కాంగ్రెస్ ఎప్పుడూ అస్సాం ప్రయోజనాలతో రాజీ పడింది: బిశ్వనాథ్‌లో ప్రధాని మోదీ
April 01st, 11:45 am
అస్సాంలోని బిశ్వనాథ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తన ప్రసంగంలో, కాంగ్రెస్‌పై ప్రధాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ 'అభివృద్ధి వ్యతిరేక' పార్టీ అని, 'స్వతంత్ర భారతదేశంలో అవినీతికి మూలం' అని ఆరోపించారు. బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలను హైలైట్ చేస్తూ, వేలాది బీఘాల భూమిని అక్రమ ఆక్రమణల నుండి విడిపించి, అస్సాం వారసత్వాన్ని, పర్యావరణాన్ని పునరుద్ధరించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' నినాదానికి బీజేపీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ, రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగేలా చూడాలని ఆయన ఓటర్లను కోరారు.గోగాముఖ్, విశ్వనాథ్‌లలో ఉత్సాహభరితమైన ర్యాలీలతో అస్సాం ఎన్నికలకు ప్రధాని మోదీ నాంది పలికారు
April 01st, 11:00 am
రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోగాముఖ్, విశ్వనాథ్‌లలో భారీ బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల ప్రకటన తర్వాత అస్సాంలో ఆయన నిర్వహించిన తొలి ర్యాలీలు ఇవే. ఈ కార్యక్రమాలకు యువత, మహిళలు, స్థానిక వర్గాల వారు ఉత్సాహంగా పాల్గొనడంతో భారీ స్పందన లభించింది. ఇది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు బలమైన ఊపునిచ్చినట్లు సంకేతాలు ఇస్తోంది.అస్సాంలోని గోలాఘాట్ లో పాలీప్రొపిలీన్ సంస్థ శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
September 14th, 03:30 pm
భారత్ మాతా కీ జై! ప్రజాదరణ పొందిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు సర్బానంద సోనోవాల్, హర్దీప్ సింగ్ పూరి, అస్సాం ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా సోదరీసోదరులారా!అస్సాంలోని గోలాఘాట్‌లో బయోఇథనాల్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభోత్సవం, పాలీప్రొపిలీన్ కేంద్రానికి శంకుస్థాపన చేసిన ప్రధాని
September 14th, 03:00 pm
హరిత ఇంధనాన్ని ప్రోత్సహించటం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అస్సాం రాష్ట్రం గోలాఘాట్‌లోని నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్‌లో (ఎన్ఆర్ఎల్) బయోఇథనాల్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. దీనితో పాటు పాలీప్రొపిలీన్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. షరోదియ దుర్గా పూజను పురస్కరించుకొని అస్సాం ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మిక గురువు శ్రీమంత శంకరదేవ్ జయంతి చాలా గొప్పదన్న ఆయన.. పూజ్యులైన గురువులందరికీ నమస్కరిస్తున్నట్లు తెలియజేశారు.