ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద జనవరి 20న ఉత్తరప్రదేశ్‌లో 6 లక్షల మంది లబ్ధిదారులకు ఆర్ధిక —-సహాయాన్ని విడుదల చేయనున్న ప్రధానమంత్రి
January 19th, 04:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్‌లోని 6.1 లక్షల మంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (పిఎంఎవై-జి) కింద జనవరి 20,2021 మధ్యాహ్నం 12 గంటలకు ఆర్ధిక సహాయాన్ని వీడియో కాన్ఫరెన్సు ద్వారా విడుదల చేయనున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.సెప్టెంబర్ 12వ తేదీన, ” గృహ ప్రవేశం” కార్యక్రమంలో పాల్గొని, పి.ఎం.ఎ.వై-జి. కింద మధ్యప్రదేశ్ లో నిర్మించిన 1.75 లక్షల ఇళ్ళను ప్రారంభించనున్న – ప్రధానమంత్రి.
September 10th, 06:10 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, సెప్టెంబర్ 12వ తేదీన, గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ్ (పి.ఎం.ఎ.వై-జి) కింద మధ్యప్రదేశ్ లో నిర్మించిన 1.75 లక్షల ఇళ్ళను వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించనున్నారు. ఈ ఇళ్ళన్నింటినీ ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి కష్ట కాలంలోనే నిర్మాణం చేపట్టి పూర్తిచేయడం జరిగింది.