ఎఫ్‌ఏఓ అగ్రికోలా పతకం అందుకున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

May 20th, 11:00 pm

ఇది కేవలం నాకు మాత్రమే దక్కిన గౌరవం కాదు. భారత్‌లోని కోట్లాది మంది రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, శ్రామికులకు దక్కిన గౌరవం. మానవ సంక్షేమం, ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి పట్ల భారత్‌కున్న అచంచలమైన నిబద్ధతకు దక్కిన గుర్తింపు ఇది. ఎంతో గౌరవంగా ఈ పతకాన్ని స్వీకరిస్తూ.. భారతదేశ అన్నదాతలకు అంకితమిస్తున్నా.

రోమ్‌లోని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) నుంచి అగ్రికోలా పతకాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి

May 20th, 10:55 pm

రోమ్‌లోని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి 2026 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక అగ్రికోలా పతకాన్ని ప్రదానం చేశారు. భారత్‌తో పాటు ప్రపంచస్థాయిలోనూ ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాల పరిష్కారానికి ఆయన ప్రదర్శించిన నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించారు.

భారత -ఇటలీ దేశాల ఉమ్మడి ప్రకటన

May 20th, 10:28 pm

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మే 19-20 తేదీల్లో ఇటలీలో అధికారిక పర్యటన చేపట్టారు. 2024 జూన్‌లో జీ7 సదస్సు సందర్భంగా ఇటలీలో ప్రధాని మోదీ పర్యటన, 2023లో జీ20 సదస్సు సందర్భంగా భారతదేశంలో ప్రధాని మెలోనీ పర్యటనల అనంతరం జరిగిన ఈ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత్-ఇటలీ సంబంధాలను 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.

ఇటలీ ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి

May 20th, 07:21 pm

అత్యున్నత స్థాయి సమావేశాలు వేగవంతం కావడాన్నీ, ద్వైపాక్షిక సహకారంలో సాధించిన వృద్ధినీ, వైవిధ్యాన్నీ ఇద్దరు ప్రధానమంత్రులు స్వాగతించారు. భారత్-ఇటలీ మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకు వెళ్లేందుకు వారు అంగీకరించారు. బహుపాక్షిక కార్యక్రమాల సందర్భంగా వార్షిక మంత్రిత్వ స్థాయి, సంస్థాగత స్థాయి సమావేశాలతో సహా నాయకుల వార్షిక సమావేశాలను కూడా నిర్వహించేందుకు వారు అంగీకరించారు.

ఇటలీ అధ్యక్షుడితో భారత ప్రధానమంత్రి భేటీ

May 20th, 07:19 pm

రోమ్‌లోని అధ్యక్ష భవనం క్విరినాలేలో ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టారెల్లాతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సమావేశమయ్యారు.

అనువాదం: ఇటలీ ప్రధాన‌మంత్రితో కలిసి నిర్వహించిన సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని ప్రసంగం

May 20th, 05:00 pm

గడిచిన దాదాపు మూడున్నర సంవత్సరాల్లో నాకు ప్రధాన మంత్రి మెలోని గారితో పలుమార్లు సమావేశమయ్యే అవకాశాలు లభించాయి. ఇది భారత్, ఇటలీ దేశాల మధ్య ఉన్న సన్నిహిత సహకారానికి, పరస్పర అవగాహనకు నిదర్శనం. ఆమె నాయకత్వంలో మన ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త వేగాన్ని, నూతన దిశను, సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని సంతరించుకున్నాయి. మన బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తూ ఈ రోజు మనం ఒక 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' ప్రకటిస్తుండటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

కీలక కార్యక్రమాల నిమిత్తం ఇటలీ చేరుకున్న ప్రధాని మోదీ

May 20th, 12:30 am

ప్రధానమంత్రి కొద్దిసేపటి క్రితమే ఇటలీలోని రోమ్‌కు చేరుకున్నారు. ఆయన ఇటలీ గణతంత్ర అధ్యక్షులు శ్రీ సెర్గియో మట్టరెల్లాను మర్యాదపూర్వకంగా కలుస్తారు; అలాగే ప్రధానమంత్రి మెలోనితో చర్చలు జరుపుతారు. ఈ చర్చలు ప్రధానంగా ‘భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్’ (IMEC) పై కేంద్రీకృతమై ఉంటాయి.