ఆస్ట్రేలియా-భారత్ ప్రధానమంత్రుల సంయుక్త విలేకరుల సమావేశంలో శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 09th, 11:15 am
అంతర్జాతీయ దృక్పథం, ప్రగాఢ పరస్పర విశ్వాసంతో రెండు దేశాలూ సంయుక్తంగా ముందడుగు వేయడంలో ఈ ఉమ్మడి విశిష్టతలే మనకెంతో స్ఫూర్తినిస్తాయి. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కొన్నేళ్లుగా అద్భుత ప్రగతి సాధించిన నేపథ్యంలో నేటి మూడో వార్షిక శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల మధ్య సహకార పరిధిని మరింత విస్తృతం చేసింది.Third India-Australia Annual Summit Joint Statement
July 09th, 10:58 am
At the invitation of Australian PM Anthony Albanese, PM Modi visited Australia from 8-10 July 2026 for the Third Australia-India Annual Summit in Melbourne. The two leaders reaffirmed their shared commitment to further consolidate and expand the India-Australia Comprehensive Strategic Partnership (CSP) and explore new areas of cooperation for the peace, prosperity and stability of the shared region.ఇండోనేషియా అధ్యక్షునితో ప్రధానమంత్రి అధికారిక చర్చలు
July 07th, 02:51 pm
నాయకులిద్దరూ నియంత్రిత, ప్రతినిధి స్థాయి విధానాల్లో జరిగిన అధికారిక చర్చల్లో పాల్గొన్నారు. వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, సముద్ర రక్షణ సహకారం, డిజిటల్-ఆర్థిక సాంకేతికతలు, ఇంధనం, ఆరోగ్య సేవలు, ఫార్మాసూటికల్స్, అంతరిక్షం, కీలకమైన ఖనిజాలు, అరుదైన మూలకాలు, సంస్కృతి, పర్యాటకం, వ్యవసాయం, ప్రజా సంబంధాలతో సహా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని అంశాలను వారు సమీక్షించారు. భారత్‌లోని ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) ఆధారంగా ఇండోనేషియా ఓపెన్ నెట్వర్క్ (ఐవోఎన్) ప్రారంభం కావడాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. 2027 నాటికి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇండోనేషియాలో పర్యటించి వందేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఠాగూర్–దేవంతర సాంస్కృతిక, విద్యా దౌత్య సంవత్సరాన్ని రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు.ఒప్పందాల జాబితా: ఇండోనేషియాలో ప్రధానమంత్రి పర్యటన
July 07th, 01:03 pm
శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష అన్వేషణ, వినియోగంలో సహకారంపై విధానపరమైన ఒప్పందం పొడిగింపుసీషెల్స్లో ప్రధానమంత్రి అధికారిక పర్యటన
June 28th, 08:30 pm
2026 జూన్ 27 నుంచి 29 వరకు సీషెల్స్‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటనలో భాగంగా మహేలోని విక్టోరియాలో ఉన్న స్టేట్ హౌస్‌లో సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినితో ఈ రోజు అధికారిక చర్చలు జరిపారు.నార్వే ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధానమంత్రి పత్రికా ప్రకటన
May 18th, 04:44 pm
గతేడాదే నేను నార్వేలో పర్యటించాల్సి ఉంది. అయితే, పహల్గాంలో ఉగ్రవాద దాడి కారణంగా ఆ పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు నార్వే అండగా నిలిచింది. మన స్నేహబంధం శక్తికి ఇది నిదర్శనం. ఆ మద్దతు, సంఘీభావం పట్ల ఈ రోజు నార్వే పర్యటన సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.డచ్ ‘సీఈవో’లతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశం
May 16th, 10:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా ఇవాళ నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రోబ్ జెట్టెన్‌తో సంయుక్తంగా ఆ దేశంలోని వివిధ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారుల (సీఈవో)తో సమావేశమయ్యారు. ఇంధనం, ఓడరేవులు, ఆరోగ్యం, వ్యవసాయం, వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం వంటి పలు రంగాల్లోని ప్రసిద్ధ కంపెనీల ‘సీఈవో’లతో అనేక అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా సెమీకండక్టర్లు, సాంకేతికత-ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, రవాణా, సముద్ర రంగం, సుస్థిరత, ఇంధనం, వ్యవసాయ రంగాలపై తమ ఆలోచనలను పంచుకుంటూ, భారత్‌కు సంబంధించి తమ వ్యాపార వ్యూహాలను వివరించారు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రధానమంత్రి పర్యటన
May 15th, 03:59 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అధికారిక పర్యటన చేపట్టారు. ఆయనకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ లాంఛనప్రాయంగా స్వాగతం పలికారు.ప్రధాని యూఏఈ పర్యటన ఫలితాల వివరాలు
May 15th, 03:46 pm
యుఎఇలో ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన ఫలితంగా అనేక అవగాహన ఒప్పందాలు మరియు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇవి పెట్రోలియం, చమురు, రక్షణ, ఓడ మరమ్మత్తు, సముద్ర సహకారం మరియు సూపర్‌కంప్యూటింగ్ వంటి రంగాలను కవర్ చేస్తాయి. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ADIA) మరియు భారతదేశం యొక్క NIIF భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో US$ 1 బిలియన్ల వరకు పెట్టుబడులను అన్వేషించడం ఒక ప్రధాన ప్రకటన.మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై భారత్, వియత్నాం దేశాల సంయుక్త ప్రకటన
May 06th, 05:24 pm
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, వియత్నాం దేశాధ్యక్షుడు శ్రీ తో లామ్ 2026 మే 05 నుంచి మే 07 వరకు భారతదేశంలో అధికారిక పర్యటన చేశారు. ఈయనతో పాటు ఒక ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం వచ్చింది. వీరితో పాటు వ్యాపార ప్రతినిధుల బృందం కూడా పర్యటనలో పాల్గొంది.నిరంతర సముద్ర బీమా రక్షణను సులభతరం చేయడానికి రూ. 12,980 కోట్ల సార్వభౌమ హామీతో 'భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్' (బీఎంఐ పూల్) ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి వర్గం
April 18th, 03:10 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 'భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్' (బీఎంఐ పూల్) ఏర్పాటుకు అధికారికంగా ఆమోదం లభించింది. నిరంతర సముద్ర బీమా కవరేజీని కల్పించేందుకు రూ. 12,980 కోట్ల సార్వభౌమ హామీతో ఈ పూల్ ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయంగా సముద్ర మార్గాల్లో అస్థిరత, భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ భారతీయ వాణిజ్యానికి ఎటువంటి అంతరాయం కలగకుండా చూడటమే దీని ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ ఓడరేవుల నుంచి భారతీయ ఓడరేవులకు సరుకు రవాణా చేసే నౌకలతో పాటు భారత్ నుంచి అంతర్జాతీయ గమ్యస్థానాలకు సరుకు రవాణా చేసే నౌకలకు అస్థిరమైన సముద్ర మార్గాల్లో ప్రయాణించేటప్పుడు కూడా సరసమైన ధరలో బీమా సౌకర్యం అందుబాటులో ఉండేలా ఈ పూల్ భరోసా ఇస్తుంది.ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్.. . పశ్చిమ ఆసియాలో స్థితితో పాటు నౌకావాణిజ్య భద్రతపై చర్చలు
April 16th, 10:25 pm
ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, మాట్లాడారు.ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధానమంత్రి
March 21st, 04:26 pm
ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయటంపై ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవ డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఫోన్‌లో మాట్లాడారు.మెరుగైన సంబంధాల ద్వారా సుస్థిరత, ఆర్థిక వృద్ధి, భద్రత కోసం భారత్ – సీషెల్స్ ఉమ్మడి దార్శనికత
February 09th, 03:28 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు 2026 ఫిబ్రవరి 5 నుంచి 10 వరకు సీషెల్స్ దేశాధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మిని భారతదేశంలో పర్యటిస్తున్నారు.సీషెల్స్ అధ్యక్షునితో కలిసి సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధాన మంత్రి పత్రికా ప్రకటన పాఠం
February 09th, 01:00 pm
అధ్యక్షుడు శ్రీ హెర్మినీకీ, ఆయన ప్రతినిధి వర్గానికీ భారత్‌లోకి స్వాగతం పలకడం నాకెంతో సంతోషాన్నిస్తోంది.మలేషియా ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి అధికారిక చర్చలు
February 08th, 11:19 am
ఈ రోజు పెర్దానా పుత్రా కాంప్లెక్స్‌లో మలేషియా ప్రధానమంత్రి గౌరవ దాతోసేరి అన్వర్ ఇబ్రహీం భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సంప్రదాయ పూర్వక స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం అధికారిక నివాసం సెరి పెర్దానాలో ప్రతినిధి బృందం స్థాయిలో చర్చలు జరిపారు.మలేషియా ప్రధానితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధాని ప్రకటన
February 08th, 08:35 am
ముందుగా నాకు ఆత్మీయంగా స్వాగతం పలికిన నా ఆప్తమిత్రుడు, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గతేడాది ఆసియాన్ సదస్సు సందర్భంగా మలేషియాను సందర్శించలేకపోయాను. కానీ వీలైనంత తొందరలోనే మలేషియాకు వస్తానని నా ప్రియమిత్రుడికి అప్పట్లో మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం.. 2026లో నా తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఈ రోజు మలేషియాలో ఉన్నాను.మలేషియాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారిక పర్యటన సందర్భంగా విడుదల చేసిన భారత్, మలేషియా ఉమ్మడి ప్రకటన
February 08th, 08:30 am
మలేషియా ప్రధానమంత్రి శ్రీ దాతో సెరీ అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 7 నుంచి 8 వరకు మలేషియాలో అధికారిక పర్యటన చేపట్టారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి నాగరికత సంబంధాలపై ఆధారపడిన ఉన్న లోతైన స్నేహం, సుదీర్ఘ ప్రజల మధ్య బంధాలను తెలియజేసింది. భారత్-మలేషియా 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' మరింత పటిష్ఠం చేయటం, విస్తరించడానికి ఇరు దేశాల నాయకులకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటించింది.మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో ప్రతినిధి స్థాయి చర్చల సందర్భంలో ప్రధానమంత్రి ప్రసంగం
February 08th, 08:20 am
నా మిత్రులు... గౌరవనీయ ప్రధానమంత్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకూ, నా ప్రతినిధి బృందానికి లభించిన స్వాగతం... కేవలం కొన్ని గంటల్లోనే సంప్రదాయాలను మించిన మలేషియా ప్రజల జీవన విధానాన్ని మాకు పరిచయం చేసిన విధానం... ప్రతి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం నా జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. దీనికి నేను మనస్ఫూర్తిగా నా ప్రశంసలు తెలియజేస్తున్నాను. స్నేహానికి నిజమైన అర్థాన్నీ, అలాగే దానిలోని గొప్పతనాన్నీ నేను నిజంగా అనుభూతి చెందాను. దాని కోసం మీకు నా కృతజ్ఞతలు.అనువాదం: ఐరోపా సమాఖ్య అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్‌లతో కలిసి నిర్వహించిన పత్రికా ప్రకటనలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 27th, 01:30 pm
నిన్న ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. మొదటిసారిగా ఐరోపా సమాఖ్య అగ్రనేతలు భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ రోజు కూడా మరొక చారిత్రాత్మక సందర్భం. ఇవాళ ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తులు.. తమ సంబంధాలలో ఒక సరికొత్త, నిర్ణయాత్మక అధ్యాయాన్ని చేర్చడానికి ఒకచోట చేరాయి.