మధ్య ప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో దుర్ఘటన...ప్రాణనష్టం...ప్రధానమంత్రి సంతాపం

April 27th, 09:55 pm

మధ్య ప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఆదివారం ఓ ప్రమాదం కారణంగా ప్రాణనష్టం జరిగినందుకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మృతుల్లో ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల వంతున ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్‌గ్రేషియాను వారి ఆత్మీయులకు అందించనున్నట్లు, అలాగే గాయపడ్డ వ్యక్తులకు రూ.50,000 వంతున ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.