దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 18th, 08:45 pm

నేనివాళ మీతో అత్యంత ముఖ్యమైన అంశంమీద.. ప్రధానంగా దేశంలోని తల్లులు, అక్కచెల్లెళ్లు, కుమార్తెలనుద్దేశించి మాట్లాడుతున్నాను! నారీశక్తి ప్రస్థానాన్ని కొందరు ఎలా అడ్డుకున్నారో ఈ రోజున భారత పౌరులందరూ ప్రత్యక్షంగా చూశారు. మేమెంతగా ప్రయత్నించినా వారి కలలను నిర్దాక్షిణ్యంగా అణచివేసే వారిని నిలువరించడంలో విజయం సాధించలేకపోయాం. నారీశక్తి వందన్ చట్టానికి సవరణపై ఆమోదం పొందలేకపోయాం! ఇందుకుగాను తల్లులు, అక్కచెల్లెళ్లు నన్ను క్షమించాలని కోరుతున్నాను.

జాతినుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 18th, 08:30 pm

భారతదేశంలోని మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలకు సంబంధించిన కీలకమైన అంశంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. మహిళల పురోగతికి ఆటంకం ఎదురవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ.. నారీ శక్తి వందన్ అధీనియం సవరణ ఆమోదం పొందలేకపోయిందనీ, ఇది మహిళల చట్టబద్ధమైన ఆకాంక్షలను విచ్ఛిన్నం చేసిందనీ అన్నారు. ‘‘ఈ దురదృష్టకర ఫలితం నేపథ్యంలో మాతృమూర్తులు, అక్కాచెళ్లెల్లు, కుమార్తెలందరినీ నేను క్షమాపణలు కోరుతున్నాను.’’

నారీశక్తి వందన్ అధినియం సవరణకు అనుకూలంగా ఓటు వేయాలని ఎంపీలను కోరిన ప్రధాని.. ఇదొక చరిత్రాత్మక అవకాశమన్న శ్రీ మోదీ

April 17th, 02:13 pm

నారీశక్తి వందన్ అధినియం సవరణపై ప్రస్తుతం పార్లమెంటులో చర్చ జరుగుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ అంశంపై నిన్న రాత్రి ఒంటి గంట వరకు సుదీర్ఘంగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని ఆయన తెలిపారు.

లోక్‌సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలు

April 16th, 03:30 pm

ఈ రోజు ఉదయాన్నే ఓ కీలక బిల్లుపై చర్చ మొదలైంది. నా సహ సభ్యులలో అనేకమంది ప్రధానాంశాలను ప్రస్తావించి, ఎన్నో వాస్తవాలను సభ ముందుంచారనడంలో సందేహం లేదు.

లోక్‌సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 16th, 03:07 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లోక్‌సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఉదయాన్నే కీలక బిల్లుపై చర్చ ప్రారంభాన్ని ఉటంకిస్తూ- అనేకమంది తన సహచరులు వాస్తవాల మేరకు తర్కబద్ధంగా కీలక సమస్యలను సమర్థంగా ప్రస్తావించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

న్యూఢిల్లీలో నారీశక్తి వందన్ సమ్మేళన్ సందర్భంగా ప్రధాని ప్రసంగం

April 13th, 11:15 am

వేదికనలంకరించిన ఢిల్లీ ప్రజల మన్ననలు పొందిన ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా గారూ, కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవిగారూ, శ్రీమతి సావిత్రీ ఠాకూర్ గారూ, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శ్రీమతి విజయా రహత్కర్ గారూ... అలాగే మీలో చాలా మంది సీనియర్లు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులు ఉన్నారు. మన లోక్‌సభ మాజీ స్పీకర్ గౌరవనీయులు మీరాకుమార్ గారూ మన మధ్యనే ఉన్నారు. ఆత్మీయులైన అక్కాచెల్లెళ్లంతా ఇక్కడున్నారు. ఈ వేళ బైశాఖీ పండుగ శోభతో దేశమంతా ఆనందంతో ఉంది. రేపు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నూతన సంవత్సరాన్ని కూడా జరుపుకొంటారు. అలాగే జలియన్‌వాలా బాగ్ మారణకాండలో అమరులైన యోధులకూ ఈ రోజు నేను నివాళి అర్పిస్తున్నాను.

‘నారీశక్తి వందన్ సమ్మేళన్’లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 13th, 11:00 am

విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు నిర్వహించిన నారీశక్తి వందన్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. బైశాఖీ శుభసందర్భంగా, దేశంలోని చాలాచోట్ల నూతన సంవత్సర వేడుకలను చేసుకోనున్న తరుణంలో ఆయన మాట్లాడారు. జలియన్‌వాలా బాగ్ మారణకాండ అమరులకు ప్రధానమంత్రి నివాళి అర్పించారు. ‘‘నారీ శక్తిపై భారత్ కృతనిశ్చయంతో ఉంది. 21వ శతాబ్దంలో అత్యంత కీలక నిర్ణయాల్లో ఇదొకటి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ఏప్రిల్ 13న 'నారీ శక్తి వందన్’ సమ్మేళనంలో ప్రసంగించనున్న పీఎం

April 12th, 04:43 pm

ఏప్రిల్ 13, 2026న ఉదయం 11 గంటల సమయంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జాతీయ స్థాయి 'నారీ శక్తి వందన్’ సమ్మేళనంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తారు.

Corruption and appeasement politics of LDF and UDF harm Keralam’s culture and faith: PM Modi in Thiruvalla

April 04th, 08:27 pm

Prime Minister Narendra Modi addressed a massive and enthusiastic gathering in Thiruvalla, energising supporters and expressing confidence that Keralam is on the cusp of a historic political transformation. Highlighting the unprecedented turnout, the Prime Minister said, “The massive presence of people here in Thiruvalla, your trust in the NDA, and the affection and confidence shown by mothers and sisters reflect the mood across Keralam. The state is heading towards a major transformation.”

PM Modi’s Thiruvalla rally signals a big political shift in Keralam

April 04th, 03:35 pm

Prime Minister Narendra Modi addressed a massive and enthusiastic gathering in Thiruvalla, energising supporters and expressing confidence that Keralam is on the cusp of a historic political transformation. Highlighting the unprecedented turnout, the Prime Minister said, “The massive presence of people here in Thiruvalla, your trust in the NDA, and the affection and confidence shown by mothers and sisters reflect the mood across Keralam. The state is heading towards a major transformation.”

నక్సలిజంపై భారత్ నిర్ణయాత్మక పోరాటంపై లోక్‌సభలో శ్రీ అమిత్ షా ప్రసంగాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని

March 30th, 09:53 pm

కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా చేసిన అద్భుత ప్రసంగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. ముఖ్యమైన వాస్తవాలు, చారిత్రక నేపథ్యం, గత దశాబ్ద కాలంగా ప్రభుత్వ కృషికి సంబంధించిన వివరాలన్నీ అందులో ఉన్నాయన్నారు. తిరోగమన మావోయిస్టు భావజాలం కొన్ని దశాబ్దాలుగా అనేక ప్రాంతాల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని, వామపక్ష అతివాదం ఎందరెందరో యువత భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీసిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

అనువాదం: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపై లోక్‌సభలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం

March 23rd, 02:15 pm

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, వాటి వల్ల భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై మాట్లాడటానికి నేను ఈ గౌరవనీయ సభ ముందుకు వచ్చాను. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. గత రెండు మూడు వారాలుగా శ్రీ జైశంకర్ గారు, శ్రీ హర్దీప్ పూరీ గారు ఈ విషయంపై అవసరమైన తాజా సమాచారాన్ని ఈ సభకు అందించారు. ఇప్పుడు ఈ సంక్షోభం మూడు వారాలకు పైగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవితాలపై దీని ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంక్షోభానికి త్వరితగతిన పరిష్కారం అన్వేషించాలని ప్రపంచమంతా అన్ని పక్షాలను కోరుతోంది.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై లోక్‌సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

March 23rd, 02:00 pm

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దాని వల్ల భారత్ ఎదుర్కొంటున్న విస్తృత సవాళ్లపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లోక్‌సభలో ప్రసంగించారు. ఈ సంక్షోభం మూడు వారాలకు పైగా కొనసాగుతోందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, మానవ జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందన్నారు. దీనిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరాన్ని ప్రధాని స్పష్టం చేశారు. ఈ పరిస్థితి తీవ్రత గురించి వివరిస్తూ.. ‘‘ఈ సంక్షోభాన్ని వీలైనంత తర్వగా పరిష్కరించాలని అన్ని పక్షాలకు ప్రపంచమంతా విజ్ఞప్తి చేస్తోంది’’ అన్నారు.

భారత్‌-ఇజ్రాయెల్‌ సంయుక్త ప్రకటన

February 26th, 07:44 pm

భారత్‌-ఇజ్రాయెల్ దేశాల మధ్యగల సాన్నిహిత్యం, సద్భావన, ప్రగాఢ వ్యూహాత్మక భాగస్వామ్యం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 25-26 తేదీల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఆయనతో పాటు సీనియర్ మంత్రులు, అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వెళ్లింది. ఈ సందర్భంగా 2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌ చారిత్రక పర్యటనను, 2018లో ప్రధానమంత్రి నెతన్యాహు భారత పర్యటనను వారిద్దరూ గుర్తుచేసుకున్నారు. ఈ పర్యటనలతో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం, సహకారంలో నవశకం ప్రారంభమైంది. తద్వారా అత్యాధునిక సాంకేతికతలు, సైబర్ భద్రత, వ్యవసాయం, జల నిర్వహణ, ఆరోగ్యం, వ్యవస్థాపన, రక్షణ, భద్రత సహా అనేక రంగాల్లో ద్వైపాక్షిక బంధం విశేషంగా పురోగమించడంపై వారిద్దరూ హర్షం వెలిబుచ్చారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని “శాంతి, ఆవిష్కరణ, శ్రేయస్సు దిశగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి విస్తరించేందుకు ప్రధానమంత్రులిద్దరూ అంగీకరించారు.

షిల్లాంగ్ లోక్‌సభ సభ్యుడు డాక్టర్ రిక్కీ ఏజే సింగ్కాన్ మృతికి ప్రధాని సంతాపం

February 20th, 09:31 am

షిల్లాంగ్ లోక్‌సభ సభ్యుడు డాక్టర్ రిక్కీ ఏజే సింగ్కాన్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు.

బడ్జెట్ మన దేశ ప్రజల ఆర్థిక స్థితిలో మార్పులకు ఎలా తోడ్పడుతుందో ఆర్థిక మంత్రి సమగ్రంగా వివరించారు: ప్రధానమంత్రి

February 12th, 02:13 pm

మన దేశ ప్రజల ఆర్థిక స్థితిని మార్చడానికి ఈ సంవత్సర బడ్జెట్ ఏ విధంగా తోడ్పడుతుందో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్‌సభ దృష్టికి తీసుకువచ్చారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్ గురించీ, సూక్ష్మ- చిన్న- మధ్యతరహా సంస్థలకు మద్దతు, నైపుణ్యాలకు సాన పట్టడం, రాబోయే కాలం అవసరాలను తీర్చగలిగేలా మౌలిక సదుపాయాల కల్పన , ఆరోగ్య సంరక్షణ , విద్య తదితర రంగాలకు ఊతాన్ని ఇచ్చే దిశగా చేస్తున్న కృషిని ఆమె స్పష్టం చేశారు’’ అని శ్రీ మోదీ వివరించారు.

కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సమావేశాన్ని జనవరి 15న ప్రారంభించనున్న ప్రధానమంత్రి

January 14th, 11:19 am

కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సమావేశాన్ని (సీఎస్‌పీఓసీ) న్యూఢిల్లీలోని పార్లమెంటు భవన సముదాయంలో గల సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో 2026 జనవరి 15న ఉదయం 10:30కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆహ్వానితులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.

Prime Minister Condoles the Demise of Shri Shivraj Patil

December 12th, 10:26 am

Prime Minister Shri Narendra Modi today condoled the passing of Shri Shivraj Patil, describing him as an experienced leader who devoted his life to public service.

లోక్‌సభలో హోం మంత్రి విశిష్ట ప్రసంగం.. ప్రధానమంత్రి ప్రశంసలు

December 10th, 10:54 pm

హోం మంత్రి తన ప్రసంగంలో బలమైన వాస్తవాల్ని ప్రస్తావిస్తూ, భారత ఎన్నికల ప్రక్రియలోని విభిన్న అంశాలతో పాటు దేశ ప్రజాస్వామ్యం పటిష్ఠత గురించి కూడా వివరించారు.

వందేమాతరం 150 సంవత్సరాల ప్రత్యేక చర్చ సందర్భంగా లోక్ సభలో ప్రధానమంత్రి ప్రసంగం

December 08th, 12:30 pm

ఈ ప్రత్యేక సందర్భంలో సామూహికంగా చర్చించేందుకు ముందుకు వచ్చినందుకు మీకు, ఈ సభలోని గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని శక్తి, త్యాగస్పూర్తి, నిరాడంబరతను నింపిన ఆ మంత్రాన్ని, ఆ స్పష్టమైన పిలుపును గౌరవంగా గుర్తుచేసుకుంటూ.. ఈ సభలో వందేమాతరాన్ని స్మరించుకోవడం మనందరికీ గొప్ప గౌరవం. వందేమాతరం 150 సంవత్సరాల చారిత్రక ఘట్టానికి మనం సాక్షులుగా నిలబడటం చాలా గర్వకారణం. ఈ కాలం చరిత్ర విస్తృతి నుంచి లెక్కలేనన్ని సంఘటనలను మన ముందుకు తీసుకువస్తుంది. ఈ చర్చ ఖచ్చితంగా సభ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. కానీ మనం ఈ క్షణాన్ని సమష్టిగా ఉపయోగించుకుంటే రాబోయే తరాలకు, ప్రతి తరానికి కూడా నేర్చుకునే మూలంగా ఉపయోగపడుతుంది.