ఐబీఎస్ఏ నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
November 23rd, 12:45 pm
ఐబీఎస్ఏ కేవలం మూడు దేశాల వేదిక మాత్రమే కాదు. ఇది మూడు ఖండాలను, మూడు ప్రధాన ప్రజాస్వామ్య శక్తులను, మూడు ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థలను కలిపే ఒక కీలకమైన వేదిక. ఇది మన వైవిధ్యం, భాగస్వామ్య విలువలు ఉమ్మడి ఆకాంక్షలలో పాతుకుపోయిన లోతయిన, శాశ్వతమైన భాగస్వామ్యం కూడా.జోహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఐబీఎస్‌ఏ నేతల సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి
November 23rd, 12:30 pm
ఈ సమావేశం సరైన సమయంలో నిర్వహిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది ఆఫ్రికా గడ్డపై జరిగిన తొలి జీ20 శిఖరాగ్ర సమావేశ సందర్భంలోనే జరగడం మంచి విషయమన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు వరుసగా నాలుగు జీ20 సమావేశాలకు అధ్యక్షత వహించడం దీనికి ఒక కారణమని ప్రధానమంత్రి తెలిపారు. వీటిలో చివరి మూడు జీ20 సమావేశాలను ఐబీఎస్ఏ సభ్య దేశాలే నిర్వహించాయని గుర్తుచేశారు. ఫలితంగా మానవ కేంద్రిత అభివృద్ధి, బహుపాక్షిక సంస్కరణలు, సుస్థిర వృద్ధిపై దృష్టి సారిస్తూ అనేక ముఖ్య కార్యక్రమాలు చేపట్టామని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన బ్రెజిల్ అధ్యక్షుడు గత నెలలో చేపట్టిన బ్రెజిల్ పర్యటనను గుర్తు చేసుకున్న మోదీ
August 07th, 09:27 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ఈ రోజు ఫోన్ చేసి మాట్లాడారు. గత నెలలో జరిగిన తన బ్రెజిల్ పర్యటనను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, పౌర సంబంధాల విషయంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అంశంపై ఈ పర్యటనలోనే ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది.బ్రెజిల్ అధ్యక్షునితో ప్రధానమంత్రి సమావేశం
July 09th, 06:02 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రెజిలియాలో అధికారిక పర్యటన చేపడుతున్నారు. బ్రెజీలియాలోని అల్వరాడో ప్యాలెస్‌లో బ్రెజిల్ అధ్యక్షుడు గౌరవ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వాతో ఈ రోజు సమావేశమయ్యారు. అధ్యక్షుడు లూలా ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికారు.సంయుక్త ప్రకటన: ఉన్నత లక్ష్యాలు కలిగిన రెండు గొప్ప దేశాలు.. భారత్, బ్రెజిల్
July 09th, 05:55 am
బ్రెజిల్ అధ్యక్షుడు గౌరవ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ఆహ్వానాన్ని అందుకొని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం (2025 జులై 8న) బ్రెజిల్‌కు ఆధికారిక పర్యటనకు విచ్చేశారు. ఇది దాదాపు ఎనిమిది దశాబ్దాల నుంచి బ్రెజిల్ - ఇండియాల మధ్య మైత్రి, పరస్పర విశ్వాస భావనలను ప్రతిబింబిస్తోంది. ఈ స్నేహ బంధాన్ని 2006లో వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఉన్నతీకరించారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి బ్రెజిల్‌లో అత్యున్నత జాతీయ పురస్కారం ‘‘ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్’’ ప్రదానం
July 09th, 12:58 am
బ్రెజిల్‌లో అత్యున్నత జాతీయ పురస్కారం అయిన ‘‘ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్’’ అవార్డుతో ఆ దేశ అధ్యక్షుడు గౌరవ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ఈ రోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని సత్కరించారు.బ్రెజిల్ అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటనలో ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం
July 08th, 08:30 pm
రియో, బ్రెజీలియాలో ఆత్మీయ స్వాగతం పలికిన నా స్నేహితుడు, అధ్యక్షుడు లూలాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమెజాన్ ప్రకృతి సౌందర్యం, మీ ఆత్మీయత మమ్మల్ని మంత్రముగ్ధులను చేశాయి.బ్రెజిల్‌లోని బ్రెజిలియాకు చేరుకున్న ప్రధాని మోదీ
July 08th, 02:55 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం రాష్ట్ర పర్యటన కోసం బ్రెజిలియాకు చేరుకున్నారు. భారతదేశం-బ్రెజిల్ సంబంధాల యొక్క వివిధ అంశాలపై అధ్యక్షుడు లూలాతో ఆయన వివరణాత్మక చర్చలు జరుపుతారు.శాంతి, భద్రతలపై బ్రిక్స్ కార్యక్రమం.. ప్రధానమంత్రి ప్రకటన పాఠం
July 06th, 11:07 pm
ప్రపంచంలో శాంతి, భద్రతలు కేవలం ఆదర్శాలు కావు, అంతకంటే అవి మన ఉమ్మడి ప్రయోజనాలతో పాటు మన అందరి భవిష్యత్తుకు బలమైన పునాదులు. మానవ జాతి పురోగతి శాంతియుత, సురక్షభరిత వాతావరణంలో మాత్రమే సాధ్యపడుతుంది. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడంలో బ్రిక్స్‌ది చాలా ముఖ్య పాత్ర. మనమంతా కలిసికట్టుగా, మన సవాళ్లను సమష్టిగా పరిష్కరించుకోవాల్సిన తరుణమిది. మనం తప్పక ఐకమత్యంతో ముందడుగు వేయాలి.బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రకటనకు తెలుగు అనువాదం: అంతర్జాతీయ పాలనలో సంస్కరణ
July 06th, 09:41 pm
17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును అద్భుతంగా నిర్వహిస్తున్న అధ్యక్షుడు లూలాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రెజిల్ నాయకత్వంలో మన బ్రిక్స్ సహకారం కొత్త ఉత్సాహాన్ని, చైతన్యాన్ని సంతరించుకుంది. మనలో నిండిన ఈ శక్తి ఎస్‌ప్రెసో కాదు.. డబుల్ ఎస్‌ప్రెసో షాట్ లాంటిది. ఈ విషయంలో నేను అధ్యక్షుడు లూలా దార్శనికతను, ఆయన అచంచలమైన విశ్వాసాన్ని అభినందిస్తున్నాను. బ్రిక్స్ కుటుంబంలో ఇండోనేషియా చేరిన నేపథ్యంలో నా స్నేహితుడు, ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవోకు భారత్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.బహుపాక్షిక సంబంధాలు, ఆర్థిక-ద్రవ్య సహాయ విషయాల పటిష్ఠీకరణతో పాటు కృత్రిమ మేధపై బ్రిక్స్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రకటన పాఠం..
July 06th, 09:40 pm
బ్రిక్స్ కుటుంబానికి చెందిన మిత్ర దేశాల నేతలతో కలసి ఈ సమావేశంలో పాలుపంచుకొంటున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. లాటిన్ అమెరికా, ఆఫ్రికాలతో పాటు ఆసియాలోని మిత్రదేశాల నేతలతో నా ఆలోచనలను పంచుకొనేందుకు బ్రిక్స్ అవుట్‌రీచ్ సమ్మిట్‌లో ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు అధ్యక్షుడు శ్రీ లూలాకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని
July 06th, 09:39 pm
బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. నిన్న ప్రారంభమైన ఈ సదస్సు ఈరోజు కూడా జరుగుతోంది. అంతర్జాతీయ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్ వాణిని విస్తరించడం, శాంతి భద్రతలు, బహుపాక్షిక విధానాన్ని బలోపేతం చేయడం, అభివృద్ధి సమస్యలు, కృత్రిమ మేధతో సహా బ్రిక్స్ అజెండాకు సంబంధించిన వివిధ అంశాలపై నాయకులు ఫలప్రదమైన చర్చలు జరిపారు. సదస్సును విజయవంతంగా నిర్వహించడంతో పాటు ఆత్మీయ ఆతిథ్యమిచ్చిన బ్రెజిల్ అధ్యక్షునికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి వీడ్కోలు సందేశం
July 02nd, 07:34 am
జూలై 6,7 తేదీల్లో రియో డి జనీరోలో ఏర్పాటైన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి నేను హాజరవుతాను. ఆర్థికంగా పైకెదుగుతున్న దేశాల మధ్య సహకారం పెంపొందించే వేదికగా బ్రిక్స్ పాత్రను గుర్తెరిగిన భారత్, వ్యవస్థాపక దేశంగా తన నిబద్ధతను మరోసారి చాటుతోంది. శాంతి, న్యాయం, ప్రజాస్వామ్య విలువలు నెలకొన్న నిష్పక్షపాత, సమాన అధికారాలు గల ప్రపంచ నిర్మాణం ఆశయంగా సభ్య దేశాలు కృషిని కొనసాగిస్తాయి. ఇక, సమావేశాల నేపథ్యంలో నేను పలు ప్రపంచ నేతలతో సమావేశమవుతాను. ఆరు దశాబ్దాల వ్యవధి తరువాత భారత ప్రధాని చేపట్టే ద్వైపాక్షిక అధికారిక పర్యటనలో భాగంగా నేను బ్రెస్సీలియా వెళ్ళనున్నాను. బ్రెజిల్ దేశంతో గల సన్నిహిత సంబంధాల బలోపేతం కోసం నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను. గ్లోబల్ సౌత్ ప్రాధాన్యాలను ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలను నా మిత్రుడు, అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వాతో చర్చిస్తాను.ఘనా, ట్రినిడాడ్ - టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించనున్న ప్రధానమంత్రి (జూలై 02 - 09)
June 27th, 10:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటించనున్నారు. ఘనాలో ఇదే ఆయనకు తొలి ద్వైపాక్షిక పర్యటన. మూడు దశాబ్దాల అనంతరం భారత ప్రధానమంత్రి ఘనాలో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ పర్యటనలో భాగంగా బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమీక్షించడం.. ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో సహకారం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం, అభివృద్ధిలో సహకారాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై ఘనా అధ్యక్షుడితో ప్రధానమంత్రి చర్చించనున్నారు. ఈ పర్యటన.. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచడం, ఈసీవోడబ్ల్యూఏఎస్ (ఎకనమిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్), ఆఫ్రికన్ యూనియన్‌లతో భారత్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం పట్ల ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.జీ-7 సమావేశాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాధ్యక్షులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
June 18th, 03:05 pm
జూన్ 17న కెనడా కననాస్కిస్ లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలతో సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామాఫోజా, బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లులా డిసిల్వాతో భేటీ కావడమే కాకుండా, సుహృద్భావపూర్వక వాతావరణంలో అర్ధవంతంగా చర్చలు జరిగాయి.శస్త్రచికిత్స చేయించుకొన్న బ్రెజిల్ అధ్యక్షుడు త్వరగా కోలుకుని, ఆరోగ్యవంతుడవ్వాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
December 12th, 09:50 pm
ఇటీవల శస్త్రచికిత్స చేయించుకొన్న బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూలా డా సిల్వా త్వరగా కోలుకోవాలని, చక్కని ఆరోగ్యం కలగాలంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.బ్రెజిల్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ
November 20th, 08:05 pm
రియో డి జనీరో లో జరుగుతున్న జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాకియో లూలా ద సిల్వా తో సమావేశమయ్యారు. శ్రీ లూలా ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని, జి-20, ఐబీఎస్ఏ (భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా కూటమి) అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలియజేశారు. పేదరికం, క్షుద్బాధల నిర్మూలన కోసం ప్రపంచ స్థాయి సహకార సమితిని ప్రారంభించాలన్న శ్రీ లూలా యోచన పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీ మోదీ, సంస్థకు భారత్ సంపూర్ణ మద్దతునిస్తుందని వెల్లడించారు. మూడు దేశాల జి-20 ప్రత్యేక బృందం (ట్రోయికా) సభ్య దేశంగా బ్రెజిల్ జి-20 ఎజెండాకు శ్రీ మోదీ సంపూర్ణ మద్దతును తెలిపారు. జి-20 కార్యాచరణ పత్రంలో సుస్థిరాభివృద్ధి, ప్రపంచ పాలనలో సంస్కరణలు వంటి లక్ష్యాలను పేర్కొనడం సహా అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకు ప్రాముఖ్యాన్నివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వచ్చే యేడాది బ్రెజిల్ చేపట్టనున్న ‘బ్రిక్స్’ సదస్సు, ‘కాప్-30’ అధ్యక్ష బాధ్యతలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ మోదీ, బ్రెజిల్ కు భారత్ సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.‘‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’’పై జి20 సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగం
November 18th, 08:00 pm
నా ప్రసంగాన్ని మొదలుపెట్టడాని కన్నా ముందు... జి20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి గొప్ప ఏర్పాట్లను చేసినందుకు, అలాగే జి20 కి అధ్యక్ష బాధ్యతలను నిర్వహించడంలో సాఫల్యాన్ని సాధించినందుకు అధ్యక్షుడు శ్రీ లూలా కు నేను అభినందనలు తెలియజేయదలచుకొన్నాను.‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’ అనే అంశాలు ప్రధానంగా జి 20 కార్యక్రమం నిర్వహణ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 18th, 07:55 pm
‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’ అంశాలు ప్రధానంగా ఈ రోజున నిర్వహించిన జి 20 శిఖరాగ్ర సమావేశ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యాన్ని ఇస్తున్నందుకు, అతిథి మర్యాదలు చక్కని పద్ధతిలో చేస్తున్నందుకు బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిస్ ఇనాషియో లూలా డిసిల్వా కు ప్రధాని ధన్యవాదాలు తెలియజేశారు. బ్రెజిల్ లో నిర్వహిస్తున్న జి 20 కార్యక్రమాలు స్థిరాభివృద్ధి లక్ష్యాలపై దృష్టి సారిస్తుండడం ప్రశంసనీయమని ప్రధాని అన్నారు. ఈ వైఖరి అభివృద్ధి చెందుతున్న దేశాలకున్న ఆందోళనలపై శ్రద్ధ వహిస్తూ, న్యూ ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ చేసిన నిర్ణయాలను మరింత ముందుకు తీసుకుపోతోందని ఆయన అన్నారు. జి 20 కూటమికి భారతదేశం అధ్యక్షత వహించిన కాలంలో, ‘‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’’ అంటూ ఇచ్చిన పిలుపు రియో చర్చల్లో కనిపిస్తోందని ఆయన అన్నారు.అయిదు రోజుల నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి వీడ్కోలు సందేశం
November 16th, 12:45 pm
మిత్రులారా, అయిదు రోజుల నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల పర్యటనకు బయలుదేరబోతున్నాను. అధ్యక్షుడు శ్రీ బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు, పశ్చిమాఫ్రికా ప్రాంతంలో మనకు మిత్రదేశమైన నైజీరియాలో నేను తొలిసారిగా పర్యటించబోతున్నాను. ప్రజాస్వామ్యం, బహుళవాదాల పట్ల ఇరుదేశాలకూ గల నిబద్ధత పునాదిగా ఏర్పడ్డ ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం, ఈ పర్యటన సందర్భంగా మరింత పటిష్ఠమవగలదు. ఇక ఎంతో అభిమానంతో నాకు హిందీలో ఆహ్వాన సందేశాలు పంపిన నైజీరియా మిత్రులనూ, స్థానిక భారతీయులనూ కలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.