భగవాన్ మహావీర్ సందేశాల్లో అద్భుతమైన స్ఫూర్తి ఉందటూ.. సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
March 31st, 10:41 am
సత్యం, సామరస్యం, సత్ర్పవర్తన, సమానత్వంతో కూడిన భగవాన్ మహావీర్ సందేశాలు అద్భుతమైన స్ఫూర్తిని కలిగిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మహావీర్ మహోన్నత ఆలోచనలు మానవాళికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తాయి అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి వేడుక సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 28th, 11:15 am
పరమ శ్రాద్ధేయ ఆచార్య శ్రీ ప్రజ్ఞా సాగర్ మహరాజ్, శ్రావణబెళగొళ స్వామి శ్రీ చారుకీర్తి, మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీ శ్రీ నవీన్ జైన్, భగవాన్ మహావీర్ అహింసా భారతి ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ ప్రియాంక్ జైన్, కార్యదర్శి శ్రీ మమతా జైన్, ట్రస్టీ పీయూష్ జైన్, ఇతర విశిష్ట ప్రముఖులు, గౌరవనీయ సాధువులు, సోదరీసోదరులారా... జై జినేంద్ర!ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహరాజ్ శత జయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి ప్రసంగం
June 28th, 11:01 am
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈరోజు జరిగిన ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారత ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక చిరస్మరణీయమైన సందర్భాన్ని నేడు మనమంతా చూస్తున్నాం.. ఇది ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ శతాబ్ది ఉత్సవాల పవిత్రతను స్పష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు. పూజ్య ఆచార్య అమర స్ఫూర్తితో నిండిన ఈ కార్యక్రమం అపూర్వమైన స్ఫూర్తిదాయక వాతావరణాన్ని కల్పిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి.. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం దక్కడం తనకూ సంతోషం కలిగించిందన్నారు.భగవాన్ మహావీర్ ఆదర్శాల విస్తృత ప్రభావాన్ని మహావీర్ జయంతి సందర్భంగా స్మరించుకొన్న ప్రధానమంత్రి
April 10th, 03:30 pm
మహావీర్ జయంతి ఈ రోజు. కలకాలం ప్రేరణాత్మకంగా నిలిచే భగవాన్ మహావీర్ బోధనలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకొన్నారు. ఆయన ప్రబోధాలు తన జీవనాన్ని కూడా విస్తారంగా ప్రభావితం చేశాయని ప్రధాని అన్నారు.నవ్కార్ మహామంత్ర దివస్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 09th, 08:15 am
మనస్సు ప్రశాంతంగా ఉంది. మనస్సు స్థిరంగా ఉంది. శాంతి మాత్రమే ఉంది. అద్భుతమైన అనుభూతి. మాటలకు చాలనిది - ఆలోచనలకు అతీతమైనది - నవ్కార్ మహామంత్రం ఇంకా మనస్సులో మార్మోగుతోంది. నమో అరిహంతాణం. నమో సిద్ధాణం. నమో ఆయర్యాణం. నమో ఉవజ్ఝాయాణం. నమో లోయే సవ్వసాహుణం. ఒకే స్వరం, ఒకే ప్రవాహం, ఒకే శక్తి, ఎలాటి హెచ్చుతగ్గులూ లేవు. కేవలం స్థిరత్వం మాత్రమే. అంతా సమభావమే. అలాంటి చైతన్యం, ఒకే విధమైన లయ, అంతర్గతంగా ఒకే విధమైన కాంతి. నవ్కార్ మహామంత్రం ఆధ్యాత్మిక శక్తిని నేను ఇప్పటికీ అనుభూతి చెందుతున్నాను. కొన్నేళ్ల క్రితం బెంగళూరులో ఇలాంటి సామూహిక మంత్రోచ్ఛారణకు సాక్షిగా ఉన్నాను. ఈ రోజు తిరిగి నాకు అదే స్థాయిలో అదే అనుభూతి కలిగింది. ఈ సారి లక్షలాది పవిత్రాత్మలు ఒకే చైతన్యంతో కలిశాయి. ఒకే మాటలు కలసి పలికాయి. ఒకే శక్తి కలసి మేల్కొంది. భారత్‌లోనే కాదు - విదేశాల్లోనూ కూడా. ఇది నిజంగా అపూర్వమైన సంఘటన.నవ్‌కార్ మహామంత్ర దివస్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 09th, 07:47 am
న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో ఈరోజు ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవ్ కర్ మహామంత్ర దివస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మానసిక శాంతిని, స్థిరచిత్తాన్ని అందించే సామర్థ్యం గల నవ్ కర్ మంత్రం.. దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తుందని అన్నారు. మంత్ర పఠనం వల్ల సిద్ధించే నిర్వికార స్థితి మాటలకు, ఆలోచనలకు అతీతమైనదని, చేతనలో, అంతరాత్మలో ఆ భావన స్థిర నివాసం ఏర్పరుచుకుంటుందని అన్నారు. పవిత్రమైన నవ్‌కార్ మంత్రంలోని పంక్తులను చదివి వినిపించిన శ్రీ మోదీ- సంయమనం, స్థితప్రజ్ఞత, మనసు-అంతరాత్మల మధ్య సమన్వయం సాధించే నిరంతరాయ శక్తిప్రవాహంగా మంత్రశక్తిని అభివర్ణించారు. తన సొంత ఆధ్యాత్మిక అనుభూతిని గురించి చెబుతూ, నవ్ కర్ మంత్రం ఇప్పటికీ తన అంతరాళాల్లో ప్రభావాన్ని చూపుతూనే ఉందన్నారు. కొన్నేళ్ళ కిందట బెంగుళూరులో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన సామూహిక మంత్ర పఠన ప్రభావం ఇప్పటికీ తనని వీడి పోలేదన్నారు. దేశ విదేశాల్లోని పవిత్ర హృదయాలు ఒకే చైతన్యంతో ఒక సామూహిక అనుభవంలో భాగమవడం తిరుగులేని అనుభూతి అని సంతోషం వెలిబుచ్చారు. ఈ సామూహిక చర్య ద్వారా ఒకే లయలో ఒదిగే పంక్తుల పఠనం అసాధారమైన శక్తిని వెలువరించి మాటల్లో చెప్పలేని దివ్యానుభూతిని కలిగిస్తుందని శ్రీ మోదీ చెప్పారు.9/11 వంటి విషాదాలకు శాశ్వత పరిష్కారం ఉంటుంది, మానవతా విలువలతో మాత్రమే: ప్రధాని మోదీ
September 11th, 11:01 am
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్దార్ధమ్ భవన్ యొక్క లోకార్పన్ మరియు సర్దార్ధమ్ ఫేజ్ - II కన్యా ఛత్రాలయ భూమి పూజను నిర్వహించారు. ఈ రోజు ప్రారంభిస్తున్న హాస్టల్ సౌకర్యం చాలా మంది అమ్మాయిలు ముందుకు రావడానికి కూడా సహాయపడుతుందని ప్రధాన మంత్రి అన్నారు. అత్యాధునిక భవనం, బాలికల హాస్టల్ మరియు ఆధునిక గ్రంథాలయం యువతకు సాధికారతనిస్తాయని ఆయన అన్నారు.సర్దార్‌ధామ్ భవన్ లోక్ అర్పణ్ గావించిన ప్రధానమంత్రి, సర్ధార్‌ధామ్ -ఫేజ్ 2 కన్యాఛాత్రాలయకు భూమి పూజ
September 11th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సర్దార్‌ధామ్ భవన్ లోక్ అర్పణ్ కార్యక్రమం నిర్వహించారు. అలాగే సర్దార్ ధామ్ ఫేజ్ -2 కన్యా ఛాత్రాయలయకు ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవ్ సందర్భంగా సర్దార్ ధామ్ భవన్ ప్రారంభం అవుతుండడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. గణేశ్ చతుర్థి ఉత్సవాలు, రుషి పంచమి , క్షమవాణి దివస్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. సర్దార్‌ధామ్ ట్రస్ట్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ప్రధానమంత్రి అభినందించారు. మానవాళి సేవకు వారు అంకితభావంతో చేస్తున్న కృషిని ప్రధానమంత్రి అభినందించారు.పాటిదార్ సొసైటీ, పేదలు, ప్రత్యేకించ మహిళలకు సాధికారత కల్పించడంలో వారి శ్రద్ధను ప్రధాని ప్రశంసించారు.ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలి మరియు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
April 25th, 11:30 am
మిత్రులారా, గతంలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో నేను సుదీర్ఘంగా చర్చించాను. ఔషధ పరిశ్రమ కు చెందిన వారు, టీకా మందు తయారీదారులు, ఆక్సీజన్ ఉత్పత్తి లో పాల్గొన్న వ్యక్తులు, వైద్య రంగ పరిజ్ఞానం ఉన్న వారు వారి వారి ముఖ్యమైన సలహాల ను ప్రభుత్వానికి అందజేశారు. ఈ సమయం లో- ఈ యుద్ధం లో విజయాన్ని సాధించడానికి నిపుణులు, శాస్త్రవేత్తల సలహాల కు ప్రాధాన్యాన్ని ఇవ్వవలసివుంది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను ముందుకు తీసుకుపోవడం లో భారత ప్రభుత్వం పూర్తి శక్తి ని కూడదీసుకొంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటి బాధ్యతలను నెరవేర్చడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాయి.జైన ఆచార్య శ్రీ విజయ్ వల్లభ్ సురీశ్వర జీ మహారాజ్ 151 జయంతి ని పురస్కరించుకుని నవంబర్ 16న శాంతి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధానమంత్రి
November 14th, 06:06 pm
జైన ఆచార్య శ్రీ విజయ్ వల్లభ్ సురీశ్వర జీ మహారాజ్ 151 జయంతి ని పురస్కరించుకుని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, నవంబర్ 16 మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియోకాన్ఫరెన్సు ద్వారా శాంతి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.