మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

March 30th, 11:53 am

గుడి పడ్వా, నూతన సంవత్సరారంభం సందర్భంగా నేను మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అత్యంత గౌరవనీయ సర్‌ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ , స్వామి గోవింద్ గిరి జీ మహారాజ్, స్వామి అవధేశానంద్ గిరి జీ మహారాజ్, ప్రజాదరణ పొందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ , నా మంత్రివర్గ సహచరులు నితిన్ గడ్కరీ , డాక్టర్ అవినాష్ చంద్ర అగ్నిహోత్రి, ఇతర గౌరవ ప్రముఖులు, ఇంకా ఇక్కడ హాజరైన సీనియర్ సహచరులారా! ఈరోజు రాష్ట్ర యజ్ఞం అనే పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. ఈరోజు చైత్ర శుక్ల ప్రతిపాద ఎంతో ప్రత్యేకమైన రోజు. పవిత్ర నవరాత్రుల ఉత్సవాలు కూడా కూడా ఈరోజు ప్రారంభమవుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గుడి పడ్వా, ఉగాది, నవరే పండుగలను కూడా ఈ రోజు జరుపుకుంటున్నారు. అలాగే ఈరోజు ఝులేలాల్ జీ, గురు అంగద్ దేవ్ జీ జయంతి కూడా. ఇవే కాకుండా, ఈ రోజు మన స్ఫూర్తి ప్రదాత, అత్యంత గౌరవనీయ డాక్టర్ సాహెబ్ జయంతి సందర్భం కూడా. అలాగే, ఈ ఏడాది రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఘనమైన 100 ఏళ్ల ప్రయాణం కూడా పూర్తవుతోంది. ఈ సందర్భంలో, ఈ రోజు స్మృతి మందిరాన్ని సందర్శించి, గౌరవనీయ డాక్టర్ సాహెబ్, గౌరవనీయ గురూజీకి నివాళులర్పించే అవకాశం నాకు లభించింది.

మహారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంట‌ర్‌కు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి దేశంలోని పౌరులందరికీ మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడమే మా ప్రాధాన్యత: ప్రధాని

March 30th, 11:52 am

మహారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం కేంద్రానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్ర నవరాత్రి ఉత్సవ ప్రారంభాన్ని తెలిపే చైత్ర శుక్ల ప్రతిపాద ప్రాముఖ్యతను వివరించారు. దేశవ్యాప్తంగా నేడు గుడి పడ్వా, ఉగాది, నవరేహ్ వంటి పండుగలు జరుగుతున్నాయన్న ఆయన.. భగవాన్ ఝులేలాల్, గురు అంగద్ దేవ్ జయంతి అయిన ఈ రోజు ప్రాముఖ్యతను ప్రధానంగా తెలియజేశారు. స్ఫూర్తిదాయకమైన డాక్టర్ కేబీ హెడ్గేవార్ జయంతి ఇవాళ అని గుర్తు చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మహోన్నత ప్రయాణం శతాబ్ది కాలాన్ని పూర్తి చేసుకున్నట్లు గుర్తు చేశారు. ఈ ముఖ్యమైన రోజున డాక్టర్ హెడ్గేవార్, శ్రీ గోల్వాల్కర్ గురూజీలకు నివాళులు అర్పించటానికి స్మృతి మందిరాన్ని సందర్శించడం ఎంతో గౌరవంతో కూడుకున్న విషయమని అన్నారు.

మార్చి 30న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రధానమంత్రి పర్యటన

March 28th, 02:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 30న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో పర్యటించనున్నారు. ఆయన నాగపూర్‌ వెళ్లి ఉదయం సుమారు 9 గంటలకు స్మృతి మందిర్‌లో దర్శన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత దీక్షాభూమిని సందర్శిస్తారు.