ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసిన రష్యా అధ్యక్షుడి సహాయకుడు
November 18th, 09:02 pm
రష్యా అధ్యక్షుడి సహాయకుడు... రష్యన్ ఫెడరేషన్ మారిటైమ్ బోర్డు ఛైర్మన్ శ్రీ నికోలాయ్ పాత్రుషేవ్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.ముంబైలో జరిగిన మారిటైమ్ లీడర్స్ కాంక్లేవ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం
October 29th, 04:09 pm
మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు సర్బానంద సోనోవాల్ జీ, శంతను ఠాకూర్ జీ, కీర్తి వర్ధన్ సింగ్ జీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే జీ, అజిత్ పవార్ జీ, షిప్పింగ్, ఇతర పరిశ్రమల నాయకులు, ఇతర విశిష్ట అతిథులు, మహిళలు, పెద్దలు,PM Modi addresses Maritime Leaders Conclave at India Maritime Week 2025 in Mumbai
October 29th, 04:08 pm
In his address at the Maritime Leaders Conclave in Mumbai, PM Modi highlighted that MoUs worth lakhs of crores of rupees have been signed in the shipping sector. The PM stated that India has taken major steps towards next-gen reforms in the maritime sector this year. He highlighted Chhatrapati Shivaji Maharaj’s vision that the seas are not boundaries but gateways to opportunity, and stated that India is moving forward with the same thinking.అనువాదం: ఐఎన్ఎస్ విక్రాంత్‌లో సాయుధ దళాల మధ్య దీపావళి వేడుకలు చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 20th, 10:30 am
ఈ రోజు అద్భుతమైనది… ఈ క్షణం మరపురానిది.. ఈ దృశ్యం అసాధారణమైనది. నాకు ఒకవైపు విశాలమైన అనంత సముద్రం ఉంది.. మరొక వైపు భారత మాత ధీర సైనికుల అపారమైన సామర్థ్యం ఉంది. నాకు ఒక దిక్కు అనంతమైన విశ్వం, అంతులేని ఆకాశం ఉన్నాయి.. మరో దిక్కు అనంతమైన శక్తిని కలిగి ఉన్న అద్భుత ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. సముద్రపు నీటిపై పడ్డ సూర్యకాంతి మెరుపు.. ఒక విధంగా మన వీర సైనికులు వెలిగించే దీపావళి దీపాల మాదిరిగా ఉంది. మన దివ్యమైన వెలుగుల మాలికలు ఇవి. ఈసారి నేను మన నావికాదళ యోధుల మధ్య దీపావళి పండుగను చేసుకోవటం నాకు కలిగిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధనౌక కాదు... 21వ శతాబ్దంలో భారత కృషి, ప్రతిభ, ప్రభావం, నిబద్ధతలకు ఇది నిదర్శనం
October 20th, 10:00 am
ఈ రోజు ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయుధ దళాల సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు... ఒక అద్భుతమైన క్షణం... ఇది ఒక అద్భుతమైన దృశ్యం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఒక వైపు విశాలమైన సముద్రం... మరోవైపు ధైర్యవంతులైన భరతమాత సైనికుల అపారమైన బలం ఇక్కడ ఉందన్నారు. ఒక దిశ అనంతమైన ఆలోచనా పరిధిని... హద్దులులేని ఆకాశాన్ని ప్రదర్శిస్తుండగా, మరొక దిశలో అనంతమైన శక్తి గల ఐఎన్ఎస్ విక్రాంత్ అపార శక్తి ప్రదర్శితమవుతోందని ఆయన పేర్కొన్నారు. సముద్రంపై నుంచి కనిపిస్తున్న సూర్యకాంతి మెరుపులు ధైర్యవంతులైన మన సైనికులు వెలిగించిన దీపాల మాదిరిగా ప్రకాశిస్తూ.. దివ్య దీప మాలను తలపిస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ధైర్యసాహసాలకు మారుపేరైన భారత నావికాదళ సిబ్బందితో కలిసి ఈ దీపావళిని జరుపుకోవడం తనకు దక్కిన గౌరవమని ఆయన ఉద్ఘాటించారు.నౌకా నిర్మాణం, నౌకా వాణిజ్యానికి ఆర్థిక సాయం, దేశీయ సామర్ధ్యాన్ని బలోపేతం చేయడానికి సమగ్ర నాలుగు స్తంభాల వ్యూహం
September 24th, 03:08 pm
నౌకా వాణిజ్య రంగ వ్యూహాత్మక, ఆర్థిక ప్రాముఖ్యతను గుర్తిస్తూ భారత నౌకా నిర్మాణం, నౌకా వాణిజ్య రంగాల పునరుజ్జీవనం కోసం రూ 69,725 కోట్ల సమగ్ర ప్యాకేజీని ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దేశీయ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి.. దీర్ఘకాలిక ఆర్థిక సాయాన్ని మెరుగుపరచడానికి.. గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి.. సాంకేతిక సామర్థ్యాలు-నైపుణ్యాలను మెరుగుపరచడానికి.. బలమైన నౌకా వాణిజ్య మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చట్టపరమైన, పన్నులపరమైన, విధానపరమైన సంస్కరణల అమలు కోసం రూపొందించిన నాలుగు స్తంభాల వ్యూహాన్ని ఈ ప్యాకేజీ పరిచయం చేస్తుంది.అనువాదం: గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో నిర్వహించిన ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 20th, 11:00 am
భావ్‌నగర్‌లో ఒక ఉత్తేజకరమైన వాతావరణం కనిపిస్తోంది. వేదిక ముందున్న జన సంద్రం నాకు కనిపిస్తోంది. ఇంత పెద్ద జనసమూహం నాకు ఆశీస్సులు ఇచ్చేందుకు వచ్చింది. మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
September 20th, 10:30 am
గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో రూ. 34,200 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. 'సముద్ర సే సమృద్ధి' కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రి స్వాగతించారు. ఈ నెల 17న తనకు పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ప్రేమాభిమానాలు గొప్ప బలమన్నారు. దేశంలో విశ్వకర్మ జయంతి నుంచి గాంధీ జయంతి వరకు అంటే ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పఖ్వాడా నిర్వహిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. గత 2-3 రోజుల్లో గుజరాత్లో అనేక సేవా కార్యక్రమాలు.. వందలాది ప్రదేశాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారన్నారు. ఇప్పటివరకు ఒక లక్ష మంది రక్తదానం చేశారని ప్రధానమంత్రి వెల్లడించారు. అనేక నగరాల్లో నిర్వహించిన పరిశుభ్రతా కార్యక్రమాల్లో లక్షలాది మంది పౌరులు చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30,000 కి పైగా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశామనీ, ప్రజలకు.. ముఖ్యంగా మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్స అందిస్తున్నామని శ్రీ మోదీ తెలియజేశారు. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ప్రశంసిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.రేపు గుజరాత్లో ప్రధానమంత్రి పర్యటన
September 19th, 05:22 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు గుజరాత్లో పర్యటిస్తారు. ఉదయం 10:30 గంటలకు భావ్‌నగర్‌లో ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రూ. 34,200 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.మాల్దీవ్స్ అధ్యక్షుడితో సంయుక్త పాత్రికేయ సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
July 25th, 06:00 pm
ఇది భారత్-మాల్దీవ్స్ దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవ ఏడాది కూడా కావడం విశేషం. వాస్తవానికి ఈ బంధానికిగల మూలాలు చరిత్రకన్నా ప్రాచీనమైనవేగాక, సముద్రమంతటి లోతైనవి కూడా. అనాదిగా కొనసాగుతున్న స్నేహబంధాన్ని పటిష్ఠం చేసుకోవడంలో భాగంగా ఈ రోజు స్మారక స్టాంపును ఆవిష్కరించాం. దీనిపై కనిపించే రెండు దేశాల సంప్రదాయ పడవల చిత్రం చూస్తే- చరిత్రలో మనం ఇరుగుపొరుగు మాత్రమే కాదని, సహ ప్రయాణికులమని స్పష్టమవుతుంది.సైప్రస్, భారత వాణిజ్య రంగ ప్రముఖులతో ప్రధానమంత్రి, సైప్రస్ అధ్యక్షుల భేటీ
June 16th, 02:17 am
సైప్రస్ అధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్‌తో కలసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సైప్రస్, భారత్ వాణిజ్య రంగ ప్రముఖులతో లిమాసోల్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు, రక్షణ, ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్), నౌకావాణిజ్యం, షిప్పింగ్, సాంకేతికత, నవకల్పన, డిజిటల్ సాంకేతికలు, కృత్రిమ మేధ, ఐటీ సర్వీసులు, పర్యటన, రవాణావంటి భిన్న రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు.అనువాదం: సైప్రస్‌లో జరిగిన భారత్-సైప్రస్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
June 15th, 11:10 pm
అన్నింటి కంటే ముందుగా ఈరోజు నన్ను స్వయంగా విమానాశ్రయానికి ఆహ్వానించడానికి వచ్చినందుకు అధ్యక్షుడికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వ్యాపార సంస్థల నాయకులతో ఇంత పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినందుకు ఆయనకు ధన్యవాదాలు. నా గురించి, ఇరు దేశాల భాగస్వామ్యం గురించి ఆయన పంచుకున్న సానుకూల ఆలోచనల పట్ల కూడా ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాను.గాంధీనగర్‌లో ‘రెండు దశాబ్దాల గుజరాత్ పట్టణ ప్రగతి పథం’ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 27th, 11:30 am
ఈ వేదికనలంకరించిన గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ మనోహర్ లాల్, శ్రీ సి.ఆర్.పాటిల్, రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రులు సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైన నా ప్రియ సోదరీసోదరులారా!గుజరాత్ పట్టణాభివృద్ధిని చాటే 20 ఏళ్ల ఉత్సవంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
May 27th, 11:09 am
గుజరాత్ పట్టణాభివృద్ధిని చాటే 20 ఏళ్ల వేడుకనుద్దేశించి గాంధీనగర్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. పట్టణాభివృద్ధి సంవత్సరం- 2005కు ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా పట్టణాభివృద్ధి సంవత్సరం-2025ను ఆయన ప్రారంభించారు. సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తూ.. వడోదర, దాహోద్, భుజ్, అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో పర్యటన సందర్భంగా ఆపరేషన్ సిందూర్ విజయ గర్జనలు, రెపరెపలాడుతున్న మువ్వెన్నెల పతాకాలతో వెల్లివిరుస్తున్న దేశభక్తిని రెండు రోజులుగా ఆస్వాదిస్తున్నానన్నారు. ఈ కనువిందైన దృశ్యం ఒక్క గుజరాత్‌కే పరిమితం కాలేదనీ.. భారత్ నలుమూలలా, ప్రతి భారతీయుడి హృదయమూ ఇదే రకమైన భావనతో ఉప్పొంగుతోందని ఆయన పేర్కొన్నారు. “ఉగ్రవాదమనే కంటకాన్ని నిర్మూలించాలని సంకల్పించిన భారత్ దృఢ నిశ్చయంతో దానిని నెరవేర్చింది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.From seafood to tourism and trade, India is building a new ecosystem along the coastal regions: PM Modi in Bhuj, Gujarat
May 26th, 05:00 pm
PM Modi launched multiple development projects in Bhuj, Gujarat. Emphasizing that Kutch has demonstrated the power of hope and relentless effort in achieving remarkable success, the PM recalled the devastating earthquake that once led many to doubt the region’s future. He cited Dhola Vira and Lothal as prime examples of India's rich heritage. He also highlighted the UNESCO recognised Smriti Van memorial.గుజరాత్‌లోని భుజ్‌లో రూ. 53,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 26th, 04:45 pm
పవిత్ర భూమి కచ్ లో ఆశాపుర మాత దివ్య ఉనికిని గుర్తు చేస్తూ, శ్రీ మోదీ ఆమెకు నివాళులు అర్పించారు. ఈ ప్రాంతంపై ఆమె నిరంతర ఆశీస్సులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ, అక్కడి ప్రజలకు కూడా తన గౌరవాన్ని తెలియజేశారు.కేరళలోని తిరువనంతపురంలో విజింజామ్ అంతర్జాతీయ ఓడరేవును జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
May 02nd, 02:06 pm
కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ జీ, ముఖ్యమంత్రి శ్రీ పి. విజయన్ జీ, నా కేంద్ర మంత్రివర్గ సహచరులు, వేదికపై ఉన్న ఇతర ప్రముఖులు, కేరళకు చెందిన నా సోదర సోదరీమణులారా...కేరళలో రూ. 8,800 కోట్లతో నిర్మించిన విజింజామ్ అంతర్జాతీయ ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
May 02nd, 01:16 pm
కేరళలోని తిరువనంతపురంలో రూ.8,800 కోట్ల విలువైన విజింజామ్ అంతర్జాతీయ డీప్ వాటర్ మల్టీపర్పస్ ఓడరేవును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. భగవాన్ ఆదిశంకరాచార్య జయంతి శుభ సందర్భంగా సభనుద్దేశించి మాట్లాడుతూ, మూడేళ్ల కిందట సెప్టెంబరులో ఆదిశంకరాచార్యుల పవిత్ర జన్మస్థలాన్ని సందర్శించే భాగ్యం తనకు లభించిందని గుర్తు చేసుకున్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గమైన కాశీలోని విశ్వనాథ్ ధామ్ కాంప్లెక్సులో ఆదిశంకరాచార్యుల భారీ విగ్రహం ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆది శంకరాచార్యుల అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానానికీ బోధనలకూ గౌరవంగా ఈ విగ్రహ స్థాపనను ఆయన అభివర్ణించారు. ఉత్తరాఖండ్‌లోని పవిత్ర కేదారనాథ్ ధామ్‌లో ఆది శంకరాచార్యుల దివ్య విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం కూడా తనకు దక్కిందన్నారు. ఈరోజుకు మరో ప్రత్యేకత ఉందని, కేదారనాథ్ ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరచుకునే విశేష దినమని తెలిపారు. కేరళకు చెందిన ఆదిశంకరాచార్యులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మఠాలను స్థాపించి దేశాన్ని జాగరూకం చేశారని ప్రధానమంత్రి మోదీ గుర్తు చేశారు. ఆయన కృషి వల్ల ఏకీకృతమైన, ఆధ్యాత్మిక చేతన గల భారత్‌కు పునాదులు పడ్డాయని ఆయన స్పష్టం చేశారు.జాతీయ సముద్ర దినోత్సవం నేపథ్యంలో సముద్ర రంగం... ఓడరేవుల బలోపేతానికి ప్రభుత్వ నిబద్ధతపై ప్రధాని పునరుద్ఘాటన
April 05th, 09:06 am
జాతీయ సముద్ర దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతి దిశగా సముద్ర రంగంతోపాటు ఓడరేవుల బలోపేతంపై ప్రభుత్వ నిబద్ధతను ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్షీర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
January 15th, 11:08 am
జనవరి 15వ తేదీని సైనిక దినోత్సవంగా జరుపుకొంటాం. దేశాన్ని రక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రతి వీర సైనికుడికి నేను ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నాను, ఈ రోజున భరతమాత రక్షణలో నిమగ్నమైన సైనికులను, మహిళలను నేను అభినందిస్తున్నాను.