జనవరి 11న రాజ్‌కోట్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి
January 09th, 12:07 pm
ప్రధానమంత్రి 2026 జనవరి 11న రాజ్‌కోట్‌ను సందర్శిస్తారు. కచ్ఛ్, సౌరాష్ట్ర ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో భాగంగా నిర్వహించే ట్రేడ్ షో ను మధ్యాహ్నం సుమారు 1:30 గంటలకు ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఆ తరువాత, మధ్యాహ్నం దాదాపు 2 గంటలకు రాజ్‌కోట్ లోని మార్వాడీ విశ్వవిద్యాలయంలో కచ్ఛ్, సౌరాష్ట్ర ప్రాంతాలకు ఉద్దేశించిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. 13 గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ గుజరాత్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ (జీఐడీసీ) ఎస్టేట్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రకటించడంతో పాటు, రాజ్‌కోట్‌లోనే జీఐడీసీ వైద్య పరికరాల పార్కును కూడా ప్రారంభిస్తారు.