భారత్ – క్రొయేషియా నేతల ప్రకటన

June 19th, 06:06 pm

గౌరవ క్రొయేషియా ప్రధానమంత్రి శ్రీ ఆండ్రేజ్ ప్లెన్కోవిచ్‌ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 18న ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు. క్రొయేషియాలో భారత ప్రధానమంత్రి పర్యటించడం ఇదే మొదటిసారి. ఇరుదేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చల్లో పురోగతిని ఇది మరింత ముందుకు తీసుకెళ్తుంది.

క్రొయేషియా రిపబ్లిక్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ

June 18th, 11:58 pm

క్రొయేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ జొరాన్ మిలనోవిచ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జాగ్రెబ్‌లో సమావేశమయ్యారు.

క్రొయేషియా రిపబ్లిక్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

June 18th, 11:40 pm

క్రొయేషియా రిపబ్లిక్ ప్రధానమంత్రి శ్రీ ఆంద్రెజ్ ప్లెంకోవిచ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జాగ్రెబ్‌లో సమావేశమయ్యారు. భారతదేశ ప్రధానమంత్రి క్రొయేషియాలో అధికారికంగా పర్యటించడం ఇదే ప్రథమం. ఈ కారణంగా, భారత్-క్రొయేషియా సంబంధాల చరిత్రలో ఈ పర్యటనకు గొప్ప చారిత్రక ప్రాముఖ్యం ఏర్పడింది. చరిత్రాత్మక బేన్‌స్కీ డవోరీ మహలుకు ప్రధానమంత్రి శ్రీ మోదీ చేరుకొన్న వేళ.. క్రొయేషియా ప్రధానమంత్రి శ్రీ ప్లెంకోవిచ్‌ ఆయనకు ఆహ్వానం పలకడంతో పాటుగా సాంప్రదాయక స్వాగత ఏర్పాట్లను కూడా చేశారు. దీని కన్నా ముందు, జాగ్రెబ్ విమానాశ్రయంలో ప్రధానమంత్రి శ్రీ మోదీని ప్రధానమంత్రి శ్రీ ప్లెంకోవిచ్‌ విశేషమైన, స్నేహపూర్వక రీతిన స్వాగతించారు.

India and Croatia are connected by shared values such as democracy, rule of law, pluralism, and equality: PM Modi

June 18th, 09:56 pm

In his remarks during the joint press meet with PM Plenković of Croatia, PM Modi proposed a defence cooperation plan, highlighted collaboration in pharma, agriculture, IT, clean and digital tech, renewable energy, and semiconductors. The PM also announced the extension of the Hindi Chair MoU in Zagreb University.

క్రొయేషియాలోని జాగ్రెబ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

June 18th, 05:38 pm

ప్రధానమంత్రి మోదీ క్రొయేషియాలోని జాగ్రెబ్‌కు చేరుకున్నారు. భారత ప్రధాని ఒకరు క్రొయేషియాకు చేసిన తొలి పర్యటన ఇది. ప్రత్యేక సంజ్ఞగా, ప్రధాని మోదీని విమానాశ్రయంలో ప్రధాని ఆండ్రేజ్ ప్లెన్కోవిచ్ సాదరంగా స్వాగతించారు.