గుజరాత్‌లోని పోరుబందరులో మాధవపూర్ మేళా సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

March 29th, 10:23 am

గుజరాత్‌లోని పోరుబందరులో జరుగుతున్న మాధవ్‌పూర్ మేళా సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సాహభరితమైన వేడుక మన ఘనమైన సంస్కృతిని చాటిచెబుతుందనీ... గుజరాత్, ఈశాన్య రాష్ట్రాల మధ్య గల శాశ్వత సాంస్కృతిక బంధాన్ని మరింత బలపరుస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, ఈ పండుగ విభిన్న సంప్రదాయాలను ఏకతాటిపైకి తీసుకువస్తుంది. ప్రజలందరూ ఈ మేళాను సందర్శించాలని నేను పిలుపునిస్తున్నాను! అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

మనవైన విశిష్ట సాంస్కృతిక అంశాలను ప్రదర్శించే ఉజ్వల వేడుకలకు నిలయం భారతదేశం: ప్రధానమంత్రి

April 01st, 09:19 am

మన విశిష్ట సాంస్కృతిక అంశాలను ప్రదర్శించే అనేక ఉజ్వల వేడుకలకు భారతదేశం నిలయమని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు మాధవ్‌పూర్ మేళాను గుజరాత్-ఈశాన్య ప్రాంతాలను కూడా కలిపే అసాధారణ వేడుకగా శ్రీ మోదీ పేర్కొన్నారు.

అక్టోబర్ 19వ, 20వ తేదీల లో గుజరాత్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి

October 18th, 11:25 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 19వ, 20వ తేదీల లో గుజరాత్ ను సందర్శించి 15,670 కోట్ల రూపాయలు విలువ కలిగిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఆ పథకాలను దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు.

భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం... చైతన్యాలను ప్రతిబింబించే విశిష్ట వేడుక మాధవపూర్ మేళా: ప్రధానమంత్రి

April 10th, 01:20 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమ ప్రసంగంలో- మాధవ్‌పూర్‌ మేళాను భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం, చైతన్యాలను ప్రతిబింబించే ఒక విశిష్ట వేడుకగా అభివర్ణించిన విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు.