జూన్ 15 నుండి 19 వరకు సైప్రస్ రిపబ్లిక్, కెనడా మరియు క్రొయేషియాలో పర్యటించనున్న ప్రధాని మోదీ

June 14th, 11:58 am

ప్రధాని మోదీ జూన్ 15-16 తేదీలలో సైప్రస్‌లో, జూన్ 16-17 తేదీలలో జీ-7 శిఖరాగ్ర సమావేశానికి కెనడాకు మరియు జూన్ 18న క్రొయేషియాకు వెళతారు. ప్రధాని మోదీ సైప్రస్ అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్‌తో చర్చలు జరుపుతారు మరియు లిమాసోల్‌లో వ్యాపార నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తరువాత కెనడాలో, జీ7 శిఖరాగ్ర సమావేశంలో, ప్రధాని మోదీ జీ-7 దేశాల నాయకులతో అభిప్రాయాలను మార్పిడి చేసుకుంటారు. క్రొయేషియాలో, ప్రధాని మోదీ పీఎం ప్లెన్కోవిక్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు మరియు క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిక్‌తో సమావేశమవుతారు.

గ్రీస్ ప్రధాన మంత్రి భారత పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన పత్రికా ప్రకటన తెలుగు అనువాదం (ఫిబ్రవరి 21, 2024)

February 21st, 01:30 pm

ప్రధాన మంత్రి మిత్సోటకిస్ కు , ఆయన ప్రతినిధి బృందానికి భారత్ కు స్వాగతం పలకడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. గత ఏడాది గ్రీస్ లో నేను జరిపిన పర్యటన తరువాత ఆయన భారత పర్యటన కు రావడం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడటానికి సంకేతం. ఇంత సుదీర్ఘ విరామం తర్వాత, పదహారేళ్ల తర్వాత గ్రీస్ ప్రధాని భారత్ కు రావడం చారిత్రాత్మక ఘట్టం.