ఇమిగ్రేషన్, వీసా, ఫారినర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ (ఐవీఎఫ్ఆర్టీ) పథకానికి క్యాబినెట్ ఆమోదం
March 25th, 04:12 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇమ్మిగ్రేషన్, వీసా, ఫారినర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ (ఐవీఎఫ్ఆర్టీ) పథకాన్ని 2026 మార్చి 31 తర్వాత కూడా కొనసాగించేందుకు ఆమోదించారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు అయిదేళ్ల కాలానికి రూ.1800 కోట్ల బడ్జెట్ అంచనాతో దీనికి ఆమోద ముద్ర వేశారు.