ఇథియోపియాలోని అడిస్అబాబాలో అడ్వా విజయ స్మారకం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాని

December 17th, 01:44 pm

అడిస్అబాబాలోని అడ్వా విజయ స్మారకం వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పుష్పగుచ్ఛం ఉంచి, శ్రద్ధాంజలి ఘటించారు. 1896లో జరిగిన అడ్వా యుద్ధంలో తమ దేశ సార్వభౌమత్వం కోసం ప్రాణాలర్పించిన ఇథియోపియన్ వీర సైనికుల స్మారకార్థం దీనిని నిర్మించారు. అడ్వా వీరుల చిరతర స్ఫూర్తికీ, దేశం గర్వించదగిన స్వతంత్రత, వైశిష్ట్యం, చేతనా పరంపరకు ఈ స్మారకం ప్రతీక.

ఇథియోపియా పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రధాని ప్రసంగ పాఠం

December 17th, 12:25 pm

పురాతన విజ్ఞానమూ, ఆధునిక ఆకాంక్షలూ కలిగిన ఒక దేశపు హృదయం వంటి ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో ఉండడం గౌరవంగా భావిస్తున్నాను. మీ పార్లమెంటు పట్ల, మీ ప్రజల పట్ల, మీ ప్రజాస్వామ్య ప్రస్థానం పట్ల ప్రగాఢ గౌరవంతో నేను మీ వద్దకు వచ్చాను. 140 కోట్ల భారతీయుల తరఫున స్నేహం, సద్భావన, సౌభ్రాతృత్వంతో కూడిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఇథియోపియాలో పార్లమెంటు సంయుక్త సమావేశాన్నుద్దేశించి ప్రసంగించిన భారత ప్రధాని

December 17th, 12:12 pm

భారత ప్రజల తరఫున ఇథియోపియా చట్టసభ సభ్యులకు మైత్రి, సద్భావనాపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పార్లమెంటునుద్దేశించి ప్రసంగించడం, ఇథియోపియాలోని సామాన్యులు- రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, గర్వించేలా ఎదుగుతున్న మహిళలు, దేశ భవితను తీర్చిదిద్దుతున్న యువతతో ఈ ప్రజాస్వామ్య దేవాలయం నుంచి మాట్లాడడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ ఆనర్ ఆఫ్ ఇథియోపియా నిషాన్’ను తనకు అందించిన ఇథియోపియా ప్రజలకు, ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంబంధాల ప్రాధాన్యం దృష్ట్యా.. ఇరు దేశాల మధ్య ఉన్న చిరకాల సంబంధాలు ఈ పర్యటన సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

December 17th, 09:25 am

విశిష్ట దేశమైన ఇథియోపియాలో మీ అందరి మధ్య ఇలా ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ మధ్యాహ్నమే నేను ఇథియోపియాకు చేరుకున్నాను. ఈ నేలపై అడుగుపెట్టిన క్షణం నుంచి ఇక్కడి ప్రజలతో గొప్ప ఆత్మీయత ఉన్నట్టు నాకు అనిపించింది. ప్రధానే స్వయంగా నాకు స్వాగతం పలికారు. ఫ్రెండ్షిప్ పార్క్, సైన్స్ మ్యూజియంకు నన్ను తీసుకెళ్లారు.

India and Ethiopia have shared continuous contact, dialogue and exchanges for thousands of years: PM Modi during meeting with Ethiopian PM Abiy Ahmed Ali

December 17th, 09:12 am

During his remarks at the meeting with Ethiopian PM Abiy Ahmed Ali, PM Modi announced that India–Ethiopia relations have been elevated to the level of a Strategic Partnership. The PM noted that both countries are democratic forces committed to peace and the welfare of humanity. He also expressed satisfaction over the decision to double the number of student scholarships for Ethiopia in India.

ఇథియోపియా ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు చేపట్టిన ప్రధానమంత్రి

December 17th, 12:02 am

పరిమిత, ప్రతినిధి స్థాయి విధానాల్లో జరిగిన చర్చల్లో వారు పాల్గొన్నారు. శతాబ్దాల నాటి నాగరికత పునాదులపై ఏర్పడి, ప్రజాసంబంధాలతో బలోపేతమైన ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. వీటికి ప్రాధాన్యమిస్తూ.. భారత్-ఇథియోపియా సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడానికి నాయకులిద్దరూ అంగీకరించారు. గ్లోబల్ సౌత్ భాగస్వాములుగా సమ్మిళిత ప్రపంచాన్ని నిర్మించడానికి రెండు దేశాల కృషిని కొనసాగించాలని నిర్ణయించారు. 2023లో జీ20కి అధ్యక్షత వహిస్తున్న సమయంలో ఆఫ్రికన్ యూనియన్‌కు ఈ కూటమిలో సభ్యత్వం ఇవ్వడం భారతదేశానికి దక్కిన గౌరవమని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో భారత్‌కు సంఘీభావం ప్రకటించడంతో పాటు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం సాగిస్తున్న పోరాటాన్ని బలోపేతం చేసిన ఇథియోపియాకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Prime Minister receives the highest award of Ethiopia

December 16th, 11:52 pm

During his visit to Ethiopia, PM Modi was conferred the 'Great Honor Nishan of Ethiopia', the country’s highest award, by Ethiopian PM Abiy Ahmed Ali. The honour was bestowed upon PM Modi in recognition of his contribution to strengthening the India-Ethiopia partnership and his visionary leadership as a global statesman. The PM dedicated the award to all those who have contributed to nurturing the bilateral ties between India & Ethiopia.

ఇథియోపియాలో ప్రధానమంత్రికి ప్రత్యేక స్వాగతం

December 16th, 06:21 pm

ఇథియోపియాతో తొలి ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అడ్డిస్ అబాబా చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఇథియోపియా ప్రధానమంత్రి శ్రీ డాక్టర్ అబీ అహ్మద్ అలీ నుంచి ప్రత్యేకమైన, ఆత్మీయమైన స్వాగతం లభించింది.