న్యూఢిల్లీలో నిర్వహించిన జ్ఞాన భారతం అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

September 12th, 04:54 pm

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ గారు, విద్యావేత్తలు, సోదరీసోదరులారా!

‘జ్ఞాన భారతం’ పోర్టల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం

September 12th, 04:45 pm

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు నిర్వహించిన ‘జ్ఞాన భారతం’ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత స్వర్ణయుగ పునరుజ్జీవనానికి విజ్ఞాన్‌ భవన్‌ సాక్ష్యంగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల కిందటే జ్ఞాన భారతం కార్యక్రమం గురించి తాను ప్రకటించగా, స్వల్ప వ్యవధిలోనే ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తుండటం విశేషమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంతో ముడిపడిన పోర్టల్‌ను కూడా ప్రారంభించామని శ్రీ మోదీ వెల్లడించారు. ఇది ప్రభుత్వం లేదా విద్యా వ్యవస్థ సంబంధిత కార్యక్రమం కాదని, భారతీయ సంస్కృతి-సాహిత్యం, చైతన్య గళంగా జ్ఞాన భారతం ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు. వేల తరాల సాలోచనా వారసత్వాన్ని ప్రస్తావిస్తూ- మహనీయులైన రుషులు, ఆచార్యులు, పండితుల జ్ఞానం, పరిశోధనలను ఆయన గుర్తుచేశారు. భారతీయ జ్ఞానం, సంప్రదాయాలు, శాస్త్రీయ వారసత్వానికి ఇది నిదర్శనమని స్పష్టం చేశారు. మనకు సంక్రమించిన ఈ సుసంపన్న వారసత్వాన్ని జ్ఞాన భారతం కార్యక్రమం ద్వారా డిజిటలీకరిస్తామని శ్రీ మోదీ వెల్లడించారు. దీనిపై ప్రజలకు అభినందించడంతోపాటు ఈ మిషన్‌ నిర్వహణ బృందం సభ్యులకు, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

గణితశాస్త్ర జ్ఞుడు మరియు పద్మ శ్రీ పురస్కార గ్రహీత శ్రీ ఆర్.ఎల్. కశ్యప్ కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

November 12th, 11:36 am

గణితశాస్త్ర జ్ఞుడు మరియు పద్మ శ్రీ పురస్కార గ్రహీత శ్రీ ఆర్.ఎల్. కశ్యప్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

చిన్న ఆన్‌లైన్ చెల్లింపులు పెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తాయి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

April 24th, 11:30 am

కొత్త అంశాలతో, కొత్త స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలతో, కొత్త కొత్త సందేశాలతోమీకు నా ‘మనసులో మాట’ చెప్పేందుకు మరోసారి వచ్చాను. ఈసారి నాకు ఎక్కువ ఉత్తరాలు, సందేశాలు వచ్చిన అంశం గురించి మీకు తెలుసా? ఈ విషయం చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు- ఈ మూడింటికి సంబంధించింది. కొత్త ప్రధానమంత్రి మ్యూజియం గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రధానమంత్రి మ్యూజియం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభమైంది. దీన్ని దేశప్రజల సందర్శనార్థం తెరిచారు. సార్థక్ గారు ఒక శ్రోత. ఆయన గురుగ్రామ్‌లో నివసిస్తున్నారు.

ప్రొఫెసర్ ఎం.ఎస్.నరసింహన్ కన్నుమూతపై ప్రధానమంత్రి సంతాపం

May 16th, 12:05 pm

ప్రొఫెసర్ శ్రీ ఎం.ఎస్.నరసింహన్ కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.