దేవీ ఆరాధనతో ప్రాప్తించే దివ్య వాతావరణాన్నీ, ఆధ్యాత్మిక ఆనందాన్నీ ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
March 23rd, 08:50 am
నవ రాత్రులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యం విషయంలో స్వీయ ఆలోచనల్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. దేవీ మాత ఆరాధనతో అపార శాంతీ, శక్తీ లభిస్తాయని స్పష్టం చేశారు. దేవిని స్తుతించే ఒక భక్తి గీతాన్ని శ్రీ మోదీ పంచుకున్నారు.అంబ మాత పట్ల భక్తితో నిండిన దివ్య వాతావరణం, నవరాత్రి ఆధ్యాత్మిక సారం.. వీటిని ప్రస్తావించిన ప్రధానమంత్రి
March 20th, 09:48 am
నవరాత్రుల ఆధ్యాత్మిక వాతావరణానికి సంబంధించిన తన అభిప్రాయాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. అంబ మాత పట్ల భక్తి ప్రపత్తులు మదిని అనంత శాంతితో, ఉత్సాహంతో నింపేసే తీరును ఆయన ప్రస్తావించారు. అంబ మాతను స్తుతిస్తున్న ఒక భక్తి గీతాన్ని శ్రీ మోదీ ఈ సందర్భంగా పంచుకున్నారు.