మాల్దీవుల 60వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరైన ప్రధానమంత్రి
July 26th, 06:47 pm
మాల్దీవుల దేశంలో అధికారిక పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ 60వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రధానమంత్రి హాజరు కావడం ఇదే మొదటిసారి. అధ్యక్షుడు ముయిజు ఆతిథ్యం ఇచ్చిన ప్రభుత్వాధినేత లేదా దేశ నాయకుడు కూడా ప్రధాని మోదీనే కావటం విశేషం.ప్రధానమంత్రి మాల్దీవ్స్ పర్యటనలో ముఖ్యాంశాలు
July 26th, 07:19 am
మాల్దీవ్స్‌కు రూ.4,850 కోట్ల దశలవారీ రుణ (ఎల్‌వోసీ) సౌకర్యం పొడిగింపుభారత్, మాల్దీవుల దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవం సందర్భంగా స్మారక స్టాంపుల విడుదల
July 25th, 09:08 pm
భారత్, మాల్దీవుల దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు నిండిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మాల్దీవులు అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజు స్మారక స్టాంపులను విడుదల చేశారు.మాల్దీవుల అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోదీ
July 25th, 08:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మాలేలోని అధ్యక్షుడి కార్యాలయంలో మాల్దీవుల దేశాధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజుతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీకి రిపబ్లిక్ స్క్వేర్‌లో అధ్యక్షుడు ముయిజు ఘనంగా సంప్రదాయపూర్వకంగా స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్యనున్న లోతైన స్నేహ బంధాన్ని, హృదయపూర్వక వాతావరణాన్ని ఈ సమావేశం ప్రతిబింబించింది.మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ భవనాన్ని ఆ దేశ అధ్యక్షుడితో కలిసి ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
July 25th, 08:43 pm
మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ అత్యాధునిక భవనాన్ని ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజుతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర ఈ రోజు ప్రారంభించారు.మాల్దీవ్స్ అధ్యక్షుడితో సంయుక్త పాత్రికేయ సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
July 25th, 06:00 pm
ఇది భారత్-మాల్దీవ్స్ దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవ ఏడాది కూడా కావడం విశేషం. వాస్తవానికి ఈ బంధానికిగల మూలాలు చరిత్రకన్నా ప్రాచీనమైనవేగాక, సముద్రమంతటి లోతైనవి కూడా. అనాదిగా కొనసాగుతున్న స్నేహబంధాన్ని పటిష్ఠం చేసుకోవడంలో భాగంగా ఈ రోజు స్మారక స్టాంపును ఆవిష్కరించాం. దీనిపై కనిపించే రెండు దేశాల సంప్రదాయ పడవల చిత్రం చూస్తే- చరిత్రలో మనం ఇరుగుపొరుగు మాత్రమే కాదని, సహ ప్రయాణికులమని స్పష్టమవుతుంది.మాల్దీవుల మాలే చేరుకున్న ప్రధాని మోదీ
July 25th, 10:28 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం మాల్దీవులకు చేరుకున్నారు. ఆయనను విమానాశ్రయంలో అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు స్వయంగా స్వాగతించారు. ప్రధాని మోదీ మాల్దీవుల 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొంటారు.యునైటెడ్ కింగ్డమ్, మాల్దీవుల పర్యటనకు బయల్దేరే ముందు ప్రధాని ప్రకటన
July 23rd, 01:05 pm
భారత్, యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇటీవలి కాలంలో గణనీయమైన పురోగతిని సాధించింది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, రక్షణ, విద్య, పరిశోధన, సుస్థిరత, ఆరోగ్యం, ప్రజా సంబంధాలు తదితర రంగాల్లో మన సహకారం విస్తరించింది. గౌరవ ప్రధాని సర్ కీర్ స్టార్మర్‌తో జరిపే సమావేశంలో రెండు దేశాల్లోనూ సంక్షేమాన్ని, వృద్ధిని, ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే అవకాశం లభిస్తుంది. ఈ పర్యటనలో గౌరవ కింగ్ ఛార్లెస్ IIIతో సమావేశం అయ్యేందుకు ఎదురుచూస్తున్నా.మాల్దీవుల పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగించారు
June 08th, 08:14 pm
మాల్దీవుల పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్ర ప్రాయోజిత ఉగ్రవాదాన్ని అతిపెద్ద ముప్పుగా పేర్కొన్నారు మరియు ఉగ్రవాద సవాలుపై పోరాడటానికి ప్రపంచ సమాజం కలిసి రావడం చాలా ముఖ్యం అని అన్నారు. మాల్దీవుల శుక్రవారం మసీదు పరిరక్షణకు భారత్ సహకరిస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు.మాల్దీవ్స్ లో ప్రధాన మంత్రి ఆధికారిక పర్యటన సందర్భం గా సంతకాలు జరిగిన ఒప్పందాలు/ ఎంఒయు ల జాబితా
June 08th, 07:38 pm
మాల్దీవుల అత్యున్నత గౌరవం, ఆర్డర్ ఆఫ్ నిషానిజుద్దీన్ పొందిన ప్రధాని మోదీ
June 08th, 07:11 pm
ప్రధాని నరేంద్ర మోదీని మాల్దీవుల అత్యున్నత గౌరవం, ఆర్డర్ ఆఫ్ నిషానిజుద్దీన్ తో ఈ రోజు సత్కరించారు. ఇది విదేశీ పౌరులకు ఇచ్చే అత్యున్నత గౌరవం.మాల్దీవుల అధ్యక్షుడితో సంయుక్త ప్రెస్ మీట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు
June 08th, 07:11 pm
అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్‌తో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో, ప్రధాని మోదీ మాల్దీవులకు విదేశీ గౌరవప్రదమైన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు, ఇది ప్రతి భారతీయుడికి గౌరవంగా పేర్కొన్నారు. వ్యాపారం, ఓడరేవులు, పరిశుభ్రత, క్రీడలు, మత్స్య, వ్యవసాయం, పర్యాటక రంగంపై దృష్టి సారించి ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. సముద్ర మరియు రక్షణ సంబంధాలు ప్రధానం అని ప్రధాని తెలిపారు.మాల్దీవ్స్ మరియు శ్రీ లంక ల పర్యటన కు బయలుదేరి వెళ్లడానికి ముందు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రకటన
June 07th, 04:20 pm
రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిం మహ్మద్ సొలిహ్, డెమోక్రటిక్ సోశలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన లు వారి వారి దేశాలను సందర్శించాలని ఆహ్వానించిన మీదట నేను 2019 జూన్ 08వ తేదీన మాల్దీవ్స్ లోను, 2019 జూన్ 09 తేదీన శ్రీ లంక లోను పర్యటించనున్నాను. ప్రధాన మంత్రి గా నేను మళ్లీ ఎన్నికైన అనంతరం జరిపే తొలి విదేశీ సందర్శన ఇదే అవుతుంది.