ఒప్పందాల జాబితా: ఇండోనేషియాలో ప్రధానమంత్రి పర్యటన
July 07th, 01:03 pm
శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష అన్వేషణ, వినియోగంలో సహకారంపై విధానపరమైన ఒప్పందం పొడిగింపువైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
July 01st, 12:22 pm
ఇవాళ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. దేశానికి వారు చేస్తున్న సేవలు, చూపుతున్న కరుణ, నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు.ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 18th, 11:41 pm
కాంతులు, రంగులతో కూడిన నగరం పారిస్. ఇది కళలకు, సరికొత్త ఆలోచనలకు, నూతన ఆవిష్కరణలకు స్ఫూర్తి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన మీరంతా ఈ నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. మీరే దీనికి సరికొత్త, చైతన్యవంతమైన రంగులను అద్దుతున్నారు.ప్యారిస్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
June 18th, 09:30 pm
ఫ్రాన్స్‌లోని వివిధ రంగాల్లో భారతీయ సమాజం చేసిన గణనీయమైన కృషిని ప్రధానమంత్రి కొనియాడారు. భారతీయ ఆవిష్కరణలనూ, ఆలోచనలనూ ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడంలోనూ, ఇండియా-ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ- వారు పోషిస్తున్న కీలక పాత్రను ఆయన మెచ్చుకున్నారు. ఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులు, నిపుణులు, పర్యాటకులు ఫ్రాన్స్‌ను గమ్యస్థానంగా ఎంచుకోవడంతో రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలు విస్తరించాయని ఆయన తెలియజేశారు. ప్రజల రాకపోకలను సులభతరం చేయడానికి తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఫ్రాన్స్‌లో యూపీఐ విస్తరణ గురించి మాట్లాడుతూ.. ఇది రెండు దేశాల మధ్య పర్యాటకానికి ఊతమిస్తుందని వివరించారు.మరింత చౌకగా, అందరికీ అందుబాటులోకి నాణ్యమైన వైద్య సేవలు.. గత 12 ఏళ్ల కృషిని వివరించిన ప్రధానమంత్రి
June 14th, 01:27 pm
నాణ్యమైన వైద్య సేవలను మరింత చౌకగా, సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి గత 12 ఏళ్లుగా భారత్ కృషి చేస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అత్యంత నిరుపేదలకు సైతం అత్యుత్తమ నాణ్యతతో కూడిన వైద్య సేవలను అందిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ‘ఆయుష్మాన్ భారత్’ను కలిగిన దేశంగా గుర్తింపు పొందడం మనకెంతో గర్వకారణమని ఆయన తెలిపారు.వరుసగా అత్యధిక కాలం దేశానికి సేవలందించిన ఎన్నికైన ప్రధానిగా రికార్డు సృష్టించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీని అభినందిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన కేబినెట్
June 10th, 01:50 pm
భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో 2026 జూన్ 10ని ఒక చరిత్రాత్మక మైలురాయిగా అభివర్ణిస్తూ కేంద్ర క్యాబినెట్ ఈ రోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. నిరంతరాయంగా అత్యధిక కాలంపాటు దేశానికి సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన శ్రీ నరేంద్ర మోదీని ఈ సందర్భంగా కేబినెట్ అభినందించింది. ఎన్నికైన ప్రధానమంత్రిగా వరుసగా 4,399 రోజుల పాటు బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా ఆయన సరికొత్త రికార్డును నెలకొల్పారు. 1952 నుంచి 1964 వరకు వరుసగా 4,398 రోజుల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న గత రికార్డును ఆయన అధిగమించారు. దేశమే ప్రథమమన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న నాయకుడికి ప్రజలు అందించిన అపూర్వమైన మద్దతుకు ఈ ఘట్టం అద్దం పడుతోందని, భారత ప్రజాస్వామ్య చేతనకు, ప్రజా విశ్వాసానికి, ప్రజా భాగస్వామ్య శక్తికి ఇది ప్రతీక అని ఈ తీర్మానంలో కేబినెట్ పేర్కొన్నది.టీఎంసీ అండతో తలదాచుకున్న నేరస్తులకు శిక్ష తప్పదు: పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌లో ప్రధాని మోదీ
April 24th, 11:45 am
పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ మొదటి దశ పోలింగ్‌లో ప్రజల భారీ భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు. మొదటి దశలో టీఎంసీ (TMC) కనీసం ఖాతా కూడా తెరిచే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు; అలాగే, అభివృద్ధి చెందిన బెంగాల్ కోసం బీజేపీకి నిర్ణయాత్మక తీర్పునివ్వాలని రెండో దశ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన జాదవ్‌పూర్ యూనివర్సిటీ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు, ప్రజలను ప్రభావితం చేస్తున్న స్థానిక సమస్యల గురించి కూడా ప్రస్తావించారు.టీఎంసీ పాలనలో బెంగాల్ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు నాశనమయ్యాయి: డమ్ డమ్‌లో ప్రధాని మోదీ
April 24th, 11:35 am
పశ్చిమ బెంగాల్‌లోని డమ్ డమ్‌లో ఈరోజు జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆయన చేసిన ఉత్సాహభరితమైన ప్రసంగం బెంగాల్ ప్రజల మదిలో బలంగా నాటుకుపోయింది. స్పష్టంగా కనిపిస్తున్న మార్పు పవనానికి ఆయన పౌరులను అభినందించారు. మొదటి దశ పోలింగ్ ఇప్పటికే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో నిర్ణయాత్మక మార్పుకు సంకేతాలు ఇచ్చిందని ఆయన నొక్కి చెప్పారు.డమ్ డమ్ మరియు జాదవ్‌పూర్‌లలో ప్రధాని మోదీ ఉద్వేగభరిత ప్రసంగాలు
April 24th, 11:30 am
పశ్చిమ బెంగాల్‌లోని దు డమ్ డమ్ మరియు జాదవ్‌పూర్‌లలో జరిగిన భారీ బహిరంగ సభలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు; ఆయన చేసిన ఉత్సాహభరితమైన ప్రసంగాలు అక్కడి ప్రజలలో బలమైన స్పందనను కలిగించాయి. రాష్ట్రంలో కనిపిస్తున్న మార్పు గాలిని చూసి ప్రజలను అభినందించిన ఆయన, మొదటి దశ పోలింగ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో ఒక నిర్ణయాత్మక మార్పుకు సంకేతంగా నిలిచిందని నొక్కి చెప్పారు.పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై రాజ్యసభలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
March 24th, 02:05 pm
పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం, దాని వల్ల ఉత్పన్నమవుతున్న పరిస్థితుల గురించి మనందరికీ తెలిసిందే. ఈ రోజు, నేను పార్లమెంటు ఎగువ సభ ముందు, నా తోటి పౌరుల ముందు నిలబడి, ఈ ఉద్రిక్త పరిస్థితులపై ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తున్నాను. మూడు వారాలకు పైగా ఈ యుద్ధం కొనసాగుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని సృష్టించింది. భారతదేశానికి కూడా ఈ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మన వాణిజ్య మార్గాలు ప్రభావితమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువులు లాంటి అత్యవసర వస్తువుల సాధారణ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దాదాపు కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. ఉపాధి పొందుతున్నారు. వారి భద్రత, జీవనోపాధి భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. హర్మూజ్ జలసంధిలో అనేక నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో పెద్ద సంఖ్యలో భారతీయ సిబ్బంది ఉన్నారు. ఇది కూడా భారతదేశానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, రాజ్యసభ నుంచి శాంతి, చర్చల ప్రాధాన్యం ప్రపంచానికి తెలియజెప్పేలా ముక్తకంఠంతో మన స్వరం వినిపించడం అవసరం.పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలను ఉద్దేశించి రాజ్యసభలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 24th, 02:00 pm
పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ, ఇవాళ రాజ్యసభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. మూడు వారాలుగా కొనసాగుతోన్న ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొందని, ఇది భారతదేశానికి కూడా ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ ఘర్షణలు భారత వాణిజ్య మార్గాలకు అంతరాయం కలిగిస్తున్నాయని.. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల వంటి నిత్యావసరాల సరఫరాపై ప్రభావం చూపుతున్నట్లు పీఎం శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తూ, అక్కడ పనిచేస్తున్నారని.. వారి భద్రత, జీవనోపాధి ప్రధానంగా ఆందోళన కలిగించే అంశంగా మారినట్లు పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన విదేశీ నౌకల్లో అధిక సంఖ్యలో భారత సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత పార్లమెంటులోని ఎగువ సభ నుంచి శాంతి, చర్చలపై ఉమ్మడి స్వరాన్ని వినిపించటం అత్యంత అవసరం అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేసారు.టీవీ9 సమ్మిట్-2026లో ప్రధానమంత్రి ప్రసంగం
March 23rd, 08:30 pm
ఇటీవల ఒకటి, రెండు సార్లు టీవీ9 భారత్‌వర్ష్ చూసే అవకాశం వచ్చింది. యుద్ధాలు, క్షిపణి దాడులపై మీరు దృష్టి సారిస్తున్నారు. మీకు కంటెంట్ కూడా విపరీతంగా లభిస్తుంది. టీవీ9కి తగినంత సమాచారాన్ని అందించాలని పెద్ద దేశాలు బలంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రస్తుతం ప్రపంచం, మునుపెన్నడూ లేనివిధంగా ఆందోళనకర, అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచనలకు కీలకమైన వేదికను టీవీ9 వ్యవస్థ సృష్టించింది. ఈ సదస్సులో భారత్, ప్రపంచం అంశంపై మీరంతా చర్చిస్తున్నారు. ఈ సదస్సును నిర్వహిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతూ.. కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా సదస్సుకు విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం.టీవీ9 నెట్‌వర్క్ సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం
March 23rd, 08:00 pm
'భారత్ - ప్రపంచం' ఇతివృత్తంతో టీవీ9 నెట్‌వర్క్ ఈ రోజు నిర్వహించిన సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అసాధారణ, క్లిష్ట పరిస్థితులను ఆయన ప్రస్తావించారు. ఇలాంటి కీలక సమయంలో ఆలోచనల మార్పిడికి ఒక వేదికను సిద్ధం చేసిన టీవీ9 నెట్‌వర్క్‌ను ప్రధాని అభినందించారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులు అసాధారణమైనవి. అత్యంత క్లిష్టమైనవి. ఇలాంటి సమయంలో ఆలోచనల మార్పిడికి టీవీ9 నెట్‌వర్క్ ఒక ముఖ్యమైన వేదికను సిద్ధం చేసింది” అని శ్రీ మోదీ అన్నారు.పుదుచ్చేరిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 01st, 12:00 pm
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కె. కైలాస నాథన్, స్పీకర్ శ్రీ ఆర్.సెల్వం, ముఖ్యమంత్రి శ్రీ ఎన్.రంగసామి, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ మన్సుఖ్ మాండవీయ, పుదుచ్చేరి హోంశాఖ మంత్రి శ్రీ ఎ.నమశ్శివాయం, ఇతర నాయకులుసహా ప్రియమైన సోదరీసోదరులారా... వణక్కం! (నమస్కారం)పుదుచ్చేరిలో రూ. 2,700 కోట్ల కంటే ఎక్కువ విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 01st, 11:45 am
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. “ సిద్ధులు, సాధువులు, కవులు, స్వాతంత్ర్య సమరయోధుల నిలయం పుదుచ్చేరి. ఇక్కడే మహాకవి సుబ్రహ్మణ్య భారతి జాతీయవాద స్ఫూర్తిని రగిలించగా.. శ్రీ అరబిందో, మదర్... ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని అందించారు” అని వ్యాఖ్యానించారు.మెరుగైన సంబంధాల ద్వారా సుస్థిరత, ఆర్థిక వృద్ధి, భద్రత కోసం భారత్ – సీషెల్స్ ఉమ్మడి దార్శనికత
February 09th, 03:28 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు 2026 ఫిబ్రవరి 5 నుంచి 10 వరకు సీషెల్స్ దేశాధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మిని భారతదేశంలో పర్యటిస్తున్నారు.సీషెల్స్ అధ్యక్షునితో కలిసి సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధాన మంత్రి పత్రికా ప్రకటన పాఠం
February 09th, 01:00 pm
అధ్యక్షుడు శ్రీ హెర్మినీకీ, ఆయన ప్రతినిధి వర్గానికీ భారత్‌లోకి స్వాగతం పలకడం నాకెంతో సంతోషాన్నిస్తోంది.అనువాదం: కేంద్ర బడ్జెట్‌పై ప్రధానమంత్రి చేసిన ప్రసంగం
February 01st, 01:38 pm
నేటి బడ్జెట్ చారిత్రాత్మకమైనది. ఇది దేశంలోని 'నారీ శక్తి' (మహిళా శక్తి) శక్తిమంతమైన ప్రతిరూపంగా ఉంది. ఒక మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా గారు వరుసగా తొమ్మిదో సారి దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కొత్త రికార్డు సృష్టించారు. అపారమైన అవకాశాలకు ఒక రాజమార్గం ఈ బడ్జెట్. ఈ బడ్జెట్ వర్తమాన కాలపు కలలను సాకారం చేయడమే కాకుండా భారత్ ఉజ్వల భవిష్యత్తుకు పునాదిని బలపరుస్తుంది. 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) వైపు మనం వేసే భారీ ప్రయాణానికి ఈ బడ్జెట్ ఒక బలమైన పునాది వంటిది.2026 కేంద్ర బడ్జెటుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందన
February 01st, 01:00 pm
భారత్‌లో ప్రస్తుతం సంస్కరణల ఎక్స్‌ప్రెస్ పరుగులు తీస్తోందనీ, ఈ బడ్జెటుతో ఈ ఎక్స్‌ప్రెస్ ఒక కొత్త శక్తినే కాకుండా ఓ కొత్త జోరును కూడా అందుకొంటుందని శ్రీ మోదీ వెల్లడించారు. ఇంతవరకు చేపట్టనటువంటి సంస్కరణల్ని చేపట్టినందువల్ల, భారత్‌లో వృద్ధి లోకి రావాలని తపించిపోతున్న, ధైర్యవంతులైన, ప్రతిభావంతులైన యువతకు వారు ఉవ్వెత్తున ఎగరడానికి విశాల గగనాన్ని బడ్జెటు వారి ఎదుట ఆవిష్కరించిందని ఆయన అన్నారు. నమ్మకమైన పాలన, దేశ పౌరుల ప్రయోజనాలకు ప్రాముఖ్యాన్నిచ్చే ఆర్థిక ప్రణాళిక.. ఈ రెండు దృష్టికోణాలనూ బడ్జెటు సాకారం చేసిందని కూడా ఆయన చెప్పారు. ద్రవ్య లోటును తగ్గించడం, ధరల పెరుగుదలకు కళ్లెం వేయడం, అదే సమయంలో అధిక మూలధన వ్యయానికీ, అధిక అభివృద్ధికీ పూచీని ఇవ్వడం.. వీటిపై దృష్టిని కేంద్రీకరించిన అద్వితీయ బడ్జెటు ఇదని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.కేరళలోని ఆర్య వైద్యశాల ధార్మిక ఆస్పత్రి శతాబ్ది వేడుకలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 28th, 02:39 pm
ఈ విశిష్ట సందర్భంలో మీ అందరితో మమేకం కావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆయుర్వేద వైద్య విధాన పరిరక్షణ, అభివృద్ధి, ఆధునికీకరణలో ఆర్య వైద్యశాల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థ తన 125 ఏళ్ల ప్రస్థానంలో ఆయుర్వేదాన్ని శక్తిమంతమైన చికిత్సా విధానంగా నిరూపించింది. ఈ నేపథ్యంలో ఆర్య వైద్యశాల వ్యవస్థాపకులైన వైద్యరత్నం పి.ఎస్.వారియర్ సేవలను వినమ్రంగా స్మరించుకుంటున్నాను. ఆయుర్వేదంపై ఆయన దృక్పథం, ప్రజా సంక్షేమంపై అంకితభావం నేటికీ మనందరికీ స్ఫూర్తినిస్తున్నాయి.