హాషెమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్‌కు భారత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటనలో సంయుక్త పత్రికా ప్రకటన
December 16th, 03:56 pm
హేషమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 డిసెంబర్ 15, 16 తేదీల్లో ఆ దేశంలో పర్యటించారు.భారత్-జోర్డాన్ బిజినెస్ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 16th, 12:24 pm
కాలుష్య రహిత వృద్ధి లేనిదే నేటి ప్రపంచం ముందడుగు వేయడం సాధ్యం కాదు. అందువల్ల కాలుష్య రహిత ఇంధనం ఇక ఎంతమాత్రం ఐచ్ఛికం కాదు... అదొక అవసరంగా మారిపోయింది. ఆ మేరకు భారత్ ఇప్పటికే సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ సహా ఇంధన నిల్వలో పెట్టుబడిదారుగా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రంగంలో జోర్డాన్‌కు అపార సామర్థ్యం ఉంది కాబట్టి, దాన్ని రెండు దేశాలూ సంయుక్తంగా మరింత సద్వినియోగం చేసుకోవచ్చు.ఇండియా-జోర్డాన్ బిజినెస్ ఫోరంలో ప్రసంగించిన ప్రధానమంత్రి, కింగ్ అబ్దుల్లా II
December 16th, 12:23 pm
అమ్మాన్‌లో ఈ రోజు నిర్వహించిన ఇండియా-జోర్డాన్ బిజినెస్ ఫోరాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా II ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి జోర్డాన్ యువరాజు హుస్సేన్, ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రి, పెట్టుబడుల మంత్రి కూడా హాజరయ్యారు. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు పెంపొందించుకోవాల్సిన ప్రాధాన్యాన్ని రాజు, ప్రధాని ఇద్దరూ గుర్తించారు. సామర్థ్యాన్ని, అవకాశాలను వృద్ధిగా, సంక్షేమంగా మార్చాలని రెండు దేశాల పారిశ్రామిక వేత్తలను కోరారు. దక్షిణాసియా, పశ్చిమాసియా పరిధి దాటి విస్తరించిన ఆర్థిక కారిడార్‌ను తయారుచేయడానికి జోర్డాన్ స్వేచ్ఛాయుత వ్యాపార ఒప్పందాలను, భారత ఆర్థిక శక్తిని ఏకం చేయాలని జోర్డాన్ రాజు తెలిపారు.List of Outcomes Visit of Prime Minister to Jordan
December 15th, 11:52 pm
During the meeting between PM Modi and HM King Abdullah II of Jordan, several MoUs were signed. These include agreements on New and Renewable Energy, Water Resources Management & Development, Cultural Exchange and Digital Technology.జోర్డాన్ రాజు గౌరవ అబ్దుల్లా-IIతో సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
December 15th, 11:00 pm
నాకు, నా ప్రతినిధి బృందానికి అందించిన ఆత్మీయ స్వాగతానికి హృదయ పూర్వక ధన్యవాదాలు. భారత్-జోర్డాన్ మధ్య సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సానుకూల ఆలోచనలను మీరు ప్రతిపాదించారు. మీ స్నేహానికి, భారత్ పట్ల చూపిన ప్రాధాన్యతకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.జోర్డాన్ రాజు గౌరవ అబ్దుల్లా-II గారితో ప్రధానమంత్రి భేటీ
December 15th, 10:58 pm
జోర్డాన్ రాజు అబ్దుల్లా IIగారితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సమావేశమయ్యారు. అల్ హూస్సేనియా ప్యాలెస్‌కు చేరుకున్న మోదీకి అబ్దుల్లా II రాజుగారు లాంఛనప్రాయంగా స్వాగతం పలికారు.జోర్డాన్‌లోని అమ్మాన్‌కు చేరుకున్న భారత ప్రధానమంత్రికి ప్రత్యేక స్వాగతం
December 15th, 04:48 pm
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమ్మాన్‌కు చేరుకున్నారు. అమ్మాన్ విమానాశ్రయానికి వచ్చిన భారత ప్రధానమంత్రిని.. గౌరవ జోర్డాన్ ప్రధానమంత్రి డాక్టర్ జాఫర్ హసన్ సాదరంగా ఆహ్వానించి, లాంఛనంగా స్వాగతం పలికారు. ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలకు ఇది ప్రతీక.జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ప్రకటన
December 15th, 08:15 am
ఈ రోజు నేను మూడు దేశాలు- హాషెమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్, ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియా, ఒమన్ సుల్తానేట్‌లో పర్యటించేందుకు బయలుదేరి వెళుతున్నాను. ఈ మూడు దేశాలతోనూ భారత్‌కు ప్రాచీన నాగరిక సంబంధాలు, సమకాలీన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి.