కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు-విభాగాల కార్యదర్శులతో ప్రధానమంత్రి అధ్యక్షతన 3వ అత్యున్నత స్థాయి సమావేశం
August 20th, 09:37 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం తన అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వంలోని భారత ప్రభుత్వ కార్యదర్శులతో 3వ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, అనుసంధానం, భద్రత, విదేశీ వ్యవహారాలు, పరిపాలన సంబంధ వ్యవహారాలపై వారితో చర్చించారు. న్యూఢిల్లీలోని నం.7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోగల అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొన్న ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో భవిష్యత్ కార్యాచరణపై ఆయన కూలంకషంగా సమీక్షించారు.మీరు కేవలం పతకాల సంఖ్యను పెంచడమే కాదు, ఒక తరాన్నే తీర్చిదిద్దారు: సీడబ్ల్యూజీ ఛాంపియన్లతో ప్రధాని మోదీ
August 10th, 10:00 am
గత 12 ఏళ్లుగా తాను క్రీడాకారులను క్రమం తప్పకుండా కలుస్తున్నానని హైలైట్ చేస్తూ, ప్రధాని మోదీ భారత సీడబ్ల్యూజీ ఛాంపియన్లతో ముచ్చటించారు. ఛాంపియన్లు తమ సన్నాహాలు, కార్గిల్ విజయ్ దివస్ నాడు పాకిస్థాన్‌ను ఓడించడం మరియు ఖేలో ఇండియా పథకం విజయంతో సహా సీడబ్ల్యూజీలో తమ అనుభవాలను పంచుకున్నారు. జో ఖేలేగా, వో ఖిలేగా (ఎవరు ఆడతారో, వారే గెలుస్తారు) అనే పదబంధంతో ప్రధాని మోదీ ఈ సంభాషణను ముగించారు.కామన్వెల్త్ గేమ్స్ విజేతలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ
August 10th, 09:30 am
కామన్వెల్త్ గేమ్స్ విజేతలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముచ్చటించారు. గత దశాబ్ద కాలంగా భారత క్రీడా రంగం మారుతున్న తీరును ప్రస్తావిస్తూ… గత 12-13 ఏళ్ల పదవీ కాలంలో జాతీయ క్రీడాకారులను తన నివాసానికి ఆహ్వానించి, సత్కరించటం సాధారణ, అపూర్వమైన సంప్రదాయంగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. సాధారణ ప్రచారాల కన్నా అంకితభావం, నిరంతర కృషితో భారత అథ్లెట్లు సాధించిన విజయాలు... పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. పాఠశాలలకు వెళ్లి మనం చెప్పిన మాటల కన్నా, మీ పతకాలు వారికి ఎక్కువ స్ఫూర్తిని కలిగిస్తాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.కామన్వెల్త్ గేమ్స్ 2026 పతక విజేతలకు ప్రధానమంత్రి ఆతిథ్యం
August 09th, 10:07 pm
ప్రధాని మోదీ కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారతదేశానికి చెందిన అత్యుత్తమ పతక విజేతలను కలుసుకుని వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఛాంపియన్లు తమ గేమ్స్ అనుభవాలను పంచుకున్నారు. క్రీడాకారుల విజయాలను ప్రధాని ప్రశంసిస్తూ, వారు ఎంతో మంది యువతను క్రీడలను చేపట్టడానికి ప్రేరేపిస్తున్నారని పేర్కొన్నారు.Prime Minister Narendra Modi Chairs Second High-Level Meeting with Secretaries of Government of India
July 28th, 08:48 pm
PM Modi chaired the second high-level meeting with Secretaries to the Government of India. The sectors discussed included Finance and Economy, Commerce and Industry and Technology. He stressed the need to reform processes, improve work culture and strengthen institutional efficiency, while also calling for greater participation of young innovators and entrepreneurs in the cybersecurity ecosystem.వికసిత భారత్ లక్ష్యం దిశగా వివిధ రంగాల ప్రగతిపై ప్రధానమంత్రి అధ్యక్షతన సమీక్ష
July 22nd, 07:37 pm
వికసిత భారత్ లక్ష్యం దిశగా వివిధ రంగాల్లో ప్రగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సమీక్షించారు. ఈ మేరకు తన నివాసమైన నం.7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశానికి స్వయంగా అధ్యక్షత వహించారు. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సామాజిక సంక్షేమం సహా అనుబంధ రంగాల పురోగమనంపై ఆయా శాఖల కార్యదర్శులతో కూలంకషంగా చర్చించారు.సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1, 2 ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
February 13th, 06:55 pm
నూతన చరిత్రకు ఇవాళ మనం ప్రత్యక్ష సాక్షులం. విక్రమ సంవత్ 2082, ఫాల్గుణ కృష్ణ పక్షం, విజయ ఏకాదశి, శక సంవత్ 1947 మాఘ 24, నేటి సాధారణ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 13-ఈ శుభదినాన భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో నూతన అధ్యాయం ప్రారంభమవుతోంది. మన శాస్త్రాల ప్రకారం, విజయ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున తీసుకునే ఏ సంకల్పమైనా తప్పక ఫలిస్తుంది. అభివృద్ధి చెందిన భారత్ సంకల్పంతో ఇవాళ మనం సేవా తీర్థ, కర్తవ్య భవన్‌లోకి అడుగుపెడుతున్నాం. మన లక్ష్య సాధనలో విజయమనే దైవిక ఆశీస్సులు మనకు తోడుగా ఉన్నాయి. సేవా తీర్థ, నూతన భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ, పీఎంఓ బృందానికి, కేబినెట్ సెక్రటేరియట్‌కు, వివిధ శాఖల ఉద్యోగులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. వీటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లకు, కార్మికులకూ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.న్యూఢిల్లీలో సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1,2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 13th, 06:30 pm
న్యూఢిల్లీలో నేడు జరిగిన సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1,2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు మనమందరం ఒక కొత్త చరిత్ర సృష్టిని వీక్షిస్తున్నామని పేర్కొన్నారు. 2082 విక్రమ సంవత్సరం నాడు ఫాల్గుణ కృష్ణ పక్షం, విజయ ఏకాదశి శుభ సందర్భంగా మాఘ 24, ప్రస్తుత క్యాలెండర్ ప్రకారం 2026 ఫిబ్రవరి 13న ఉన్న శక సంవత్సరం 1947న భారత్ తన అభివృద్ధి ప్రయాణంలో ఒక కొత్త ఆరంభానికి సాక్షిగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. శాస్త్రాల ప్రకారం విజయ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ రోజున తీసుకున్న సంకల్పం ఎల్లప్పుడూ విజయానికి దారితీస్తుందని ఆయన గుర్తుచేశారు. అభివృద్ధి చెందిన భారత్ అనే సంకల్పంతో మనమందరం నేడు సేవా తీర్థ్, కర్తవ్య భవన్‌లోకి ప్రవేశిస్తున్నామని తెలిపారు. ఈ లక్ష్యంలో విజయానికి దైవిక ఆశీస్సులు మనకు ఉన్నాయని ఆయన చెప్పారు. సేవా తీర్థ్, ఈ కొత్త భవనాల నిర్మాణానికి గానూ ప్రధానమంత్రి కార్యాలయ బృందానికి, మంత్రివర్గ సచివాలయం, వివిధ శాఖల ఉద్యోగులతో సహా అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. వీటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, కార్మిక మిత్రులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.దేవ్‌మోగ్రా, కోయంబత్తూర్, రాయ్‌పూర్, గువాహటి, ఢిల్లీలోని 7 ఎల్ కేఎమ్ వద్ద ఎగ్జామ్ వారియర్స్ (పరీక్ష యోధులు)తో జరిగిన పరీక్ష పే చర్చా ప్రత్యేక ఎపిసోడ్ ను వీక్షించాలని కోరిన ప్రధానమంత్రి
February 03rd, 04:45 pm
ఫిబ్రవరి 6, 2026 ప్రసారమయ్యే ప్రత్యేక పరీక్షా పే చర్చా ఎపిసోడ్‌ను వీక్షించాలని దేశ పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యువతలోని సమష్టి స్ఫూర్తి, ఆసక్తికరమైన సంభాషణలను గమనించవచ్చని ఆయన తెలిపారు.కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ) రంగంలో పనిచేస్తున్న సీఈఓలు, నిపుణులతో ప్రధానమంత్రి సమావేశం
January 29th, 06:33 pm
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ) రంగ నిపుణులు, సీఈఓలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలోని తమ లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసంలోముచ్చటించారు. వచ్చే నెలలో (ఫిబ్రవరి 2026) జరగనున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.ఇంధన రంగ కంపెనీల సీఈఓలతో చర్చించిన ప్రధాని
January 28th, 09:09 pm
ప్రస్తుతం జరుగుతున్న 'ఇండియా ఎనర్జీ వీక్ (ఐఈడబ్ల్యూ) 2026’లో భాగంగా ప్రపంచ ఇంధన రంగ సీఈఓలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చర్చించారు. ఈ రోజు ప్రధాని నివాసమైన లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఈ కార్యక్రమం జరిగింది.ప్రధానమంత్రితో శ్రీ నీరజ్ చోప్రా భేటీ
December 23rd, 03:53 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో శ్రీ నీరజ్ చోప్రా, ఆయన భార్య శ్రీమతి హిమానీ మోర్ ఈ రోజు న్యూఢిల్లీలో నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో సమావేశమయ్యారు. ‘‘మేం క్రీడలు సహా, అనేక అంశాలపై ఎంతో చక్కగా మాట్లాడుకున్నాం’’ అని శ్రీ మోదీ తెలిపారు.రష్యా అధ్యక్షుడికి స్వాగతం పలికిన ప్రధానమంత్రి
December 05th, 10:30 am
‘‘ఈ రోజు సాయంత్రం, రేపూ మన మధ్య జరుగనున్న చర్చల కోసం నేను ఎదురుచూస్తున్నాను. భారత్, రష్యా మైత్రి కాల ప్రభావానికి తట్టుకొని నిలిచింది. ఈ మైత్రితో మన ప్రజలకు ఎంతో మేలు కలిగింది’’ అని శ్రీ మోదీ అన్నారు.అనువాదం: అంధ మహిళల T20 ప్రపంచ కప్ విజేతలతో ప్రధానమంత్రి సంభాషణ
November 28th, 10:15 am
ప్రధానమంత్రి: అది అంతే... మీ అందరినీ నేను పట్టించుకుంటాను.మహిళల అంధుల టీట్వంటీ ప్రపంచ కప్ విజేతలతో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 28th, 10:00 am
మహిళల అంధుల టీట్వంటీ ప్రపంచ కప్‌లో విజయం సాధించిన భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలోని లోక కల్యాణ్ మార్గ్, 7లో సంభాషించారు. క్రీడాకారిణులతో ఆత్మీయంగా ముచ్చటించిన శ్రీ మోదీ.. వారి దృఢ సంకల్పాన్ని ప్రశంసించారు. ఆత్మవిశ్వాసంతో, సవాళ్లను ఎదుర్కొనే తత్వంతో ప్రయాణం కొనసాగించమని వారిని ప్రోత్సహించారు. క్రీడా మైదానంలోనే కాకుండా జీవితంలోనూ కష్టపడి పని చేసేవారు ఎప్పుడూ విఫలం కారన్నారు. క్రీడాకారిణులు తమదైన ప్రత్యేక గుర్తింపును రూపొందించుకున్నారని, అది వారి ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేసిందన్నారు.గౌరవ బ్రిటన్ రాజు చార్లెస్ III బహుమతిగా ఇచ్చిన కదంబ మొక్కను నాటిన ప్రధానమంత్రి
September 19th, 05:24 pm
గౌరవ బ్రిటన్ రాజు చార్లెస్ III బహుమతిగా ఇచ్చిన కదంబ మొక్కను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో నాటారు. ‘‘పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతపై గౌరవ చార్లెస్ కు ఎంతో నిబద్ధత ఉంది. ఈ అంశం మా చర్చల్లో కూడా ప్రస్తావనకు వచ్చింది.’’ అని ప్రధాని శ్రీ మోదీ పేర్కొన్నారు.జాతీయ పురస్కారాలందుకున్న ఉపాధ్యాయుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 04th, 05:35 pm
మన సంప్రదాయంలో ఉపాధ్యాయులపై సహజమైన గౌరవం ఉంది. వారు సమాజానికి గొప్ప బలం కూడా. ఉపాధ్యాయులను ఆశీర్వాదాల కోసం నిలబడేలా చేయడం తప్పు. నేను అలాంటి పాపం చేయాలనుకోను. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీ అందరినీ కలవడం నాకు అద్భుతమైన అనుభవం. మీలో ప్రతి ఒక్కరికి మీ సొంత కథ ఉండి ఉంటుంది. ఎందుకంటే అది లేకుండా మీరు ఈ స్థాయికి చేరుకునేవారు కాదు. ఆ కథలన్నింటినీ తెలుసుకోవడానికి తగినంత సమయం దొరకడం కష్టం. కానీ మీ నుంచి నేను నేర్చుకోగలిగినది నిజంగా స్ఫూర్తిదాయకం.. దాని కోసం నేను మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ జాతీయ పురస్కారం అందుకోవడం ముగింపు కాదు. ఈ పురస్కారం అందుకున్న తర్వాత అందరి దృష్టి మీపైనే ఉంటుంది. దీని అర్థం మీ పరిధి గణనీయంగా విస్తరించింది. గతంలో మీ ప్రభావం, ఆదేశం పరిధి పరిమితమే. ఇప్పుడు ఈ గుర్తింపు తర్వాత అది చాలా విస్తృతంగా పెరుగుతుంది. ఇది ప్రారంభం అని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. మీలో ఉన్న ప్రతిభను మీరు వీలైనంత వరకు అందరితో పంచుకోవాలి. మీరు అలా చేస్తే మీలో సంతృప్తి పెరుగుతుంది. మీరు ఆ దిశలో కృషి చేస్తూనే ఉండాలి. ఈ పురస్కారానికి మీరు ఎంపిక కావడం మీ కృషికి, నిరంతర అంకితభావానికి నిదర్శనం. అందుకే ఇది సాధ్యమైంది. ఒక ఉపాధ్యాయుడు వర్తమానానికి సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు.. దేశ భవిష్యత్తు తరాలను కూడా రూపొందిస్తాడు.. భవిష్యత్తును మెరుగుపరుస్తాడు. ఇది దేశానికి చేసే సేవ కంటే తక్కువ కాదని నేను నమ్ముతున్నాను. నేడు మీవంటి కోట్లాది మంది ఉపాధ్యాయులు అదే దేశభక్తి, నిజాయితీ, అంకితభావంతో దేశ సేవలో నిమగ్నమై ఉన్నారు. అందరికీ ఇక్కడికి వచ్చే అవకాశం లభించకపోవచ్చు. బహుశా చాలామంది ప్రయత్నించి ఉండకపోవచ్చు.. కొందరు గమనించి ఉండకపోవచ్చు. అలాంటి సామర్థ్యాలు గల ఉపాధ్యాయులు అనేకమంది ఉన్నారు. వారందరి సమిష్టి కృషి వల్లే దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.. భావి తరాలూ అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. దేశం కోసం జీవించే అందరి సహకారం దీనిలో ఉంటుంది.Prime Minister Narendra Modi addresses National Awardee Teachers
September 04th, 05:33 pm
During a meeting with National Awardee Teachers, PM Modi remarked that teachers shape not only the present but also the future generation, highlighting India’s guru-disciple tradition. He announced that from 22nd September, the GST reforms will take effect, making essentials cheaper for millions of families. The PM emphasized that every home adopt Swadeshi, with teachers promoting it in schools.రాఖీ పండుగ ప్రత్యేక వేడుక విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి
August 09th, 03:04 pm
ఢిల్లీలోని తన నివాసమైన 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో రాఖీ పండుగ సందర్భంగా పిల్లలతో కలిపి జరుపుకున్న ప్రత్యేక వేడుకల విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. తనపై ఎల్లప్పుడూ నమ్మకం, ఆప్యాయతను చూపించిన నారీ శక్తికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రధాని అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం
May 10th, 02:31 pm
న్యూఢిల్లీలోని 7, లోకకల్యాణ్ మార్గ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, సాయుధ దళాల అధిపతులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.