పార్లమెంట్ బడ్జెటు సమావేశాలు మొదలైన సందర్భంగా ప్రధానమంత్రి వాఖ్యలు

January 29th, 10:15 am

నిన్న, గౌరవ రాష్ట్రపతి ప్రసంగం 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పడమే కాకుండా, 140 కోట్ల మంది దేశ ప్రజల ఉమ్మడి కృషితో పాటు ఆకాంక్షలకు.. మరీ ముఖ్యంగా యువత ఆకాంక్షలకు నిర్దిష్ట వ్యాఖ్యానంగా ఉన్నది. ఆ ప్రసంగం చట్టసభల సభ్యులందరికీ మార్గదర్శకం కాగల అనేక ఆలోచనల్ని కూడా ఆవిష్కరించింది. సమావేశాల ఆరంభంలో, అదీనూ 2026 సంవత్సరం మొదలయ్యీ మొదలవక ముందే, గౌరవ రాష్ట్రపతి గారు సభలో పేర్కొన్న విషయాలు చాలా సరళ భాషలో దేశాధినేతగా చెప్పిన మాటలు. ఈ మాటలను పట్టి చూస్తే పార్లమెంటు గౌరవ సభ్యులంతా ఈ మాటల్ని గంభీరంగా లెక్క లోకి తీసుకుని ఉంటారని నేను నమ్ముతున్నాను. నిజానికి, ఈ సమావేశాలు ఎంతో కీలకం. బడ్జెట్ సమావేశాలివి.

పార్లమెంటు 2026 బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో విలేకరులను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

January 29th, 10:00 am

పార్లమెంటు 2026 బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విలేకరులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం 140 కోట్ల మంది పౌరుల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రజల కఠోర శ్రమను, యువతరం ఆకాంక్షలను ప్రస్ఫుటం చేసిందని వ్యాఖ్యానించారు. సమావేశాల ప్రారంభానికి ఎంతో ముందుగానే... 2026 ఆరంభ సమయాన అనేక మార్గదర్శకాంశాలను రాష్ట్రపతి పార్లమెంటు సభ్యులందరి ముందుంచారని ఆయన గుర్తుచేశారు. దేశాధినేతగా రాష్ట్రపతి సరళ ప్రసంగంలో వెలిబుచ్చిన ఆకాంక్షలను ఎంపీలందరూ తప్పక పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఈ సమావేశాలు కీలకమైనవి కాగలవని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇది బడ్జెట్ సమావేశం కావడంతోపాటు 21వ శతాబ్దపు తొలి త్రైమాసికం ముగింపు సహా రెండో త్రైమాసికం ఆరంభాన్ని సూచిస్తుందని ఆయన చెప్పారు. దేశం 2047 నాటికి వికసిత భారత్‌ సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో రాబోయే 25 ఏళ్లు ఎంతో కీలకమన్నారు. ఈ బడ్జెట్ ప్రస్తుత శతాబ్దపు రెండో త్రైమాసికంలో మొదటిదని పేర్కొన్నారు. దేశ తొలి మహిళా ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం మన పార్లమెంటరీ చరిత్రలోనే గర్వకారణ క్షణమని ప్రధానమంత్రి అభివర్ణించారు.

పార్లమెంటులో భారత సాంస్కృతిక-భాషా వైవిధ్యాన్ని చాటిన ప్రతి ఒక్కరికీ ప్రధానమంత్రి అభినందన

December 23rd, 06:19 pm

పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ ప్రసంగాల్లో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం లభించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. చట్టసభ వేదికగా భారత సాంస్కృతిక-భాషా వైవిధ్యాన్ని చాటినందుకు స్పీకర్‌ శ్రీ ఓం బిర్లా సహా అన్ని పార్టీల ఎంపీలను ఆయన అభినందించారు.

న్యూఢిల్లీలో పార్లమెంటు సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన ఫ్లాట్ల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

August 11th, 11:00 am

శ్రీ ఓం బిర్లా గారూ, మనోహర్ లాల్ గారూ, కిరణ్ రిజిజు గారూ, మహేశ్ శర్మ గారూ, గౌరవ పార్లమెంటు సభ్యులూ, లోక్‌సభ ప్రధాన కార్యదర్శి గారూ, సోదరీ సోదరులారా!

పార్లమెంటు సభ్యుల కోసం న్యూఢిల్లీలో నూతనంగా నిర్మించిన నివాస సముదాయాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 11th, 10:30 am

పార్లమెంట్ సభ్యుల కోసం న్యూఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్‌లో టైప్-7 బహుళ అంతస్థుల్లో కొత్తగా నిర్మించిన 184 ఫ్లాట్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ఇటీవలే కర్తవ్య భవన్‌గా పిలిచే కామన్ సెంట్రల్ సెక్రటేరియట్‌ను కర్తవ్య పథ్‌లో ప్రారంభించానని, అలాగే పార్లమెంట్ సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను ప్రారంభించే అవకాశం తనకు లభించిందని అన్నారు. కాంప్లెక్సులోని నాలుగు టవర్లకు నాలుగు విశిష్ట నదులు - కృష్ణా, గోదావరి, కోసి, హుగ్లీ పేర్లు పెట్టినట్లు తెలిపారు. లక్షలాది మందికి జీవితాన్నిచ్చే ఈ నదులు, ఇప్పుడు ప్రజా ప్రతినిధుల జీవితాల్లోకి కొత్త ఆనందాల ప్రవాహానికి స్ఫూర్తిని ఇస్తాయని తెలిపారు. నదుల పేర్లు పెట్టే ఈ సంస్కృతి ఏకత్వమనే దారంతో దేశాన్ని కలిపి ఉంచుతుందని పేర్కొన్నారు. ఢిల్లీలో పార్లమెంటు సభ్యుల జీవన సౌలభ్యాన్ని ఈ కొత్త కాంప్లెక్స్ పెంచుతుందని, అలాగే ఎంపీలకు ఢిల్లీలో ప్రభుత్వం నివాసాలను పొందడం ఇప్పుడు సులభతరం అవుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫ్లాట్ల నిర్మాణంలో పాలు పంచుకున్న ఇంజినీర్లు, శ్రామికులను ప్రశంసించారు. వీటిని పూర్తి చేయడంలో వారు కనబరిచిన అంకితభావాన్ని, చేసిన కృషిని మెచ్చుకున్నారు.

ఢిల్లీలో పార్లమెంటు సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన ఫ్లాట్‌లను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

August 10th, 10:44 am

ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్‌లో పార్లమెంటు సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన 184 టైప్–VII బహుళ అంతస్తుల ఫ్లాట్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 11న ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు.

Prime Minister watches ‘The Sabarmati Report’ movie

December 02nd, 08:09 pm

The Prime Minister, Shri Narendra Modi today watched ‘The Sabarmati Report’ movie along with NDA Members of Parliament today.

పార్లమెంట్ పూర్వ సభ్యుడు శ్రీ ప్రభాత్ ఝా మృతికి ప్రధాన మంత్రి సంతాపం

July 26th, 01:05 pm

పార్లమెంట్ పూర్వ సభ్యుడు శ్రీ ప్రభాత్ ఝా మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ఎంపిశ్రీ డి. శ్రీనివాస్ గారి మృతి కి సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

June 29th, 08:44 pm

పార్లమెంట్ ఉభయ సభల లో ఒకటైన రాజ్య సభ పూర్వ సభ్యుడు (ఎంపి) శ్రీ డి. శ్రీనివాస్ ఈ రోజు న మరణించిన సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

పూర్వ ప్రధాని శ్రీ పి.వి. నరసింహా రావు కు భారత్రత్న పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి

February 09th, 01:30 pm

ప్రధాని గా శ్రీ పి.వి. నరసింహా రావు పదవీ కాలం లో ముఖ్యమైన నిర్ణయాలు వెలువడ్డాయి. అవి భారతదేశం యొక్క తలుపుల ను ప్రపంచ బజారుల కు తెరచాయి; ఇది ఆర్థికాభివృద్ధి లో ఒక నూతన శకాన్ని ప్రోత్సహించింది అని ఆయన అన్నారు.

Rajya Sabha is a diverse university of six years, shaped by experiences: PM Modi

February 08th, 12:20 pm

PM Modi bid farewell to the retiring members of the Rajya Sabha. He said that the Members leaving for another public platform will hugely benefit from the experience in Rajya Sabha. “This is a perse university of six years, shaped by experiences. Anyone who goes out from here goes enriched and strengthens the work of nation-building, he said.

రాజ్య సభ లో రిటైర్ అవుతున్న సభ్యుల కు వీడుకోలు పలికిన ప్రధాన మంత్రి

February 08th, 12:16 pm

రాజ్య సభ లో పదవీ కాల పరిమితి ముగుస్తున్న సభ్యుల కు ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడుకోలు పలికారు.

‘నమో యాప్’లో స్థానిక ఎంపీతో సంధానానికి ప్రత్యేక విభాగం: ప్రధానమంత్రి

October 16th, 09:50 pm

ప్రజలు స్థానిక పార్లమెంటు సభ్యులతో సంధానం కాగల ప్రత్యేక విభాగం ‘నమో’ (NaMo) అనువర్తనంలో ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత ముందుకు నడిపించడంలో ఈ విభాగం ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు తమ ఎంపీతో సంధానం కావడానికి, స్థానికంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇది మార్గం సుగమం చేస్తుందని ప్రధాని వివరించారు.

రాజ్యాంగ (నూట ఇరవై ఎనిమిదో సవరణ) బిల్లు, 2023 కు లోక్ సభ లో ఆమోదం లభించడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

September 20th, 09:36 pm

రాజ్యాంగ (నూట ఇరవై ఎనిమిదో సవరణ) బిల్లు, 2023 కు లోక్ సభ ఈ రోజు న ఆమోదం లభించడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు.

నాగాలాండ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి మహిళ శ్రీమతి ఎస్.ఫాంగ్నోన్ కొన్యాక్ సభాధ్యక్షత వహించడంపై ప్రధాని హర్షం

July 25th, 08:16 pm

నాగాలాండ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి మహిళ శ్రీమతి ఎస్‌. ఫాంగ్నాన్ కొన్యాక్‌ను గత వారం రాజ్యసభ అధిపతి జగదీప్ ధంకడ్‌ ఉపాధ్యక్షుల బృందంలో సభ్యురాలుగా నియమించారు. అనంతరం ఈ హోదాలో ఆమె సభకు అధ్యక్షత వహించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం ప్రకటించారు.

అనుసంధానంతోనే దేశ సౌభాగ్యం.. మా ప్రాథమ్యాల్లో దానికే అగ్రాసనం: ప్రధానమంత్రి

February 25th, 09:46 am

ఉత్తరప్రదేశ్‌లోని ఖజనీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బేల్‌ఘాట్‌ - సిక్రిగంజ్‌ మధ్య 8 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు పూర్తికావడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్కడి ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ పనులు పూర్తయినట్లు సంత్‌కబీర్‌ నగర్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ శ్రీ ప్రవీణ్‌ నిషాద్‌ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ- భారతదేశ సౌభాగ్యం అనుసంధానంతోనే ముడిపడి ఉందని, తమ ప్రభుత్వ ప్రాథమ్యాలలో దీనికి పెద్దపీట వేశామని శ్రీ మోదీ పేర్కొన్నారు.

సంసద్ రత్న అవార్డులు- 2023 తో సమ్మానితులు కానున్న తన తోటి ఎంపి లకు అభినందనల నుతెలియ జేసిన ప్రధాన మంత్రి

February 22nd, 12:47 pm

సంసద్ రత్న అవార్డులు- 2023 తో సన్మానితులు కానున్న తన తోటి ఎంపి లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

ఉత్తరప్రదేశ్ లోని బస్తీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2వ సన్సద్ ఖేల్ మహాకుంభ్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

January 18th, 04:39 pm

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, పార్లమెంటులో నా సహచరుడు నా యువ మిత్రుడు భాయ్ హరీష్ ద్వివేది గారు, వివిధ క్రీడలకు సంబంధించిన క్రీడాకారులు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఇతర సీనియర్ ప్రముఖులు మరియు నా చుట్టూ యువకులు ఉండడం నేను చూస్తున్నాను. నా ప్రియమైన సోదర సోదరీమణులారా.

బస్తీ జిల్లా లో సాంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23 రెండో దశ ను వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యంద్వారా ప్రారంభించిన ప్రధాన మంత్రి

January 18th, 01:00 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23 లో భాగం అయిన రెండో దశ ను ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు. సాంసద్ ఖేల్ మహాకుంభ్ ను బస్తీ జిల్లా లో పార్లమెంట్ సభ్యుడు శ్రీ హరీశ్ ద్వివేదీ 2021 వ సంవత్సరం నుండి ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. కుస్తీ, కబడ్డీ, ఖో ఖో, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్ బాల్, చదరంగం, కేరమ్స్, బాడ్ మింటన్, టెబుల్ టెనిస్ మొదలైన ఇండోర్ మరియు అవుట్ డోర్ స్పోర్ట్ స్ లో వివిధ పోటీల ను ఖేల్ మహాకుంభ్ లో భాగం గా నిర్వహిస్తుంటారు. ఇవి గాక విడి గా, వ్యాస రచన, చిత్రలేఖనం, రంగవల్లుల ను తీర్చిదిద్దడం వంటి వాటి లో పోటీల ను కూడా ఖేల్ మహాకుంభ్ లో భాగం గా ఏర్పాటు చేయడం జరుగుతున్నది.

పార్లమెంట్ శీతకాల సమావేశాలు ఆరంభంకావడాని కంటే ముందు ప్రధాన మంత్రి ప్రసంగం

December 07th, 10:00 am

ఈ రోజు న (పార్లమెంట్) శీతకాల సమావేశాల లో ఒకటో రోజు. ఈ సమావేశాలు ముఖ్యమైనవి; దీనికి కారణం మనం ఇంతకు పూర్వం ఆగస్టు 15వ తేదీ నాడు కలుసుకొన్నాం. ఆగస్టు 15వ తేదీ నాడు స్వాతంత్య్రం తాలూకు 75 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. మరి ఇప్పుడు మనం ‘అమృత కాలం’ తాలూకు ప్రయాణాన్ని మొదలుపెట్టి ముందుకు సాగిపోతున్నాం. జి20 కి అధ్యక్షత వహించే అవకాశం భారతదేశాని కి లభించినటువంటి కాలం లో, ఈ రోజు న మనం భేటీ అయ్యాం. ప్రపంచ సముదాయం లో భారతదేశం తనకంటూ ఒక జాగా ను సంపాదించుకొన్న తీరు, భారతదేశం పట్ల ఆశ లు ఏ విధం గా అయితే పెరిగిపోయాయో మరి అలాగే ప్రపంచ వేదికల లో భారతదేశం తన భాగస్వామ్యాన్ని ఏ విధం గా పెంపు చేసుకొంటోందో.. అటువంటి కాలం లో జి20 అధ్యక్షత ను స్వీకరించే అవకాశం దక్కడం అనేది ఒక భారీ అవకాశం అని చెప్పాలి.