ఫ్రాన్స్, మయోట్ లో చీడో తుఫాను సృష్టించిన విలయం నన్ను కలిచివేసింది: ప్రధానమంత్రి
December 17th, 05:19 pm
ఫ్రాన్స్, మయోట్ లో చీడో తుఫాను సృష్టించిన విలయం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ విపత్కర సమయంలో ఫ్రాన్స్ కు మద్దతుగా నిలుస్తున్నామని, అవసరమైన సహాయాన్నందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు. దేశాధ్యక్షుడు ఇమాన్యువల్ మాక్రోన్ నేతృత్వంలో దేశం ఈ విపత్తుని ధైర్యంగా ఎదుర్కోగలదన్న విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.