ఎల్‌వీఎం3-ఎం6 ద్వారా బ్లూబర్డ్ బ్లాక్-2ను విజయవంతంగా ప్రయోగించిన అంతరిక్ష శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను అభినందించిన ప్రధాని

December 24th, 10:04 am

ఎల్‌వీఎం3-ఎం6 వాహక నౌక ద్వారా అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన అంతరిక్ష శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. భారత భూభాగం అత్యంత బరువైన ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశ పెట్టడం ఇదే తొలిసారి. ఇది భారత అంతరిక్ష ప్రయాణంలో గర్వించదగిన విజయమని, ఆత్మనిర్భర భారత్ దిశగా చేస్తున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.