ఆసియా కప్-2025లో భారత పురుషుల హాకీ జట్టు అసాధారణ విజయం.. ప్రధానమంత్రి అభినందనలు
September 08th, 07:20 am
బీహార్‌లోని రాజ్‌గీర్‌లో నిర్వహించిన ఆసియా కప్-2025లో అద్భుత గెలుపును సొంతం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ‘‘గతంలో విజేతలైన దక్షిణ కొరియా జట్టుపై ఆధిపత్యాన్ని సాధించిన కారణంగా ఈ విజయం మరింత ప్రత్యేకమైంద’’ని శ్రీ మోదీ అభివర్ణించారు.బీహార్లోని రాజ్‌గిర్‌లో జాతీయ క్రీడా దినోత్సవం నాడు పురుషుల హాకీ ఆసియా కప్ 2025 మొదలవుతున్న సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు
August 28th, 09:33 pm
బీహార్లోని చారిత్రక నగరం రాజ్‌గిర్‌లో జాతీయ క్రీడా దినోత్సమైన ఆగస్టు 29న ప్రారంభమయ్యే పురుషుల హకీ ఆసియా కప్ 2025లో ఆసియా వ్యాప్తంగా పాల్గొనే జట్లు, క్రీడాకారులు, అధికారులు, వారి అభిమానులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025, ఆసియా రగ్బీ యూ20 సెవెన్స్ ఛాంపియన్‌షిప్ 2025, ఐఎస్‌టీఏఎఫ్ సెపక్‌తక్రా ప్రపంచ కప్ 2024, మహిళ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోపీ 2024 లాంటి కీలకమైన టోర్నమెంట్లను నిర్వహించడం ద్వారా ఇటీవలి కాలంలో శక్తిమంతమైన క్రీడాకేంద్రంగా తనదైన ముద్ర వేసిన బీహార్‌ను అమిభనందించారు.