మహర్షి దయానంద్ సరస్వతికి నివాళులర్పించిన ప్రధానమంత్రి

February 12th, 10:17 am

నేడు మహర్షి దయానంద్ సరస్వతి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. విద్యను ప్రోత్సహించటంలో మాత్రమే కాదు.. భారత సంస్కృత, సంప్రదాయాలను సుసంపన్నం చేయటంలో ఆయన అసమాన సేవలందించారని శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. సామాజిక సంస్కరణల కోసం ఆయన చేసిన ప్రయత్నాలు దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకయం అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

వేద జ్ఞానాన్ని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

February 12th, 08:45 am

అజరామరమైన వేద జ్ఞానాన్ని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

న్యూఢిల్లీలో అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళన్ 2025లో ప్రధాని ప్రసంగం

October 31st, 06:08 pm

న్యూఢిల్లీలోని రోహిణిలో ఈ రోజు జరిగిన అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళనం 2025ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ.. ఇంతకుముందు విన్న మంత్రాల శక్తిని అందరూ ఇంకా అనుభూతి చెందుతున్నారన్నారు. తానెప్పుడు ఈ సమావేశాలకు వచ్చినా.. దివ్యమైన, అసాధారణ అనుభవం కలుగుతుందని వ్యాఖ్యానించారు. స్వామి దయానందుడి ఆశీస్సుల వల్లే ఈ భావన ఎల్లవేళలా సాధ్యమవుతోందన్నారు. స్వామి దయానందుడి ఆదర్శాలు పూజనీయమైనవన్నారు. అక్కడున్న చింతనాపరులందరితో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ అనుబంధం వల్లే వారిలో ఒకరిగా ఉండే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కుతోందన్నారు. వారిని కలిసి, మాట్లాడినప్పుడల్లా.. ఏదో తెలియని శక్తి ఆవహిస్తుందని, తనలో ప్రేరణ లభిస్తోందని వ్యాఖ్యానించారు.

మహర్షి దయానంద సరస్వతి జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధానమంత్రి

February 12th, 02:24 pm

సుప్రసిద్ధ ఆలోచనాపరుడు, సంఘ సంస్కర్త, జాతీయవాదీ అయిన మహర్షి దయానంద సరస్వతి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.