అస్సాంలోని కోక్రాఝర్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
March 13th, 03:00 pm
వాతావరణం అనుకూలించని కారణంగా నేను కోక్రాఝర్ రాలేకపోయాను. మీ అందరికీ నా క్షమాపణలు. గువాహటి నుంచి మాత్రమే మీతో మాట్లాడటానికి సాధ్యమవుతోంది. మీ వద్దకు రావడానికి నేను ఢిల్లీ నుంచి బయలుదేరాను. కానీ గువాహటిలో దిగాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచే మిమ్మల్ని చూస్తున్నాను. మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ నాతో ఉన్న అస్సాం ముఖ్యమంత్రి, సోదరుడు హిమంత బిశ్వ శర్మ, కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రి సర్బానంద సోనోవాల్, బోడోల్యాండ్ ప్రాంత కౌన్సిల్ ప్రధాన కార్యనిర్వాహక సభ్యుడు హగ్రామా మోహిలారీ, అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, అస్సాం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీటీసీ ప్రతినిధులందరూ, సొసైటీలోని సీనియర్ సభ్యులు, నా ప్రియమైన సోదరీసోదరులారా!అస్సాంలోని కోక్రాఝర్‌లో రూ. 4,750 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
March 13th, 02:30 pm
అస్సాంలోని కోక్రాఝర్‌లో వివిధ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల తాను స్వయంగా కోక్రాఝర్‌కు రాలేకపోయానన్న ఆయన.. పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చిన ప్రజలు పెద్దమనసుతో తనను మన్నించాలని కోరారు. గువహటి నుంచి తాను ప్రసంగిస్తున్నానని ప్రధానమంత్రి చెప్పారు. ఇక్కడి భూమి పుత్రులైన బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ, రూపనాథ్ బ్రహ్మ వంటి మహనీయులను స్మరిస్తూ, వారికి నివాళి అర్పించారు. ఇక్కడికి తరలివచ్చిన అశేష జనవాహిని తన బాధ్యతను మరింత పెంచిందని.. అంకితభావంతో కూడిన సేవ, ఈ ప్రాంత అభివృద్ధి ద్వారా ఆ రుణం తీర్చుకుంటానని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ‘‘మీకే సేవలందించడం ద్వారా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకునేందుకు నేనెప్పుడూ కృషి చేస్తాను’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.మా కామాఖ్య కారిడోర్ ఒక ప్రతిష్టాత్మకకార్యక్రమం అవుతుంది: ప్రధాన మంత్రి
April 19th, 03:39 pm
కాశీ విశ్వనాథ్ ధామ్ మరియు శ్రీ మాహాకాళ్ మహాలోక్ కారిడోర్ ల మాదిరిగానే మా కామాఖ్య కారిడోర్ కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం కాగలదన్న ఆశ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.