సంయుక్త ప్రకటన: భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కువైట్ అధికారిక పర్యటన (డిసెంబరు 21-22)

December 22nd, 07:46 pm

గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 21-22 తేదీల్లో కువైట్ ను సందర్శించారు. ఆయన కువైట్ ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ నెల 21న కువైట్ లో జరిగిన 26వ అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవానికి గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవ అతిథిగా హాజరయ్యారు.

కువైట్ ప్రధానితో ప్రధానమంత్రి భేటీ

December 22nd, 06:38 pm

రాజకీయాలు, వ్యాపారం, పెట్టుబడి, ఇంధనం, రక్షణ, భద్రత, ఆరోగ్యం, విద్య, టెక్నాలజీ, సాంస్కృతిక సంబంధాలు, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా అనేక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపర్చుకోవడానికి ఒక మార్గసూచీని రూపొందించుకోవడంపై నేతలిద్దరూ చర్చించారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తృతపర్చుకోవాలని వారు స్పష్టంచేశారు. ఇంధనం, రక్షణ, వైద్య పరికరాలు, ఫార్మా, ఫుడ్ పార్కులు, తదితర రంగాల్లో కొత్త కొత్త అవకాశాలను పరిశీలించడానికి భారతదేశానికి రావాల్సిందిగా కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఇతర ఆసక్తిదారులతో కూడిన ఒక ప్రతినిధివర్గాన్ని ప్రధాని ఆహ్వానించారు. సాంప్రదాయక మందులు, వ్యవసాయ పరిశోధన రంగాల్లో సహకారం అంశాన్ని కూడా నేతలు చర్చించారు. ఆరోగ్యం, శ్రమశక్తి, హైడ్రోకార్బన్ల రంగాల్లో ఇప్పటికే సంయుక్త కార్యాచరణ బృందాలు (జేడబ్ల్యూజీలు) పనిచేస్తుండగా, వీటికి అదనంగా సహకారంపై ఏర్పాటైన సంయుక్త సంఘం (జేసీసీ) పై ఇటీవల సంతకాలు చేయడాన్ని వారు స్వాగతించారు. వ్యాపారం, పెట్టుబడి, విద్య, టెక్నాలజీ, వ్యవసాయం, భద్రతలతో పాటు సాంస్కృతిక రంగాల్లో కొత్తగా జేడబ్ల్యూజీలను ఈ జేసీసీ పరిధిలో ఏర్పాటు చేశారు.

ప్రధానమంత్రి కువైట్ పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలు (డిసెంబరు 21-22, 2024)

December 22nd, 06:03 pm

ఈ ఎంఓయూ రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారానికి సంస్థాగత రూపురేఖలను అందిస్తుంది. ఈ ఎంఓయూలో భాగంగా శిక్షణనివ్వడం, సిబ్బందికీ, నిపుణులకూ రెండు దేశాల్లోనూ పర్యటించే అవకాశాల్ని కల్పించడం, సైన్యపరంగా సంయుక్త విన్యాసాల్ని నిర్వహించడం, రక్షణ రంగ పరిశ్రమల్లో సహకరించుకోవడం, రక్షణ సామగ్రి సరఫరాలతోపాటు పరిశోధన -అభివృద్ధిలలో సహకారం, తదితర అంశాలు ఈ ఎంఓయూ పరిధిలో భాగంగా ఉన్నాయి.

కువైట్ అమీరుతో ప్రధానమంత్రి భేటీ

December 22nd, 05:08 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కువైట్ అమీరు శ్రీ షేక్ మెశల్ అల్-అహమద్ అల్-జబర్ అల్-సబాహ్‌తో సమావేశమయ్యారు. ఈ నేతలిద్దరూ సమావేశం కావడం ఇది మొదటిసారి. బాయన్ ప్యాలెస్‌కు ప్రధాని చేరుకోవడంతోనే, కువైట్ ప్రధాని శ్రీ అహమద్ అల్-అబ్దుల్లా అల్-అహమద్ అల్-సబాహ్ ఆయనకు సంప్రదాయబద్ధ పద్ధతిలో స్వాగతం పలికి, ప్యాలెస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.

ప్రధానమంత్రికి కువైట్ అత్యున్నత జాతీయ పురస్కారం ప్రదానం

December 22nd, 04:37 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కువైట్ అమీరు శ్రీ షేక్ మెశల్ అల్-అహమద్ అల్-సబాహ్ ‘‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్-కబీర్’’ అవార్డును ప్రదానం చేశారు. ఈ పురస్కారం కువైట్‌లో అత్యున్నత జాతీయ పురస్కారం. ఈ కార్యక్రమంలో కువైట్ ప్రధాని శ్రీ షేక్ అహమద్ అల్-అబ్దుల్లా అల్-అహమద్ అల్-సబాహ్ కూడా పాల్గొన్నారు.

అరేబియన్ గల్ఫ్ కప్‌: కువైట్ అమీరు గౌరవ అతిథి హోదాలో హాజరైన ప్రధానమంత్రి

December 21st, 10:24 pm

కువైట్ అమీరు శ్రీ షేక్ మెశల్ అల్-అహమద్ అల్-జబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 26వ అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభ కార్యక్రమానికి అమీరు ‘గౌరవ అతిథి’ హోదాలో హాజరయ్యారు. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని కువైట్‌లో నిర్వహించారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి కువైట్ అమీరుతోనూ, యువరాజు, ప్రధానితోనూ కలిసి చూశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాని కువైట్ నాయకత్వంతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

రామాయణ, మహాభారతాలు అరబిక్ భాషలోకి అనువాదం: శ్రీ అబ్దుల్లా అల్-బరూన్, శ్రీ అబ్దుల్ లతీఫ్ అల్-నసేఫ్‌లకు ప్రధానమంత్రి ప్రశంసలు

December 21st, 07:03 pm

రామాయణాన్ని, మహాభారతాన్ని అరబిక్ భాషలోకి అనువాదం చేసి ప్రచురించినందుకు శ్రీ అబ్దుల్లా అల్-బరూన్, శ్రీ అబ్దుల్ లతీఫ్ అల్-నసేఫ్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

కువైట్‌లో కార్మికుల శిబిరాన్ని సందర్శించిన ప్రధానమంత్రి

December 21st, 07:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కువైట్‌లో పర్యటిస్తున్న సందర్భంగా తన మొదటి కార్యక్రమంలో భాగంగా అక్కడ మీనా అబ్దుల్లా ప్రాంతంలో ఉన్న ఒక కార్మికుల శిబిరానికి వెళ్లారు. అక్కడ దాదాపు 1500 మంది భారతీయ కార్మికులు పనిచేస్తున్నారు. ప్రధాని భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను కలుసుకొని వారితో మాట్లాడి, వారి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

కువైట్ లో ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్ 'హలా మోదీ 'లో ప్రధాన మంత్రి ప్రసంగం తెలుగు అనువాదం

December 21st, 06:34 pm

నేను కువైట్‌కు వచ్చి కేవలం రెండున్నర గంటలు మాత్రమే అయింది. అయితే, నేను ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి ఇది నా ప్రాంతం అనే భావన, ఆత్మీయతా భావం నన్ను అల్లుకుపోయినట్టు అనిపిస్తోంది. మీరు అందరూ భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు, కానీ మీ అందరినీ చూసినప్పుడు, నాకు ఒక మినీ భారత దేశం కనిపిస్తోంది. ఇక్కడ నేను ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ప్రాంతాల నుంచి వేర్వేరు భాషలు, మాండలికాలు మాట్లాడే ప్రజలను చూస్తున్నాను. అయినా, అందరి హృదయాలలో ఒకే విధమైన ప్రతిధ్వని వినిపిస్తోంది, అందరి హృదయాలలో ఒకే గొంతు మారుమోగుతోంది – భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై!

కువైట్‌లో ‘హలా మోదీ’ కార్యక్రమం: భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

December 21st, 06:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కువైట్ నగరంలో షేక్ సాద్ అల్-అబ్దుల్లా ఇండోర్ స్పోర్ట్‌స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమం ‘హలా మోదీ’లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కువైట్‌లోని విభిన్న వర్గాలకు చెందిన భారత జాతీయులు హాజరయ్యారు.

ప్రధానమంత్రికి కువైట్‌లో నివసిస్తున్న భారతీయ సముదాయం ఆత్మీయ స్వాగతం: సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాని

December 21st, 06:16 pm

కువైట్‌లో నివసిస్తున్న భారతీయ సముదాయం తనకు ఆత్మీయంగా స్వాగతం పలికినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారిలో ఉప్పొంగుతున్న శక్తి, ప్రేమ, భారత్ అంటే అచంచలమైన అనుబంధం నిజంగా ప్రేరణనిచ్చేవిగా ఉన్నాయని ఆయన అన్నారు.

కువైట్ చేరుకున్న ప్రధాని మోదీ

December 21st, 03:39 pm

కువైట్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. 43 ఏళ్లలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. తన పర్యటనలో, ప్రధాని మోదీ అమీర్, క్రౌన్ ప్రిన్స్ మరియు కువైట్ ప్రధానితో చర్చలు జరుపుతారు. అతను భారతీయ కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అవుతారు మరియు అరేబియా గల్ఫ్ కప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు

కువైట్ పర్యటనకు ముందు ప్రధాని సందేశం

December 21st, 09:21 am

’’గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సభా ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం నేను ఈ రోజు కువైట్ బయల్దేరుతున్నాను.