివరించారు.చోళ తామ్ర పత్రాలు భారత్‌కు అప్పగింత
May 16th, 10:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ రాబ్ జెట్టెన్‌ల సమక్షంలో ఈ రోజు 11వ శతాబ్దపు చోళుల తామ్ర పత్రాలను లైడెన్ విశ్వవిద్యాలయ గ్రంథాలయం భారత ప్రభుత్వానికి అప్పగించింది.నెదర్లాండ్స్‌లో సీఈవోల రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ప్రధాని ప్రసంగం
May 16th, 10:00 pm
ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలకు నిలయాలైన కొన్ని కంపెనీల అధినేతల నడుమ ఈ రోజు ఇక్కడుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు 300కు పైగా డచ్ కంపెనీలు భారత్ ప్రస్థానంలో భాగమయ్యాయి. భారత్ పట్ల మీకున్న సానుకూల దృక్పథం, విశ్వాసం వల్లే.. ఐరోపా నుంచి భారత్‌లో అతిపెద్ద పెట్టుబడిదారుగా, రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నెదర్లాండ్స్ నిలిచింది.నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ - అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను మర్యాదపూర్వకంగా కలుసుకున్న ప్రధానమంత్రి
May 16th, 08:13 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హేగ్‌లోని ప్యాలెస్ హౌస్ టెన్ బాష్‌లో నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ - అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.నెదర్లాండ్స్‌లో ప్రవాస భారతీయుల కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
May 16th, 01:30 pm
ఇంతటి అపారమైన ఆదరాభిమానాలు.. ఇంతటి అద్భుతమైన ఉత్సాహం. నిజం చెప్పాలంటే ఒక్క క్షణం నేను నెదర్లాండ్స్‌లో ఉన్నాననే విషయమే మర్చిపోయాను. భారత్‌లోనే ఎక్కడో ఒక పెద్ద పండుగ జరుగుతున్నట్లు అనిపిస్తోంది.నెదర్లాండ్స్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
May 16th, 01:20 pm
నేడు నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో ప్రవాస భారతీయులు నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా అక్కడకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు, భారతీయ మిత్రులు ఆయనకు ఎంతో ఉత్సాహంగా, ఘన స్వాగతం పలికారు.నెదర్లాండ్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
May 15th, 11:35 pm
తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా రెండో దశలో ప్రధాని మోదీ నెదర్లాండ్స్‌కు చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది.యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ప్రకటన
May 15th, 07:56 am
ప్రధాని మోదీ 2026 మే 15 నుండి 20 వరకు యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ దేశాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన వివిధ దేశాధినేతలతో సమావేశమై, కీలక రంగాలలో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరుపుతారు. స్వీడన్‌లో జరిగే 'యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ' మరియు ఓస్లోలో జరిగే '3వ ఇండియా-నార్డిక్ సమ్మిట్'లో ఆయన పాల్గొనడం ఈ పర్యటనలోని ముఖ్యాంశాలు.ప్రధానమంత్రి యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ పర్యటన (మే 15 - 20, 2026)
May 11th, 09:00 pm
ప్రధానమంత్రి మోదీ మే 15 నుండి మే 20, 2026 వరకు యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలిసి వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. నెదర్లాండ్స్‌లో, ప్రధానమంత్రి మోదీ రాజు విల్లెం-అలెగ్జాండర్‌ను కలిసి, ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్‌తో చర్చలు జరుపుతారు. స్వీడన్‌లో, ఆయన ప్రధానమంత్రి క్రిస్టర్‌సన్‌తో చర్చలు జరుపుతారు. నార్వేలో, ఆయన రాజు హెరాల్డ్ Vను కలిసి, ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం, ఆయన ఇటలీని సందర్శించి ప్రధానమంత్రి జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు.సోషల్ మీడియా కార్నర్ 28 జూన్ 2017
June 28th, 07:44 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!భారతదేశం వైవిధ్యభరితంగా ఉన్న దేశంగా ఉండడం ప్రతి భారతీయుడు గర్వించదగినది: ప్రధాని మోదీ
June 27th, 10:51 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్లో భారత సంతతితో సంభాషించారు. తన ప్రసంగంలో, నెదర్లాండ్స్ మరియు సురినామెలలో భారతీయ ప్రవాసులు పాత్రను ప్రధాని మోదీ ప్రశంసించారు. మొత్తం యూరప్లో నెదర్లాండ్స్ రెండవ అతి ఎక్కువ భారతీయ ప్రవాసులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.నెదర్లాండ్స్లో భారత కమ్యూనిటీతో చర్చించిన ప్రధాని
June 27th, 10:50 pm
నెదర్లాండ్స్లో భారత కమ్యూనిటీతో ప్రధాని సంభాషించారు. నెదర్లాండ్స్ మరియు సురినామ్లో భారతీయ ప్రవాసులు పాత్రను ప్రధాని మోదీ ప్రశంసించారు.నెదర్లాండ్స్ రాణి మెక్సిమా మరియు రాజు విల్లెం-అలెగ్జాండర్ లను కలిసిన ప్రధాని మోదీ
June 27th, 09:26 pm
నెదర్లాండ్లోని విల్లా ఐకెనోర్స్ట్ వద్ద నెదర్లాండ్స్ రాణి మెక్సిమా మరియు రాజు విల్లెం-అలెగ్జాండర్ లను ప్రధాని మోదీ కలుసుకున్నారు.