అనువాదం: ఐఎన్ఎస్ విక్రాంత్‌లో సాయుధ దళాల మధ్య దీపావళి వేడుకలు చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 20th, 10:30 am
ఈ రోజు అద్భుతమైనది… ఈ క్షణం మరపురానిది.. ఈ దృశ్యం అసాధారణమైనది. నాకు ఒకవైపు విశాలమైన అనంత సముద్రం ఉంది.. మరొక వైపు భారత మాత ధీర సైనికుల అపారమైన సామర్థ్యం ఉంది. నాకు ఒక దిక్కు అనంతమైన విశ్వం, అంతులేని ఆకాశం ఉన్నాయి.. మరో దిక్కు అనంతమైన శక్తిని కలిగి ఉన్న అద్భుత ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. సముద్రపు నీటిపై పడ్డ సూర్యకాంతి మెరుపు.. ఒక విధంగా మన వీర సైనికులు వెలిగించే దీపావళి దీపాల మాదిరిగా ఉంది. మన దివ్యమైన వెలుగుల మాలికలు ఇవి. ఈసారి నేను మన నావికాదళ యోధుల మధ్య దీపావళి పండుగను చేసుకోవటం నాకు కలిగిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధనౌక కాదు... 21వ శతాబ్దంలో భారత కృషి, ప్రతిభ, ప్రభావం, నిబద్ధతలకు ఇది నిదర్శనం
October 20th, 10:00 am
ఈ రోజు ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయుధ దళాల సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు... ఒక అద్భుతమైన క్షణం... ఇది ఒక అద్భుతమైన దృశ్యం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఒక వైపు విశాలమైన సముద్రం... మరోవైపు ధైర్యవంతులైన భరతమాత సైనికుల అపారమైన బలం ఇక్కడ ఉందన్నారు. ఒక దిశ అనంతమైన ఆలోచనా పరిధిని... హద్దులులేని ఆకాశాన్ని ప్రదర్శిస్తుండగా, మరొక దిశలో అనంతమైన శక్తి గల ఐఎన్ఎస్ విక్రాంత్ అపార శక్తి ప్రదర్శితమవుతోందని ఆయన పేర్కొన్నారు. సముద్రంపై నుంచి కనిపిస్తున్న సూర్యకాంతి మెరుపులు ధైర్యవంతులైన మన సైనికులు వెలిగించిన దీపాల మాదిరిగా ప్రకాశిస్తూ.. దివ్య దీప మాలను తలపిస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ధైర్యసాహసాలకు మారుపేరైన భారత నావికాదళ సిబ్బందితో కలిసి ఈ దీపావళిని జరుపుకోవడం తనకు దక్కిన గౌరవమని ఆయన ఉద్ఘాటించారు.భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందించిన ప్రపంచ నేతలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి
August 15th, 07:26 pm
మన దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అందించిన ప్రపంచ నేతలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఆది తిరువత్తిరై ఉత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
July 27th, 12:30 pm
పూజనీయ ఆధీనం మఠాధిపతి గారు, చిన్మయ మిషన్ స్వామీజీలు, తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి గారు, మంత్రివర్గ సహచరుడు డాక్టర్ ఎల్. మురుగన్ గారు, స్థానిక ఎంపీ తిరుమా వలవన్ గారు, వేదికపై ఉన్న తమిళనాడు మంత్రులూ, పార్లమెంటు సహచరుడు ఇళయరాజా గారు, ఒడువర్లు, భక్తులు, విద్యార్థులు, సాంస్కృతిక చరిత్రకారులు, ప్రియమైన సోదరీ సోదరులా! నమఃశివాయ.తమిళనాడులోని గంగైకొండ చోళపురంలో ఆడి తిరువాతిరై వేడుక సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 27th, 12:25 pm
తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఈ రోజు ఆడి తిరువాతిరై వేడుక సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. మున్ముందుగా ఆదిదేవుడైన మహాశివునికి నీరాజనం అర్పిస్తూ- రాజరాజ చోళుడు రాజ్యమేలిన పవిత్ర భూమిలో పరమేశుని దివ్య దర్శనంతో తనలో ఆధ్యాత్మిక శక్తి పెల్లుబికిందని పేర్కొన్నారు. శ్రీ ఇళయరాజా స్వరాలు సమకూర్చిన భక్తి గీతాలాపనను అమితంగా ఆస్వాదించానని చెప్పారు. శైవారాధకులైన ‘ఓతువర్ల’ పవిత్ర మంత్రోచ్చారణ నడుమ సర్వశక్తిమంతుడైన శివుడికి నమస్కరిస్తూ- ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణంతో తాదాత్మ్యం చెందానని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.మాల్దీవుల 60వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరైన ప్రధానమంత్రి
July 26th, 06:47 pm
మాల్దీవుల దేశంలో అధికారిక పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ 60వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రధానమంత్రి హాజరు కావడం ఇదే మొదటిసారి. అధ్యక్షుడు ముయిజు ఆతిథ్యం ఇచ్చిన ప్రభుత్వాధినేత లేదా దేశ నాయకుడు కూడా ప్రధాని మోదీనే కావటం విశేషం.ప్రధానమంత్రి మాల్దీవ్స్ పర్యటనలో ముఖ్యాంశాలు
July 26th, 07:19 am
మాల్దీవ్స్‌కు రూ.4,850 కోట్ల దశలవారీ రుణ (ఎల్‌వోసీ) సౌకర్యం పొడిగింపుభారత్, మాల్దీవుల దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవం సందర్భంగా స్మారక స్టాంపుల విడుదల
July 25th, 09:08 pm
భారత్, మాల్దీవుల దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు నిండిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మాల్దీవులు అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజు స్మారక స్టాంపులను విడుదల చేశారు.మాల్దీవుల అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోదీ
July 25th, 08:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మాలేలోని అధ్యక్షుడి కార్యాలయంలో మాల్దీవుల దేశాధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజుతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీకి రిపబ్లిక్ స్క్వేర్‌లో అధ్యక్షుడు ముయిజు ఘనంగా సంప్రదాయపూర్వకంగా స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్యనున్న లోతైన స్నేహ బంధాన్ని, హృదయపూర్వక వాతావరణాన్ని ఈ సమావేశం ప్రతిబింబించింది.మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ భవనాన్ని ఆ దేశ అధ్యక్షుడితో కలిసి ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
July 25th, 08:43 pm
మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ అత్యాధునిక భవనాన్ని ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజుతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర ఈ రోజు ప్రారంభించారు.మాల్దీవ్స్ అధ్యక్షుడితో సంయుక్త పాత్రికేయ సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
July 25th, 06:00 pm
ఇది భారత్-మాల్దీవ్స్ దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవ ఏడాది కూడా కావడం విశేషం. వాస్తవానికి ఈ బంధానికిగల మూలాలు చరిత్రకన్నా ప్రాచీనమైనవేగాక, సముద్రమంతటి లోతైనవి కూడా. అనాదిగా కొనసాగుతున్న స్నేహబంధాన్ని పటిష్ఠం చేసుకోవడంలో భాగంగా ఈ రోజు స్మారక స్టాంపును ఆవిష్కరించాం. దీనిపై కనిపించే రెండు దేశాల సంప్రదాయ పడవల చిత్రం చూస్తే- చరిత్రలో మనం ఇరుగుపొరుగు మాత్రమే కాదని, సహ ప్రయాణికులమని స్పష్టమవుతుంది.మాల్దీవుల మాలే చేరుకున్న ప్రధాని మోదీ
July 25th, 10:28 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం మాల్దీవులకు చేరుకున్నారు. ఆయనను విమానాశ్రయంలో అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు స్వయంగా స్వాగతించారు. ప్రధాని మోదీ మాల్దీవుల 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొంటారు.జులై 26, 27 తేదీల్లో ప్రధాని తమిళనాడు పర్యటన
July 25th, 10:09 am
యూకే, మాల్దీవుల పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళనాడు సందర్శిస్తారు. ట్యుటికోరన్‌లో జులై 26 రాత్రి 8 గంటలకు జరిగే బహిరంగ కార్యక్రమంలో రూ. 4,800 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేస్తారు.యునైటెడ్ కింగ్డమ్, మాల్దీవుల పర్యటనకు బయల్దేరే ముందు ప్రధాని ప్రకటన
July 23rd, 01:05 pm
భారత్, యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇటీవలి కాలంలో గణనీయమైన పురోగతిని సాధించింది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, రక్షణ, విద్య, పరిశోధన, సుస్థిరత, ఆరోగ్యం, ప్రజా సంబంధాలు తదితర రంగాల్లో మన సహకారం విస్తరించింది. గౌరవ ప్రధాని సర్ కీర్ స్టార్మర్‌తో జరిపే సమావేశంలో రెండు దేశాల్లోనూ సంక్షేమాన్ని, వృద్ధిని, ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే అవకాశం లభిస్తుంది. ఈ పర్యటనలో గౌరవ కింగ్ ఛార్లెస్ IIIతో సమావేశం అయ్యేందుకు ఎదురుచూస్తున్నా.యునైటెడ్ కింగ్‌డమ్ మరియు మాల్దీవులకు ప్రధానమంత్రి పర్యటన (జూలై 23 - 26, 2025)
July 20th, 10:49 pm
ప్రధాని మోదీ జూలై 23 - 26 వరకు యుకే కి అధికారిక పర్యటన మరియు మాల్దీవులకు రాష్ట్ర పర్యటన చేస్తారు. ఆయన పిఎం స్టార్మర్‌తో విస్తృత చర్చలు జరుపుతారు మరియు వారు సీఎస్పి పురోగతిని కూడా సమీక్షిస్తారు. జూలై 26న జరిగే మాల్దీవుల స్వాతంత్ర్య 60వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ 'గౌరవ అతిథి'గా ఉంటారు. ఆయన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజును కలుస్తారు మరియు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై చర్చలు జరుపుతారు.భారత్ 76వ గణతంత్ర దినోత్సవం.. ప్రపంచ నేతల శుభాకాంక్షలు.. ప్రధానమంత్రి ధన్యవాదాలు
January 26th, 05:56 pm
భారత్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు వ్యక్తం చేశారు.అక్టోబర్ 6-10 మధ్య భారత్ లో మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ముయిజ్జు జరిపిన అధికారిక పర్యటన అనంతర ముఖ్య పరిణామాలు
October 07th, 03:40 pm
భారత్-మాల్దీవుల ఒప్పందం: సమగ్ర ఆర్థిక, నౌకావాణిజ్య భద్రత దిశగా భాగస్వామ్యం కోసం వ్యూహరచనభారత్, మాల్దీవులు: సమగ్ర ఆర్థిక, నౌకా వాణిజ్య భద్రతా భాగస్వామ్యమే లక్ష్యం
October 07th, 02:39 pm
1. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, మాల్దీవుల అధ్యక్షుడు డా. మహ్మద్ ముయిజ్జు ఈరోజు (అక్టోబర్ 7, 2024) సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, రెండు దేశాల ప్రజల మధ్య చారిత్రక సన్నిహిత సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో సాధించిన ప్రగతిని సమగ్రంగా సమీక్షించారు.మాల్దీవ్స్ ప్రెసిడెంట్ గౌరవనీయ మొహమ్మద్ ముయిజ్జుతో సంయుక్త పత్రికా ప్రకటన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 07th, 12:25 pm
భారత్-మాల్దీవ్స్ సంబంధాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. ముఖ్యంగా ఈ రెండూ అత్యంత సన్నిహిత, ఇరుగుపొరుగు మిత్ర దేశాలు. అలాగే మేము అనుసరిస్తున్న పొరుగుకు ప్రాధాన్యం విధానంతో పాటు మా దార్శనిక సాగర్ కార్యక్రమంలో మాల్దీవ్స్‌కు కీలక స్థానముంది. మాల్దీవ్స్ విషయంలో ఎల్లప్పుడూ మొట్టమొదట స్పందించి, తనవంతు బాధ్యత నిర్వర్తించేది భారతదేశమే. నిత్యావసరాల కొరత తీర్చడంలోనైనా, ప్రకృతి విపత్తుల సమయంలో తాగునీటి సరఫరాలోనైనా, కోవిడ్ సంక్షోభం వేళ టీకాలు అందించడంలోనైనా పొరుగు దేశం విషయంలో భారత్ సదా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉంది. ఇక ఇవాళ పరస్పర సహకారానికి వ్యూహాత్మక దిశను నిర్దేశించడం కోసం ‘‘సమగ్ర ఆర్థిక-సముద్ర భద్రత భాగస్వామ్యం’’ విధానాన్ని ఆమోదించాం.మాల్దీవుల అధ్యక్షుడితో ప్రధాని సమావేశం
December 01st, 09:35 pm
యూఏఈ లో డిసెంబర్ 1న జరిగిన కాప్-28 సమ్మిట్ సందర్భంగా మాల్దీవుల రిపబ్లిక్ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.