న్యూఢిల్లీలో డబ్ల్యూహెచ్‌వో రెండో అంతర్జాతీయ సంప్రదాయ వైద్య సదస్సులో ప్రధాని ప్రసంగం

December 19th, 08:11 pm

డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్, మన తులసీ భాయ్ డాక్టర్ టెడ్రోస్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, నా మంత్రివర్గ సహచరుడు జె.పి. నడ్డా, ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్, ఈ కార్యక్రమంతో సంబంధమున్న ఇతర దేశాల మంత్రులు, వివిధ దేశాల రాయబారులు, గౌరవ ప్రతినిధులు, సాంప్రదాయ వైద్య రంగంలో కృషి చేస్తున్న గౌరవ నిపుణులు, సోదరీ సోదరులారా..!

‘సంప్రదాయ వైద్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండో సదస్సు’ ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని

December 19th, 07:07 pm

ఈ రోజు ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ‘సంప్రదాయ వైద్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండో సదస్సు’ ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత మూడు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంప్రదాయ వైద్య రంగ నిపుణులు లోతైన అర్థవంతమైన చర్చల్లో నిమగ్నమయ్యారని ప్రధాని అన్నారు. ఈ విషయంలో భారత్ ఒక బలమైన వేదికగా నిలుస్తున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో డబ్ల్యూహెచ్ఓ చురుకైన పాత్ర పోషిస్తోందన్న ఆయన.. సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు డబ్ల్యూహెచ్ఓ, భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ, హాజరైన ప్రతినిధులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంప్రదాయ వైద్యంపై డబ్ల్యూ‌హెచ్‌వో రెండో అంతర్జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధాని

December 18th, 04:21 pm

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2025 డిసెంబర్ 19 సాయంత్రం 4:30కు సంప్రదాయ వైద్యంపై డబ్ల్యూ‌హెచ్‌వో నిర్వహిస్తున్న రెండో అంతర్జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. అంతర్జాతీయ, శాస్త్రీయ ఆధారిత, ప్రజా కేంద్రక సంప్రదాయ వైద్య అజెండాను రూపొందించడంలో పెరుగుతున్న భారత్ నాయకత్వ స్థాయిని, చేపడుతున్న మార్గదర్శక పథకాలను ఈ కార్యక్రమం వివరిస్తుంది.

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో పాల్గొనే విద్యార్థులతో డిసెంబర్ 11న ప్రధానమంత్రి మాటామంతీ

December 09th, 07:38 pm

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో భాగంగా గ్రాండ్ ఫినాలేని 2024 డిసెంబర్ 11న నిర్వహించనున్నారు. ఆ పోటీలో పాల్గొంటున్న యువ నూతన ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయంత్రం సుమారు 4:30 గంటలకు దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు. గ్రాండ్ ఫినాలేలో 1300 మందికి పైగా విద్యార్థి బృందాలు పాలుపంచుకోనున్నాయి. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.

డబ్ల్యుహెచ్ఒ యొక్క డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రెయెసస్ కు భారతదేశం లో స్వాగతం పలికిన ప్రధాన మంత్రి

August 16th, 02:39 pm

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) యొక్క డైరక్టర్ జనరల్ డాక్టర్ శ్రీ టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రెయెసస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశాని కి ఆహ్వానించారు. డాక్టర్ శ్రీ టెడ్రోస్ ఇదివరకు భారతదేశాన్ని సందర్శించిన సందర్భం లో శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు ‘తులసి భాయి’ అనే పేరు ను పెట్టారు.