India and Russia are embarking on a new journey of co-innovation, co-production, & co-creation: PM Modi says during the India–Russia Business Forum
December 05th, 03:45 pm
In his address at the India–Russia Business Forum, PM Modi conveyed deep gratitude to his friend President Putin for joining the forum. He noted that discussions have commenced on a Free Trade Agreement between India and the Eurasian Economic Union. He remarked that meaningful discussions have taken place over the past two days and expressed his happiness that all areas of India–Russia cooperation were represented.Prime Minister Shri Narendra Modi addresses the India – Russia Business Forum with Russian President H.E. Mr. Vladimir Putin
December 05th, 03:30 pm
In his address at the India–Russia Business Forum, PM Modi conveyed deep gratitude to his friend President Putin for joining the forum. He noted that discussions have commenced on a Free Trade Agreement between India and the Eurasian Economic Union. He remarked that meaningful discussions have taken place over the past two days and expressed his happiness that all areas of India–Russia cooperation were represented.ముంబైలో జరిగిన మారిటైమ్ లీడర్స్ కాంక్లేవ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం
October 29th, 04:09 pm
మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు సర్బానంద సోనోవాల్ జీ, శంతను ఠాకూర్ జీ, కీర్తి వర్ధన్ సింగ్ జీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే జీ, అజిత్ పవార్ జీ, షిప్పింగ్, ఇతర పరిశ్రమల నాయకులు, ఇతర విశిష్ట అతిథులు, మహిళలు, పెద్దలు,PM Modi addresses Maritime Leaders Conclave at India Maritime Week 2025 in Mumbai
October 29th, 04:08 pm
In his address at the Maritime Leaders Conclave in Mumbai, PM Modi highlighted that MoUs worth lakhs of crores of rupees have been signed in the shipping sector. The PM stated that India has taken major steps towards next-gen reforms in the maritime sector this year. He highlighted Chhatrapati Shivaji Maharaj’s vision that the seas are not boundaries but gateways to opportunity, and stated that India is moving forward with the same thinking.రోజ్‌గార్ మేళా సందర్భంగా వీడియో మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం
October 24th, 11:20 am
ఈ ఏడాది వెలుగుజిలుగుల దీపావళి పండుగ మీ అందరి జీవితాల్లో కొత్త దివ్వెలు వెలిగించింది. ఈ ఉత్సాహపూరిత ఉత్సవ వాతావరణం నడుమ మీరంతా శాశ్వత ఉద్యోగ నియామక పత్రం పొందడమంటే, వేడుకల ఆనందంతోపాటు విజయం రెట్టింపైనంత సంతోషం కలుగుతుంది. ఇనుమడించిన ఈ ఆనందం నేడు దేశవ్యాప్తంగా 51 వేల మందికిపైగా యువతరం సొంతమైంది. మరోవైపు మీ కుటుంబాలన్నిటా కూడా ఆనందోత్సాహాలు ఎంతగా వెల్లువెత్తుతుంటాయో నేను ఊహించగలను. ఈ సందర్భంగా మీతోపాటు మీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీ జీవితాల్లో ఈ సరికొత్త ప్రారంభానికిగాను నా శుభాకాంక్షలు.రోజ్ గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 24th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రోజ్ గార్ మేళాను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. దీపాల పండగ దీపావళి ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని ప్రధానమంత్రి అన్నారు. పండగ సంబరాల సందర్భంగా శాశ్వత ఉద్యోగ నియామక పత్రాలను అందుకోవటం ఆనందాన్ని రెట్టింపు చేసిందన్నారు. ఒకవైపు పండగ సంతోషం, మరోవైపు ఉపాధి విజయం రెండూ లభించాయి. దేశవ్యాప్తంగా ఇవాళ 51,000 వేల మందికి పైగా యువత సంతోషంగా ఉండటం వల్ల వారి కుటుంబాలు ఆనందంతో వెలిగిపోతున్నాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా నియామక పత్రాలను అందుకున్న వారందరికీ, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. వారి జీవితాల్లో నూతన ప్రారంభానికి శుభాకాంక్షలు చెప్పారు.మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని 18 జిల్లాల పరిధిలో నాలుగు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం..
October 07th, 03:11 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నాలుగు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటి మొత్తం వ్యయం రూ. 24,634 కోట్లు (దాదాపు).గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 25th, 10:22 am
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు భూపేంద్ర చౌదరి గారు, పరిశ్రమకు చెందిన మిత్రులు, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా,గ్రేటర్ నోయిడాలో... ఉత్తర ప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శననుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
September 25th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ‘ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2025’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ప్రదర్శనకు హాజరైన వ్యాపారులు, పెట్టుబడిదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రధాని హార్ధిక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 2,200 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ వాణిజ్య ప్రదర్శనకు రష్యా భాగస్వామ్య దేశంగా ఉందని, కాలపరీక్షకు నిలిచి ఈ భాగస్వామ్యం బలోపేతమవుతోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రభుత్వ సహచరులు, ఇతర భాగస్వాములను ఆయన అభినందించారు. చిట్టచివరి వ్యక్తులకూ అభివృద్ధిని అందించాలన్న అంత్యోదయ మార్గంలో దేశాన్ని నడిపించిన పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజే... ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. అంత్యోదయ అంటే అత్యంత నిరుపేదలకూ అభివృద్ధి ఫలాలు అందేలా చూడడమని, అన్ని రకాల వివక్షలూ తొలగిపోవడమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమ్మిళిత అభివృద్ధి భావననే భారత్ నేడు ప్రపంచానికి అందిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 17th, 11:20 am
మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారు, కేంద్ర మంత్రివర్గ సహచరులు సోదరి సావిత్రి ఠాకూర్ గారు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, దేశంలోని ప్రతి మూల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేదికపై ఉన్న ఇతర ప్రముఖులు, నా ప్రియమైన సోదరీ సోదరులారా!మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం
September 17th, 11:19 am
మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. జ్ఞానానికి అధిదేవత, ధార్ భోజ్‌శాలలో పూజలందుకొనే తల్లి - వాగ్దేవికి నమస్కరిస్తూ.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అలాగే ఈ రోజు దేవశిల్పీ, నైపుణ్యం, సృజనాత్మకతకు అధిపతి అయిన విశ్వకర్మ జయంతి అని చెబుతూ ఆయనకు శ్రీ మోదీ నమస్సులు అర్పించారు. హస్త కళా నైపుణ్యం, అంకితభావంతో దేశ నిర్మాణంలో పాలుపంచు కొంటున్న కోట్లాది సోదరీసోదరులంటే తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు.Prime Minister Narendra Modi to visit Mizoram, Manipur, Assam, West Bengal and Bihar
September 12th, 02:12 pm
PM Modi will be on a 3 day visit to Mizoram, Manipur, Assam, West Bengal and Bihar from 13th to 15th Sep. In Mizoram, he will inaugurate the Bairabi-Sairang New Rail line. In Manipur, he will launch projects worth over ₹7,300 crore. The PM will join Dr. Bhupen Hazarika’s centenary celebrations in Assam. In West Bengal, he will address the Combined Commanders’ Conference in Kolkata. In Bihar, PM Modi will unveil the new Purnea Airport terminal and launch the National Makhana Board.బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల మీదుగా... భాగల్పూర్-దుమ్కా-రాంపూర్హాట్ సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ (177 కి.మీ) డబ్లింగ్ రూ.3,169 కోట్ల వ్యయం... క్యాబినెట్ ఆమోదం
September 10th, 03:05 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన సమావేశంలో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని భాగల్పూర్-దుమ్కా-రాంపూర్హాట్ సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ (177 కి.మీ.)ను మొత్తం సుమారు రూ.3,169 కోట్ల వ్యయంతో డబ్లింగ్ చేసేందుకు ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.భారత్-జపాన్ ఆర్థిక ఫోరంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
August 29th, 11:20 am
ఈ ఫోరంలో చేరినందుకు ప్రధానమంత్రి ఇషిబాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన విలువైన ప్రసంగాన్ని అభినందిస్తున్నాను.భారత్- జపాన్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న ప్రధాని
August 29th, 11:02 am
భారత పరిశ్రమల సమాఖ్య, కీడాన్రెన్ (జపాన్ వాణిజ్య సమాఖ్య) టోక్యోలో 2025 ఆగస్టు 29న నిర్వహించిన భారత్ - జపాన్ ఎకనామిక్ ఫోరంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి శ్రీ షిగేరు ఇషిబా పాల్గొన్నారు. భారత్ -జపాన్ వాణిజ్యాధినేతల ఫోరం సీఈవోలు సహా భారత్, జపాన్ నుంచి పారిశ్రామిక ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.తెలంగాణ... కర్ణాటక... బీహార్... అస్సాం రాష్ట్రాల కోసం 3 మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులు సహా గుజరాత్‌లోని కచ్‌లో దూర ప్రాంతాలను అనుసంధానించే ఒక రైలు మార్గానికి మంత్రిమండలి ఆమోదం
August 27th, 04:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి తెలంగాణ సహా దేశంలోని 5 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే 4 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దాదాపు రూ.12,328 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుల వివరాలిలా ఉన్నాయి:ఢిల్లీ పరిధిలోని యూఈఆర్-II, ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారి విభాగాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
August 17th, 12:45 pm
కేంద్ర కేబినెట్‌లో నా సహచరుడు నితిన్ గడ్కరీ గారు, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ గారు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు అజయ్ తమ్టా గారు, హర్ష మల్హోత్రా గారు, ఈ కార్యక్రమానికి హాజరైన ఢిల్లీ, హర్యానా ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రియమైన సోదర సోదరీమణులారా...రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 17th, 12:39 pm
ఢిల్లీలోని రోహిణిలో దాదాపు రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఎక్స్‌ప్రెస్ రహదారి పేరు ‘ద్వారక’ అని, ఈ కార్యక్రమం ‘రోహిణి’లో జరుగుతోందని చెప్తూ స్థల ప్రాధాన్యాన్ని వివరించారు. జన్మాష్టమి వేళ పండుగ వాతావరణం వెల్లివిరుస్తోందన్న ఆయన.. తానూ ఆ ద్వారకాధీశుడి ప్రాంతానికే చెందినవాడినని గుర్తు చేసుకున్నారు. అక్కడి వాతావరణమంతా కృష్ణ భక్తితో నిండిపోయిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.జులై 26, 27 తేదీల్లో ప్రధాని తమిళనాడు పర్యటన
July 25th, 10:09 am
యూకే, మాల్దీవుల పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళనాడు సందర్శిస్తారు. ట్యుటికోరన్‌లో జులై 26 రాత్రి 8 గంటలకు జరిగే బహిరంగ కార్యక్రమంలో రూ. 4,800 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేస్తారు.భారత్, బ్రిటన్ వ్యాపారవేత్తలతో సమావేశమైన ఇరు దేశాల ప్రధానమంత్రులు
July 24th, 07:38 pm
చారిత్రాత్మక భారత్, బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపై (సీఈటీఏ) సంతకం చేసిన తర్వాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ ఈ రోజు ఇరు దేశాల వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఆరోగ్యం, ఔషధాలు, రత్నాలు - ఆభరణాలు, వాహనాలు, ఇంధనం, తయారీ, టెలికాం, టెక్నాలజీ, ఐటీ, సరకు రవాణా, వస్త్రాలు, ఆర్థిక సేవల రంగాలకు చెందిన పరిశ్రమల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రంగాలు రెండు దేశాల్లో ఉపాధి కల్పన, సమగ్ర ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహదపడుతున్నాయి.