ఓ క్రీడా కార్యక్రమంలో పాల్గొనడానికి మెల్‌బోర్న్ క్రికెట్ మైదానానికి వెళ్లిన ప్రధానమంత్రి
July 10th, 08:21 am
ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథోనీ అల్బానీజ్, విక్టోరియా ప్రీమియర్ జెసిండా ఎలన్‌తో పాటు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మెల్‌బోర్న్ క్రికెట్ మైదానానికి వెళ్లారు. భారత్, ఆస్ట్రేలియా క్రీడా సంబంధాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఓ కార్యక్రమంలో భాగంగా ఈ సందర్శనను ఏర్పాటు చేశారు. శ్రీ స్టీవ్ వా, లిసా స్థలేకర్ సహా ఆస్ట్రేలియాకు చెందిన మేటి క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రీడలు, సాంస్కృతిక మార్పిడులు, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు నానాటికీ భారత్, ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి మూలాధారాలుగా మారుతున్నాయని ఇది నిరూపించింది.ఆస్ట్రేలియాలో భారతీయ ప్రవాసుల సమావేశంలో ప్రధాని ప్రసంగం
July 09th, 03:22 pm
మనం సమావేశమైన ఈ నేల పరంపరానుగత యజమానులకు గౌరవాభివాదాలతో నేను ప్రసంగాన్ని మొదలుపెడుతున్నాను. వారి పూర్వీకులకూ, పెద్దలకూ వినమ్రపూర్వక అభివాదాలు తెలియజేస్తున్నాను. నవతరానికి శుభాకాంక్షలు.ఆస్ట్రేలియాలోని భారతీయులతో సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
July 09th, 03:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మెల్బోర్న్‌లోని మార్వెల్ స్టేడియంలో ఆస్ట్రేలియాలోగల భారతీయులతో నిర్వహించిన భారీ సభలో వారినుద్దేశించి ప్రసంగించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గౌరవనీయ ఆంథోనీ అల్బనీస్ కూడా గౌరవపూర్వకంగా ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్‌తో ప్రధానమంత్రి భేటీ
July 09th, 01:55 pm
మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ శ్రీమతి సామ్ మోస్టిన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సమావేశమయ్యారు.భారత్-ఆస్ట్రేలియా మూడో వార్షిక సదస్సులో ఆస్ట్రేలియా ప్రధానితో ప్రధానమంత్రి భేటీ
July 09th, 12:29 pm
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా ప్రధాని గౌరవ ఆంథోనీ అల్బనీస్ ఎంపీ ఆతిథ్యంలో జరుగుతున్న 3వ భారత్-ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గవర్నమెంట్ హౌస్‌కు చేరుకున్న ప్రధానమంత్రి శ్రీ మోదీని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ సాదరంగా స్వాగతించారు.ఆస్ట్రేలియా-భారత్ ప్రధానమంత్రుల సంయుక్త విలేకరుల సమావేశంలో శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 09th, 11:15 am
అంతర్జాతీయ దృక్పథం, ప్రగాఢ పరస్పర విశ్వాసంతో రెండు దేశాలూ సంయుక్తంగా ముందడుగు వేయడంలో ఈ ఉమ్మడి విశిష్టతలే మనకెంతో స్ఫూర్తినిస్తాయి. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కొన్నేళ్లుగా అద్భుత ప్రగతి సాధించిన నేపథ్యంలో నేటి మూడో వార్షిక శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల మధ్య సహకార పరిధిని మరింత విస్తృతం చేసింది.Australia-India Partnership on Cyber, Critical Technologies and Supply Chains (PACTS)
July 09th, 11:04 am
PM Modi and Australian Prime Minister Anthony Albanese launched the Australia-India Partnership on Cyber, Critical Technologies and Supply Chains (PACTS), paving the way for closer cooperation in cybersecurity, critical technologies, resilient supply chains, digital resilience and defence research collaborationIndia-Australia Joint Statement on Energy Security
July 09th, 11:02 am
The India-Australia Joint Statement on Energy Security noted the two countries' deep concern over the situation in the Middle East. They shared their commitment to working together to strengthen energy supply chain resilience, including by deepening regional cooperation, accelerating the energy transition, promoting the uptake of renewable energy resources and upholding open trade arrangements for energy and liquid fuels.Third India-Australia Annual Summit Joint Statement
July 09th, 10:58 am
At the invitation of Australian PM Anthony Albanese, PM Modi visited Australia from 8-10 July 2026 for the Third Australia-India Annual Summit in Melbourne. The two leaders reaffirmed their shared commitment to further consolidate and expand the India-Australia Comprehensive Strategic Partnership (CSP) and explore new areas of cooperation for the peace, prosperity and stability of the shared region.ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌కు ఘన స్వాగతం అందుకున్న ప్రధాని మోదీ
July 08th, 08:42 pm
ఇండోనేషియాలో ఫలవంతమైన పర్యటనను ముగించుకున్న అనంతరం, ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌కు చేరుకున్నారు. ఈ పర్యటన భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఈ పర్యటన సందర్భంగా, ఆయన ప్రధానమంత్రి అల్బనీస్‌తో చర్చలు జరిపి, ప్రవాస భారతీయులతో మమేకమవుతారు.ఇండొనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటనకు ముందు ప్రధానమంత్రి ప్రకటన
July 06th, 09:00 am
ఇండొనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రబొవొ సుబియాంతొ ఆహ్వానించడంతో, నేను ఈ నెల 6 నుంచి 8 వరకూ ఇండొనేషియాలో పర్యటిస్తాను. 2018లో నేను మొదటిసారి ఇండొనేషియా పర్యటనకు వెళ్లినప్పుడు భారత్, ఇండొనేషియా తమ ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపొందింపచేసుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల స్థాయి పెరిగిన తరువాత ఇదే నేను చేపట్టబోయే మొదటి ద్వైపాక్షిక పర్యటన. అధ్యక్షుడు శ్రీ ప్రబొవొ అధికార పర్యటన అనంతరం నా ఈ పర్యటన చోటుచేసుకోనుంది. అప్పట్లో అంటే.. 2025 జనవరి 26న ఆయన మన గణతంత్ర దినోత్సానికి ముఖ్య అతిథిగా వచ్చారు. భారత్, ఇండొనేషియా మధ్య బలమైన నాగరికత సంబంధమైన ప్రజా సంబంధాలు నెలకొన్నాయి. నా ఈ పర్యటన మన బహుముఖీన భాగస్వామ్యానికి చెందిన అన్ని అంశాలనూ మరింత దృఢతరంగా మారుస్తుంది. నా పర్యటన కాలంలో, నేను ఇండొనేషియాలో నివసిస్తున్న ప్రవాసీ భారతీయులతోనూ సమావేశమవుతాను. అధ్యక్షుడు శ్రీ ప్రబొవొతో కలిసి యోగ్యకర్తలోని ప్రంబానన్ దేవాలయ పరిసరాలను సందర్శిస్తాను. ఆ దేవాలయం మన సన్నిహిత సాంస్కృతిక సంబంధాలకు మరొక అద్భుత నిదర్శనంగా నిలుస్తుంది.ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రధానమంత్రి పర్యటన
July 03rd, 08:42 pm
ఇండోనేషియా అధ్యక్షులు శ్రీ ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జూలై 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. మే 2018లో భారత్-ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగిన తర్వాత, ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటించడం ఇది నాలుగోసారి కాగా... ఇది ఆయన తొలి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన సందర్భంగా, ఇండేనేషియా అధ్యక్షులు శ్రీ ప్రబోవోతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఇరు దేశాల భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షిస్తారు. జకార్తాలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసే భారీ సభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. భారత్, ఇండోనేషియా దేశాల ప్రజల మధ్య చరిత్రాత్మక, ఆత్మీయ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక సంబంధాలకు అనుగుణంగా... ఇండోనేషియాలోని ప్రముఖ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన యోగ్యకార్తాలోని ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు.ప్రపంచ ఎంతో ఉత్సాహంతో నాలుగవ యోగా అంతర్జాతీయ దినోత్సవంలో పాల్గొన్న ప్రపంచం
June 21st, 03:04 pm
నాల్గవ యోగ అంతర్జాతీయ దినోత్సవంలో ప్రపంచం మొత్తం అపారమైన ఉత్సాహంతో పాలుపంచుకుంది. యోగా శిక్షణా శిబిరాలు, సెషన్లు మరియు సెమినార్లు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జరిగాయి, యోగను మరింత చేరువ చేయడానికిమరియు యోగను దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటే వచ్చే ప్రయోజనాల గురించి ప్రజలను అవగాహన చేసుకోండి.