నారీశక్తి వందన్ అధినియం సవరణకు అనుకూలంగా ఓటు వేయాలని ఎంపీలను కోరిన ప్రధాని.. ఇదొక చరిత్రాత్మక అవకాశమన్న శ్రీ మోదీ
April 17th, 02:13 pm
నారీశక్తి వందన్ అధినియం సవరణపై ప్రస్తుతం పార్లమెంటులో చర్చ జరుగుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ అంశంపై నిన్న రాత్రి ఒంటి గంట వరకు సుదీర్ఘంగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని ఆయన తెలిపారు.రాజ్యసభలో ప్రధాని ప్రసంగం
April 17th, 11:10 am
సభ తరఫునా, నా తరఫునా శ్రీ హరివంశ్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా వరుసగా మూడోసారి ఎన్నికవడమే సభకు మీపై ఉన్న ప్రగాఢమైన విశ్వాసానికి నిదర్శనం. నిజానికి మీ అనుభవం ద్వారా గతంలో పొందిన ప్రయోజనాలకూ, అందరినీ కలుపుకొనిపోయిన మీ కృషికీ సభ ఈ విధంగా ఆమోదముద్ర వేసింది. అనుభవానికి, సహజమైన పనితీరుకు దక్కిన గౌరవమిది. ఆ సహజమైన పనిశైలికి ఇది ఆమోదం కూడా. హరివంశ్ గారి నేతృత్వంలో ఎంత ప్రభావవంతంగా సభ బలోపేతమైందో మనమంతా చూశాం. ఆయన సభ కార్యకలాపాలను నిర్వహించడమే కాదు.. తన జీవితానుభవాన్ని నిశితంగా ఉపయోగిస్తూ సభ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. సభా వ్యవహారాలన్నింటా, నిర్వహణలో, సభ వాతావరణంలో పరిణతిని పెంచడంలో ఆయన అనుభవం ఎంతగానో తోడ్పడింది. డిప్యూటీ చైర్మన్ ఈ కొత్త పదవీకాలం కూడా అదే స్ఫూర్తితో, సమతౌల్యంతో, నిబద్ధతతో సాగుతుందన్న దృఢమైన విశ్వాసం నాకుంది. మనందరి కృషితో సభ గౌరవం మరింత ఇనుమడిస్తుందని ఆశిస్తున్నాను.రాజ్యసభను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
April 17th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాజ్యసభను ఉద్దేశించి ప్రసంగించారు. వరుసగా మూడోసారి రాజ్యసభకు డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించిన శ్రీ హరివంశ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. దీనిని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఇది శ్రీ హరివంశ్‌పై సభకున్న విశ్వాసాన్ని, ఈ సభకు ఆయన తీసుకొచ్చిన విలువైన అనుభవాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ‘‘వరుసగా మూడోసారి ఎన్నిక కావడం.. ఆయన అనుభవానికి, సమ్మిళిత దృక్పథానికి, ఆయన పనితీరుకు సభ వేసిన ఆమోద ముద్ర’’ అని శ్రీ మోదీ తెలిపారు.Prime Minister Condoles the Demise of Former MP and Union Minister Shri Kabindra Purkayastha Ji
January 07th, 07:07 pm
Prime Minister Shri Narendra Modi today expressed deep sorrow at the passing of former Member of Parliament and Union Minister Shri Kabindra Purkayastha Ji.శాంతి బిల్లుకు పార్లమెంటు ఆమోదం.. ప్రధానమంత్రి హర్షం
December 18th, 09:47 pm
శాంతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత్ సాంకేతిక విజ్ఞాన రంగ రూపురేఖలను మార్చివేసే సందర్భమిది అని ఆయన వ్యాఖ్యానించారు.శ్రీ మహేంద్ర సింహ్ మేవాడ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం
November 10th, 10:38 pm
చిత్తోడ్ ఘఢ్ పూర్వ ఎంపీ శ్రీ మహేంద్ర సింహ్ మేవాడ్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.