అహ్మదాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాన్ని సందర్శించిన ప్రధాని మోదీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్

January 12th, 02:42 pm

అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీతీరంలో నిర్వహించిన రంగురంగుల మరియు ఉత్సాహభరితమైన అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవంలో ప్రధాని మోదీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్, హనుమంతుడు, త్రివర్ణ పతాకం మరియు మరిన్నింటిని ప్రదర్శించిన గాలిపటాలు ప్రదర్శనలో ఉన్నాయి. ఛాన్సలర్ మెర్జ్ గాలిపటం ఎగురవేయడానికి ప్రయత్నించినప్పుడు ప్రధాని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అనువాదం: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలతో ప్రధానమంత్రి సంభాషణ

November 06th, 10:15 am

ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఇవాళ దేవ్ దీపావళి.. గురుపూర్ణిమ కూడా. అందుకే ఇది నిజంగా చాలా ముఖ్యమైన రోజు.

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఛాంపియన్లతో ప్రధానమంత్రి సంభాషణ

November 06th, 10:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని లోకకల్యాణ్ మార్గ్, 7లో ఐసీసీ మహిళా ప్రపంచ కప్ 2025 ఛాంపియన్లతో నిన్న ముచ్చటించారు. 2025 నవంబర్ 2, ఆదివారం జరిగిన తుదిపోరులో దక్షిణాఫ్రికాపై భారత జట్టు విజయం సాధించింది. దేవ దీపావళి, గురు పర్వ్ రెండింటినీ నిర్వహించుకొనే ఈ రోజు చాలా ముఖ్యమైనదంటూ.. ఈ కార్యక్రమానికి హాజరైన వారికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.