జపాన్ మియాగి రాష్ట్రంలోని సెండాయ్‌లో ఉన్న సెమీకండక్టర్ కేంద్రాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి

August 30th, 11:52 am

జపాన్ ప్రధానమంత్రి శ్రీ షిగేరు ఇషిబాతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జపాన్‌కు చెందిన మియాగి రాష్ట్రంలోని సెండాయ్‌లో పర్యటించారు. సెమీ‌కండరక్టర్ రంగంలో ప్రముఖ జపాన్ కంపెనీ అయిన టోక్యో ఎలక్ట్రాన్ మియాగీ లిమిటెడ్‌ను (టీఈఎల్ మియాగీ) వారు సందర్శించారు. ప్రపంచ సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన విలువ గొలుసులో టీఈఎల్ పాత్ర, దాని అధునాతన తయారీ సామర్థ్యాలు.. భారత్‌తో ఆ కంపెనీ ప్రణాళికలో ఉన్న భాగస్వామ్యాల గురించి ప్రధాన మంత్రికి వివరించారు. సెమీకండక్టర్ రంగంలో సరఫరా వ్యవస్థ, తయారీ, పరీక్షలకు సంబంధించిన విభాగాల్లో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకునేందుకు రెండు దేశాల మధ్య ఉన్న అవకాశాల గురించి ఇరువురు నాయకులకు క్షేత్ర స్థాయి అవగాహనను ఈ సందర్శన కల్పించింది.

జపాన్ రాష్ట్రాల గవర్నర్లతో సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 30th, 08:00 am

ఈ సమావేశ మందిరంలో నేను సైతామా నగర వేగాన్నీ, మియాగీ నగర స్థిరత్వాన్నీ, ఫుకోకా నగర చైతన్యాన్నీ, నారా పట్టణపు వారసత్వపు గొప్పతనాన్నీ అనుభూతి చెందుతున్నాను. కుమామోటో నగర వెచ్చదనం, నాగానో నగర తాజాదనం, షిజోకా సౌందర్యం, నాగసాకి ప్రాణనాడిని మీరు కలిగి ఉన్నారు. మీరంతా ఫ్యుజీ పర్వత బలాన్ని, సాకురా పూల మొక్క స్ఫూర్తినీ కలిగి ఉన్నారు. కలిసికట్టుగా మీరు జపాన్‌ను ఎల్లప్పుడూ అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు.

జపాన్ లోని రాష్ట్రాల గవర్నర్లతో ప్రధానమంత్రి భేటీ

August 30th, 07:34 am

జపాన్‌లోని స్థానిక ప్రభుత్వాల గవర్నర్లతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు. 16 మంది గవర్నర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ముఖచిత్రం: భారత్ - జపాన్ ఆర్థిక భద్రతా సహకారం

August 29th, 08:12 pm

ఉమ్మడి విలువలు, పరస్పర గౌరవంపై ఆధారపడిన భారత్ - జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం రెండు దేశాల భద్రత, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో అత్యంత కీలకంగా ఉంది. మన వ్యూహాత్మక దృక్పథం, ఆర్థిక అవసరాలలో పెరుగుతున్న సమానత్వం ఆధారంగా ఉన్న మన ద్వైపాక్షిక సహకారానికి ఆర్థిక భద్రతాపరంగా సహకారం ఎంతో కీలకం.

భద్రతా సహకారంపై భారత్-జపాన్ సంయుక్త ప్రకటన

August 29th, 07:43 pm

భారత్-జపాన్ ప్రభుత్వాలు (ఇకమీదట ఇరుపక్షాలూ), ఉమ్మడి విలువలు, ప్రయోజనాల ఆధారంగా భారత్-జపాన్ రాజకీయ దృక్పథాన్ని, ప్రత్యేక వ్యూహాత్మక, ప్రాపంచిక భాగస్వామ్య లక్ష్యాలను గుర్తుచేసుకోవడం, నిబంధనల ఆధారితమైన అంతర్జాతీయ క్రమాన్ని సమర్థించే ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుతమైన, అందరికీ అందుబాటులో గల, శాంతియుతమైన, సుసంపన్నమైన, ఎలాంటి ఒత్తిళ్లు లేని ప్రాంతంగా అభివృద్ధి చేయడంలో ఇరుదేశాల కీలక పాత్రను ప్రధానంగా ప్రాస్తావించడం, ఇటీవలి సంవత్సరాల్లో ఇరుదేశాల మధ్య గణనీయ పురోగతిని సాధించిన ద్వైపాక్షిక భద్రతా సహకారం.. ఇరుపక్షాల వ్యూహాత్మక దృక్పథం, పాలసీ ప్రాధాన్యాల పరిణామాలను ప్రస్తావించడం, ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే వనరులు, సాంకేతిక సామర్థ్యాల పరంగా ఇరుదేశాల సమష్టి బలాలను గుర్తించడం, ఇరుదేశాల జాతీయ భద్రత, నిరంతర ఆర్థికవృద్ధి పరంగా ఆచరణాత్మక సహకారాన్ని పెంపొందించుకోవడానికి కట్టుబడి ఉండటం, ఇండో-పసిఫిక్ ప్రాంతం, ఆ పొరుగున ఉన్న ప్రాంతాలకు సంబంధించిన ఉమ్మడి భద్రతా సమస్యలను పరిష్కరించే విషయంలో మరింత సమన్వయాన్ని సాధించడం, రూల్ ఆఫ్ లా ఆధారంగా అంతర్జాతీయ క్రమాన్ని సమర్థించుటకు కట్టుబడి ఉండటం, ఇరుదేశాల భాగస్వామ్యంలో నూతన దశను ప్రతిబింబిస్తూ భద్రతా సహకారంపై ఈ సంయుక్త ప్రకటనను ఆమోదించాయి. అలాగే కింది అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చాయి:

రానున్న దశాబ్దంపై భారత్‌-జపాన్ ఉమ్మడి దృక్కోణం: ఎనిమిది లక్ష్యాలతో ప్రత్యేక వ్యూహాత్మక-ప్రపంచ భాగస్వామ్యానికి సారథ్యం

August 29th, 07:11 pm

ఇండో-పసిఫిక్ ప్రాంతంపై భార‌త్‌, జ‌పాన్‌ దేశాలది ఉమ్మ‌డి దృక్కోణం. ఈ ప్రాంతం చట్టబద్ధ పాలన సహిత స్వేచ్ఛ, సౌహార్ద‌ం, శాంతి, సౌభాగ్యాలతో ఘ‌ర్ష‌ణ ర‌హితంగా పురోగ‌మించాల‌న్న‌ది రెండు దేశాల అభిమతం. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు పరస్పర సహాయకారిగా మెలగుతాయి. వనరులు, సాంకేతికత, ఉత్పత్తి వ్యయం రీత్యా పోటీతత్వంలో రెండింటికీ ప్రత్యేక బలాలున్నాయి. దీంతోపాటు సుదీర్ఘ సుహృద్భావ, చారిత్రక స్నేహబంధం ఉన్నందువల్ల ఇకపైనా జంటగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. రాబోయే దశాబ్దంలో మన దేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మార్పులు, అవకాశాలు అందిరానున్నాయి. వీటన్నిటి సద్వినియోగం దిశగా సంయుక్త సారథ్యానికి మేం సిద్ధంగా ఉన్నామని సందర్భంగా ప్రకటిస్తున్నాం. జాతీయ లక్ష్యాల సాధనతో్పాటు మన దేశాలను, భవిష్యత్తరం పౌరులను మునుపటికన్నా చేరువ చేయడానికి మా నాయకత్వం తోడ్పడుతుంది.

15th India-Japan Annual Summit Joint Statement: Partnership for Security and Prosperity of our Next Generation

August 29th, 07:06 pm

PM Modi and Japanese PM Ishiba held the delegation-level talks during which they recalled the longstanding friendship between India and Japan. The two Prime Ministers made a series of announcements focusing on three priority areas: bolstering defense and security cooperation, reinforcing economic partnership and deepening people-to-people exchanges.

భారత్-జపాన్ మానవ వనరుల బదిలీలు, సహకారానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక

August 29th, 06:54 pm

మానవ వనరులకు సంబంధించి భారత్, జపాన్ మధ్య 5 సంవత్సరాలలో కానున్న 5,00,000 మంది పరస్పర బదిలీల్లో 50,000 మంది నైపుణ్యం కలిగిన సిబ్బంది, ప్రతిభావంతులు ఉండనున్నారు.

ప్రధాని జపాన్ పర్యటన: కుదిరిన ఒప్పందాలు, ముఖ్యాంశాలు

August 29th, 06:23 pm

ఆర్థిక భాగస్వామ్యం, ఆర్థిక భద్రత, రవాణా, పర్యావరణ సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణ, ఆరోగ్యం, ప్రజా సంబంధాలూ జాతీయ – స్థానిక ప్రభుత్వాల భాగస్వామ్యం... ఎనిమిది రంగాల్లో ఆర్థిక, క్రియాత్మక సహకారం కోసం పదేళ్ల వ్యూహాత్మక ప్రాధాన్యం.

షోరింజన్ డారుమా-జీ ఆలయ ముఖ్య పూజారి రెవ్ సేషీ హిరోసే చేతుల మీదుగా డారుమా బొమ్మను అందుకున్న ప్రధానమంత్రి

August 29th, 04:29 pm

జపాన్‌లోని గున్మాలోని టకాసాకీ సిటీలోని షోరింజన్ డారుమా-జీ ఆలయ ముఖ్య పూజారి రెవ్ సేషీ హిరోసే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి డారుమా బొమ్మను బహుమతిగా ఈ రోజు అందజేశారు. ఈ బహుమతి భారత్‌కు, జపాన్‌కు మధ్య ఉన్న సన్నిహిత నాగరికత, ఆధ్యాత్మిక బంధాలకు ప్రతీకగా ఉంది.

జపాన్ ప్రధానితో కలిసి భారత ప్రధాని సంయుక్త పత్రికా ప్రకటన

August 29th, 03:59 pm

ఈ రోజు మా చర్చ ఫలప్రదంగా, ప్రయోజనకరంగా సాగింది. రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగా, శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా.. మన భాగస్వామ్యం ఈ రెండు దేశాలకే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వానికి కూడా చాలా ముఖ్యమైనదని మేమిద్దరం అంగీకరిస్తున్నాం.

భారత్-జపాన్ ఆర్థిక ఫోరంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

August 29th, 11:20 am

ఈ ఫోరంలో చేరినందుకు ప్రధానమంత్రి ఇషిబాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన విలువైన ప్రసంగాన్ని అభినందిస్తున్నాను.

భారత్- జపాన్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న ప్రధాని

August 29th, 11:02 am

భారత పరిశ్రమల సమాఖ్య, కీడాన్రెన్ (జపాన్ వాణిజ్య సమాఖ్య) టోక్యోలో 2025 ఆగస్టు 29న నిర్వహించిన భారత్ - జపాన్ ఎకనామిక్ ఫోరంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి శ్రీ షిగేరు ఇషిబా పాల్గొన్నారు. భారత్ -జపాన్ వాణిజ్యాధినేతల ఫోరం సీఈవోలు సహా భారత్, జపాన్ నుంచి పారిశ్రామిక ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

జపాన్‌లోని టోక్యోకు చేరుకున్న ప్రధాని మోదీ

August 29th, 06:43 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం జపాన్ చేరుకున్నారు. జపాన్‌లో ప్రధాని మోదీ 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. భారతదేశం & జపాన్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యాన్ని ప్రధాని మోదీ మరియు జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా సమీక్షిస్తారు మరియు ముఖ్యమైన అంశాలను చర్చిస్తారు.

బ్రెజిల్ అధ్యక్షునితో భారత ప్రధానమంత్రి సమావేశం

May 21st, 09:49 am

హిరోషిమాలో జి7 దేశాల శిఖరాగ్ర సభ వేదిక వద్ద ఆదివారం బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ ఇనాకియో లులా డా సిల్వాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సమావేశమయ్యారు.

Prime Minister’s visit to the Hiroshima Peace Memorial Museum

May 21st, 07:58 am

Prime Minister Shri Narendra Modi joined other leaders at G-7 Summit in Hiroshima to visit the Peace Memorial Museum. Prime Minister signed the visitor’s book in the Museum. The leaders also paid floral tributes at the Cenotaph for the victims of the Atomic Bomb.

జపాన్ ప్రధానమంత్రిని కలుసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

May 20th, 08:16 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2023 మే 20 న హిరోషిమాలో జరుగుతున్న జి–7 శిఖరాగ్ర సమ్మేళనం సందర్భంగా,

హిరోషిమాలో మహాత్మాగాంధీ బస్ట్ సైజు కాంస్య విగ్రహాన్నిఆవిష్కరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ,

May 20th, 08:12 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జపాన్లోని హిరోషిమాలో 2023 మే 20 వ తేదీన మహాత్మాగాంధీ ఛాతీ సైజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

PM Modi arrives in Hiroshima, Japan

May 19th, 05:23 pm

Prime Minister Narendra Modi arrived in Hiroshima, Japan. He will attend the G7 Summit as well hold bilateral meetings with PM Kishida of Japan and other world leaders.

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే కు ప్రభుత్వ లాంఛనాల తో జరిగిన అంత్యక్రియలలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

September 27th, 04:34 pm

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే కు ప్రభుత్వ లాంఛనాల తో టోక్యో లోని నిప్పోన్ బుడోకన్ లో జరిగిన అంత్యక్రియల కార్యక్రమాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు అయ్యారు. ఇరవై కి పైగా దేశాధినేతలు / ప్రభుత్వాధినేతలు సహా వంద కు పైగా దేశాల నుండి విచ్చేసిన ప్రతినిధులు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.